Today Rasi phalalu: నేటి రాశి ఫలాలు: ఈ రాశి వారు వాహనం, భూమి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి-today december 16th rasi phalalu in telugu check zodiac signs horoscope predictions ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు: ఈ రాశి వారు వాహనం, భూమి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి

Today Rasi phalalu: నేటి రాశి ఫలాలు: ఈ రాశి వారు వాహనం, భూమి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి

HT Telugu Desk HT Telugu
Dec 16, 2024 04:00 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 16.12.2024 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

రాశిఫలాలు (దిన ఫలాలు) : 16.12.2024

ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: మార్గశిరం, వారం : సోమవారం, తిథి : కృ. పాడ్యమి, నక్షత్రం : ఆర్ద్ర

మేషం:

పట్టుదలతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. అనుకోని ఖర్చులు ఉండనున్నాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారులకు భాగస్వాములతో సంబంధాలు మెరుగవుతాయి. విద్యార్థులకు మంచి సమయం. శుభకార్య ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి.మరిన్ని మంచి ఫలితాల కోసం దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.

వృషభం:

పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. కోర్టు కేసులలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు రాబడి స్థిరంగా ఉండనుంది. ఉత్సాహంతో కొత్త పనులు ప్రారంభించే ఆలోచన చేస్తారు. శివారాధన మేలు చేస్తుంది.

మిధునం:

రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. సంయమనం అవసరం. పెద్దల సహకారం ఉంటుంది. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. రాజకీయ, ప్రభుత్వ పనులలో జాప్యం కలగొచ్చు. కోర్టు పనులు పూర్తవుతాయి. ఆదాయంలో అస్థిరత. వివాదాల జోలికి వెళ్లకండి. విద్యార్థులకు శ్రమ పెరగవచ్చు.మరిన్ని మంచి ఫలితాల కోసం దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.

కర్కాటకం:

ప్రయాణాలు కలిసివస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవ కాశం ఉంది. సహోద్యోగుల సహకారం ఉంటుంది. పై అధికారు లతో సత్సంబంధాలు ఉంటాయి. ఆత్మీయుల సహకారంతో వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్తగా పరిచయం అయి నవారితో జాగ్రత్త అవసరం. పలుకుబడి పెరుగుతుంది. గృహ నిర్మాణ పనులపై మనసు నిలుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపారులు భాగస్వాములతో సామరస్యంగా వ్యవహరించాలి. గణపతి ఆరాధన శుభప్రదం.

సింహం:

బంధువులు, స్నేహితులతో పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సహకారం అందుతుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. పాత బాకీలు వసూలు. ఇంటా బయటా సంతృప్తికర వాతావరణం ఉంటుంది. తీర్థయాత్రలు, దూర ప్రయాణాలపై దృష్టి పెడతారు. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది.మరిన్ని మంచి ఫలితాల కోసం సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.

కన్య:

ప్రయాణాలు లాభదాయకంగా మారతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులు, బంధువర్గంతో పనులు కలిసివస్తాయి. వాహనం, భూముల విషయంలో జాగ్రత్తతో వ్యవహరించడం మంచిది. రాజకీయ, ప్రభుత్వ, కోర్టు పనుల మూలంగా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులకు ఆదరణ లభిస్తుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. సూర్యారాధన మేలు చేస్తుంది.

తుల:

ఖర్చులు పెరిగే అవకాశం ఉంది నియంత్రణలో ఉండాలి. నలుగురి సహకారంతో శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. ఆదాయంపై శ్రద్ధ వహించండి. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూల పరిస్థితులు ఉండనున్నాయి. వ్యాపారంలో ఖర్చు పెరగవచ్చు. ఆత్మీయుల సలహాతో కొన్ని పనులు నెరవేరుతాయి. మరిన్ని మంచి ఫలితాల కోసం హనుమాన్ చాలీసా పఠించండి.

వృశ్చిక:

కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంటుంది. భూములు, వాహనాల విషయంలో ఖర్చులు పెరుగుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులలో ప్రతిఫలాన్ని పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా ఉండండి. పదోన్నతి మూలంగా స్థాన చలనం ఉండవచ్చు. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.

ధనుస్సు:

నలుగురి సహకారంతో తలచిన పనులు పూర్తవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆత్మీయుల సూచనలను పాటించండి, కొత్త ఉద్యోగంలో చేరవచ్చు. బరువు, బాధ్యతలు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. మరిన్ని మంచి ఫలితాల కోసం నవగ్రహ ఆలయాన్ని సందర్శించండి.

మకర:

కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. దుస్తులు కొనుగోలు చేస్తారు. సహోద్యోగుల సహకారం పొందుతారు. సమయానికి పనులను పూర్తిచేస్తారు. పై అధికారుల మెప్పు పొందుతారు. ఆస్తి తగాదాలు పరిష్కరించుకుంటారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉన్నయి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

కుంభ:

పనుల్లో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. బంధుమిత్రుల సహకారంతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అన్ని విషయాలను చర్చించి, నిర్ణయాలు తీసుకుంటారు. ఏమైనా సమస్యలు వస్తే, వాదనకు దిగకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. శివా రాధన మేలు చేస్తుంది.

మీన:

కొత్త ఉద్యోగంలో చేరతారు. నలుగురిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్తవారితో జాగ్రత్తగా వ్యవహరించండి. బాకీలు వసూలు అవుతాయి. జీవన విధానాన్ని మార్చుకుంటారు. దైవిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. మరిన్ని మంచి ఫలితాల కోసం నర సింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.

Whats_app_banner