సింధూరం, కుంకుమ రెండూ ఒకటేనా? వీటిలో పెళ్ళైన స్త్రీలు ధరించాల్సింది ఏంటి?-are vermilion and saffron the same what should married women wear ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  సింధూరం, కుంకుమ రెండూ ఒకటేనా? వీటిలో పెళ్ళైన స్త్రీలు ధరించాల్సింది ఏంటి?

సింధూరం, కుంకుమ రెండూ ఒకటేనా? వీటిలో పెళ్ళైన స్త్రీలు ధరించాల్సింది ఏంటి?

Gunti Soundarya HT Telugu
Nov 05, 2024 09:07 AM IST

ఒక మహిళకు వివాహం జరిగింది అనేందుకు చిహ్నం ఆమె పాపిటన ధరించే సింధూరమే. అయితే చాలా మంది కుంకుమ, సింధూరం రెండూ ఒకటేనని అనుకుంటారు. కానీ వీటి మధ్య చాలా వ్యత్యాసం ఉందని ఇవి రెండూ వేర్వేరు అనే విషయం మీకు తెలుసా?

సింధూరం, కుంకుమ ఒకటేనా?
సింధూరం, కుంకుమ ఒకటేనా? (pinterest)

పెళ్ళైన ప్రతి స్త్రీ నుదుట సింధూరం ఉంటుంది. హిందూ ఆచారాలు, వేడుకలలో ఉపయోగించే రెండు సాధారణమైనవి కుంకుమ, సింధూరం. అయితే ఇవి రెండు ఎరుపు రంగులోనే ఉండటం వల్ల రెండు ఒకటేనని భావిస్తారు. కానీ సింధూరం, కుంకుమ రెండూ ఒకదానికి ఒకటి భిన్నంగా ఉంటాయి. వాటి ఉపయోగాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయనే విషయం చాలామందికి తెలియదు. 

సింధూరం అంటే ఏంటి?

సింధూరం అంటే ఎరుపు, నారింజ లేదా గులాబీ రంగులో పొడిగా ఉంటుంది. దీనిని వివాహిత స్త్రీలు ఉపయోగిస్తారు. వైవాహిక స్థితికి చిహ్నంగా భావిస్తారు. దేశంలోని ఎక్కువ ప్రాంతాల్లో సింధూరం అనగానే ఎరుపు రంగుని ఉపయోగిస్తారు. అయితే తూర్పు భాగంలో మాత్రం గులాబీ, నారింజ రంగులో పొడి ఎక్కువగా ఉపయోగిస్తారు. సింధూరాన్ని పసుపు, సున్నం లేదా సీసంతో పాటు సిన్నబార్ అనే ఖనిజంతో తయారుచేస్తారు. పసుపు, సీసం, సున్నం కలపడం వల్ల దీనికి ప్రకాశవంతమైన ఎరుపు రంగు వస్తుంది. అలాగే గులాబీ, నారింజ రంగులలో దొరికే సింధూరం రసాయనికంగా తయారుచేస్తారు.

కుంకుమ అంటే ఏమిటి?

కుంకుమ అంటే ఎరుపు రంగులో ఉంటుంది. సింధూరంతో సమానంగా ఉంటుంది కానీ ఇది భిన్నంగా ఉంటుంది. ప్రార్థనల్లో, మతపరమైన వేడుకలు, ఆచారాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వివాహిత, అవివాహిత స్త్రీలు ఎవరైనా దీన్ని ఉపయోగించవచ్చు. పసుపు, కుంకుమ, సున్నం మిశ్రమంతో కుంకుమను తయారుచేస్తారు. అందువల్ల ఇది ఎరుపు రంగులో ఉంటుంది. సాధారణంగా తిలకాన్ని వేసేందుకు, దేవతలకు, దేవుళ్ళ విగ్రహాలకు బొట్టు పెట్టేందుకు కుంకుమను ఉపయోగిస్తారు. అలాగే కొందరు కుంకుమ పొడిని చేతులు, కాళ్లకు పారాణిగా పెట్టుకుంటారు. 

ఈ రెండిటి మధ్య తేడా ఏంటంటే 

ఇవి రెండూ ఎరుపు రంగులోనే దొరకడం వల్ల రెండింటికి పెద్దగా తేడా ఉండదని అందరూ అనుకుంటారు. అయితే సింధూరం వివాహిత స్త్రీలు మాత్రమే ధరిస్తారు. ఇది ఒక నిర్దిష్ట అర్థాన్ని కలిగి ఉంటుంది. కుంకుమ ఎవరైనా పెట్టుకోవచ్చు. మతపరమైన వేడుకల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనికి వివాహంతో సంబంధం లేదు. పురుషులు, అవివాహిత స్త్రీలు, పిల్లలు సహా ఎవరైనా దీనిని ధరించవచ్చు. నుదుటిపై పై తిలకం వలె దీనిని ధరించవచ్చు.

సింధూరం ఎక్కడ ఉపయోగించాలి

వరుడు వెధవ మెడలో తాళి కట్టిన తర్వాత సింధూరాన్ని ఆమె పాపిటి భాగంలో పెడతారు. అప్పటి నుంచి మహిళ ఈ ఆచారాన్ని ప్రతిరోజు పాటిస్తుంది. మహిళలు తమ భర్త క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ప్రతిరోజు నుదుటి మీద సింధూరం ధరిస్తారు. బెంగాలీలు అయితే దుర్గ పూజ చివరి రోజున సింథూరాన్ని ఒకరికొకరు రాసుకుంటూ వేడుక చేసుకుంటారు. 

కుంకుమను సాధారణంగా బొట్టు మాదిరిగా పెట్టుకుంటారు. మూడవ కన్నుగా పరిగణించే ఆజ్ఞ చక్రంలో దీన్ని ధరిస్తారు. ఇది మెరుగైన అంతర దృష్టికి సహాయపడుతుందని నమ్ముతారు. కొన్ని సంప్రదాయాలలో వివాహాలు, పూజలు, వేడుకలు వంటి సమయంలో చేతులు, కాళ్లకు పసుపు కుంకుమ కలిపి పారాణి  రాసుకుంటారు. 

సింధూరం, కుంకుమ రెండూ ఒకేలా ఉంటాయి. కానీ అవి రెండు వేరువేరు స్వభావాలను కలిగి ఉంటాయి. సింధూరం ఇతర మహిళలతో పంచుకోరు అలా చేయడం ఒక అపవిత్రంగా భావిస్తారు. అయితే కుంకుమ ప్రతి ఒక్కరూ పెట్టుకుంటారు. 

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

 

 

Whats_app_banner