బంగారం దొరికితే తీసుకోవచ్చా..? తీసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?
బంగారం దొరికితే ఎవరైనా తీసుకోకుండా ఉంటారా..? కళ్లకు అద్దుకుని మరీ తీసుకుంటారు. ఎందుకంటే బంగారం అంత విలువైనది, ఖరీదైనది. కానీ ఇలా ఇతరుల బంగారాన్ని మనం తీసుకోవచ్చా.? తీసుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి..? తెలుసుకోండి
రోడ్డు మీద వెళ్లుతున్నప్పుడు లేదా బాగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో కొన్ని సందర్భాల్లో బంగారం దొరుకుతుంది. బంగారం దొరికితే ఎవరూ తీసుకోకుండా ఉండరు.కళ్లకు అద్దుకుని మరీ తీసుకుని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళతారు. దొంగిలించడం లేదు కదా.. దొరికితేనే తీసుకుంటున్నాం కదా.. ఏమవుతుందిలే అని అనుకుంటారు. కానీ ఇతరుల బంగారాన్ని ఇలా మనం తీసుకోవచ్చా..? తీసుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా. వాస్తు,ఆధ్యాత్మిక శాస్త్రాలు దీని గురించి ఏం చెబుతున్నాయి. ఇతరుల బంగారం, వెండి లేదా మరేదైనా విలువైన వస్తువు దొరికితే దాన్ని తీసుకోవడం గురించి వాస్తు, ఆధ్యాత్మిక శాస్త్రాల్లో కొన్ని స్పష్టమైన సూచనలు ఉన్నాయి. తెలుసుకుందాం రండి.
వాస్తు శాస్త్రం..
వాస్తు ప్రకారం అనుకోకుండా దొరికిన వస్తువులను తీసుకోవడం సాధారణంగా మంచిది కాదు. ఇది వాస్తు దోషాన్ని కలిగిస్తుంది. మనకు దొరికిన వస్తువు వేరే వాళ్లు కోల్పోయినది. అది వారికి ఆస్తిని, ఐశ్వర్యాన్ని కోల్పోవడంతో సమానం అంటే వారి మీద ప్రతికూల శక్తుల ప్రభావం, దురదృష్టం ఉన్నాయని అర్థం. వారి వస్తువును మీరు తీసుకోవడం వల్ల ఆ ప్రతికూల శక్తులు, దురదృష్ట ప్రభావం మీ మీద పడుతుంది. ఇది మీ జీవితంలో దుష్ప్రభావాలను చూపవచ్చు. ఇతరుల బంగారం దొరికినా సరే తీసుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు, కుటుంబ సంబంధాల సమస్యలు కలుగవచ్చు. బంగారాన్ని కోల్పోవడం వల్ల ఇతరులు అనుభవించే బాధ, చింత మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు. భవిష్యత్తులో ఇది మీ జీవితంపై ప్రభావం చూపవచ్చు. కష్టాలు, అనారోగ్యం, సంబంధాల్లో ఘర్షణలు, ఉద్యోగ సమస్యలు వంటి రకరకాల దుష్ప్రభావాలను కలిగిస్తుంది. అసంతృప్తి కలిగించే ప్రమాదం ఉంది. వేరు వేరు రకాలుగా నష్టపోవడం లేదా ఇతర అనర్థక పరిణామాలు ఎదురవవచ్చు.
ఆధ్యాత్మిక కోణం..
ఆధ్యాత్మిక దృక్పథంతో చూస్తే వ్యక్యిలో నిజాయితీ, అహింస, దయ తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణాలు. వీటి అనుగుణంగా చూస్తే ఇతరుల బంగారాన్ని లేదా విలువైన వస్తువును ఏ మార్గంలో తీసుకున్నా అది మంచిది కాదు. దొరికిన బంగారాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీ ఆత్మ అభివృద్ధి క్షీణిస్తుంది. శాంతికి నిరోధం కలుగుతుంది. ఇతరుల వస్తువులను అన్యాయంగా స్వీకరించడం వల్ల అసంతృప్తి ఏర్పడుతుంది. దుర్భావం, దోపిడీ వంటి నెగిటివ్ శక్తులతతో మీకు జటిలం అవుతారు. బంగారాన్ని పోగొట్టుకున్న వ్యక్తులు అనుభవిస్తున్న బాధ, క్షోభ, దుఖం మీ జీవితాల మీద ప్రతికూల ప్రభావాలను చూపే అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని మీరే ఆధ్యాత్మికంగా అహంకారిగా, దుర్భావం, దోపిడీ వంటి అనేక నెగటివ్ శక్తులతో జటిలం చేసుకున్న వారు అవుతారు. వివిధ ఆధ్యాత్మిక సిద్ధాంతాల ప్రకారం ఇది పాపపు చర్యగా పరిగణించబడుతుంది. సమాజంలో గౌరవాన్ని తగ్గిస్తుంది. సామాజిక సంబంధాలను దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంది.
ఇతరుల బంగారం, వెండి లేదా ఇతర విలువైన వస్తువులేవైనా దొరికితే దొరికిన చోటే ప్రచారం చేసి వారికి తిరిగి ఇచ్చేయాలి. రోడ్డు మీద దొరికితే దాన్ని అక్కడే వదిలేసి రావాలి. ఒకవేళ తీసుకొస్తే ఏదైనా ఆలయానికి, బ్రహ్మణుడికి, బిక్షాటన చేసేవారికి దానం చేయాలి. అన్ని శాస్త్రాల ప్రకారం ఇది అత్యంత శుభ, పుణ్య కార్యం.