పెళ్లి కావాల్సిన వారు అత్తారింట్లో సుఖంగా, సంతోషంగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి?-what kind of remedies should be followed to be comfortable and happy at inlaws home ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  పెళ్లి కావాల్సిన వారు అత్తారింట్లో సుఖంగా, సంతోషంగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి?

పెళ్లి కావాల్సిన వారు అత్తారింట్లో సుఖంగా, సంతోషంగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి?

Ramya Sri Marka HT Telugu
Dec 16, 2024 05:18 PM IST

అత్తమామలతో తగాదాలు, అపార్థాలు భార్యభర్తల మధ్య సంబంధాన్ని చెడగొట్టవచ్చు. ఇవి పెరిగి పెద్దవైతే దంపతుల మధ్య దూరం పెరిగి విడాకుల వరకూ దారితీయచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలను పాటించడం వల్ల అత్తారింట్లో సుఖంగా సంతోషంగా జీవించవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

అత్తారింట్లో సుఖంగా, సంతోషంగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి?
అత్తారింట్లో సుఖంగా, సంతోషంగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి?

పెళ్లయిన తర్వాత ఆడపిల్లలు అత్తమామలతో సత్సంబంధాలు కొనసాగించడం చాలా అవసరం. మంచి సంభాషణ, పరస్పర గౌరవం అనేవి వైవాహిక జీవితంలో శాంతి, సామరస్యాన్ని నెలకొల్పడానికి చాలా దోహదపడతాయి.అత్తమామలతో తగాదాలు, అపార్థాలు భార్యభర్తల మధ్య బంధాన్ని చెడగొట్టవచ్చు. ఫలితంగా దూరం పెరిగి విడాకుల వరకూ వెళ్లచ్చూ.అమ్మాయిలు అత్తమామల నుండి ఆప్యాయత, గౌరవం రెండింటినీ పొందేలా చేయడానికి పెళ్లికి ముందే కొన్ని పరిహారాలు పాటించాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇవి అత్తమామల ఇంట్లో సాఫీగా ఉండేలా సామరస్య వాతావరణాన్ని సృష్టిస్తాయి. వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా కాపాడతాయి. ఆ పరిహారాలేంటో చూద్దాం..

అత్తారింట్లో సంతోషంగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి?

వధువు తల్లిదండ్రులు పాటించాల్సిన పరిహారాలు..

  • అమ్మాయి అత్తమామల ఇంట్లో సంతోషంగా ఉండాలంటే వివాహానికి మూడు రోజుల ముందు ఆమె తల్లిదండ్రులు పసుపు రంగు బట్టలో ఏడు చిన్న చిన్న ఉండలుగా చేసిన పసుపు ముద్దలు, మూడు ఇత్తడి రేకులు, బెల్లం, కుంకుమ, శనగపప్పు వేసి కట్ట కట్టాలి. ఈ కట్టను అమ్మాయి అత్తమామల ఇళ్లు ఉండే దిశలో విసిరేయండి. ఈ పరిహారం మీ కుమార్తె వివాహం తర్వాత అత్తమామలతో శాంతియుత జీవనం గడపడానికి సహాయపడుతుంది. వారి నుంచి ప్రేమను, ఆప్యాయతను పొందేలా చేస్తుంది.
  • పెళ్లి తర్వాత అప్పగింతల సమయంలో ఆడపిల్ల తల్లిదండ్రులు ఒక చిన్న కుండలో గంగాజలం తీసుకుని దాంట్లో రాగి నాణెం, పసుపు వేసి కలపాలి. దీన్ని వధువు తల మీద ఏడు సార్లు పెట్టి తీసేసి ఎవరూ చూడని ప్రదేశంలో పడేయండి. ఇలా చేయడం వల్ల అత్తమామల ఇంట్లో అమ్మాయి ఆనందంగా, హాయిగా ఉంటుంది.

వధువు పాటించాల్సిన పరిహారాలు..

  • వివాహం జరిగిన తర్వాత మొదటి సారి అత్తారింటికి వెళ్లే అమ్మాయి వెళ్లేటప్పుడు పుట్టింటి నుంచి కొబ్బరికాయను తీసుకెళ్లి అత్తారింట్లోని పూజ గదిలో ప్రతిష్టించాలి. ప్రతి రోజూ దానికి పూజ చేయాలి.ఇలా చేయడం వల్ల భర్త, అత్తమామాల నుంచి ప్రేమను పొందుతుంది. వారికి ప్రేమను పంచగలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
  • పెళ్లయ్యాక అత్తారింటికి వెళ్లేటప్పుడు పసుపును ఏడు భాగాలుగా చేసి ఏడు చిన్నచిన్న మూటలుగా కట్టి అత్తారింటి అల్మారో పెట్టండి. ఇది అత్తమామల ఇంట్లో సమృద్ధిని పెంచుతుంది. వారి దృష్టిలో మీ గౌరవాన్ని రెట్టింపు చేస్తుంది.
  • అప్పగింతల సమయంలో మీ తల్లి చేత్తో కొంచెం సింధూరాన్ని తీసుకుని వెళ్లి.. దాన్ని అత్తారింట్లోని సింధూరంలో కలిపండి. ప్రతి రోజూ దీన్ని మీ నుదుటిపై ధరించండి. ఇలా చేయడం వల్ల మీ అదృష్టం పెరుగుతుంది. మీ భర్త మిమ్మల్ని మనస్పూర్తిగా ప్రేమించేలా చేస్తుంది.
  • నల్లమినుములు, పచ్చిగోరింటాకు కలిపి మూట కట్టి మీ అత్తారింటి దిశగా పడేయండి. ఇది మీ భర్తకూ మీకూ మధ్య పరస్పర ప్రేమ, గౌరవం పెరిగేలా చేస్తుంది.
  • వివాహం తర్వాత మొదటిసారి అత్తారింటికి వెళ్లేటప్పుడు వధువు తల్లి దగ్గర నుంచి నాలుగు రాగి మేకులు తీసుకుని అత్తమామల మంచానికున్న నాలుగు కాళ్లకు అమర్చండి. ఇలా చేయడం వ్లల అత్తమామలు, దంపతుల మధ్య అనుబంధం ఎల్లప్పుడూ ప్రేమ, సామరస్యంతో కూడి ఉంటుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. వేరు వేరు వెబ్‌సైట్లు, నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఇది కేవలం మీ నమ్మకాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.

Whats_app_banner