Astrological Diet: మీ రాశిని బట్టి మీరు ఎలాంటి ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటారో తెలుసా?-discover the best foods for your zodiac sign and enhance your health energy and wellbeing ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Astrological Diet: మీ రాశిని బట్టి మీరు ఎలాంటి ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటారో తెలుసా?

Astrological Diet: మీ రాశిని బట్టి మీరు ఎలాంటి ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటారో తెలుసా?

Ramya Sri Marka HT Telugu
Dec 16, 2024 02:46 PM IST

Astrological Diet: రాశులను బట్టి లక్షణాలు, రంగులు, స్వభావాలనే కాకుండా కలిసొచ్చే ఆహారాలను కూడా తెలుసుకోవచ్చని మీకు తెలుసా? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో రాశి వారికి కొన్ని రకాల ఆహార పదార్ధాలు కలిసొస్తాయట. వాటిని ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యంగా ఉండచ్చట. మీ రాశిని బట్టి మీకు ఏ ఆహారం మంచిదో చూడండి.

మీ రాశిని బట్టి మీరు ఎలాంటి ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటారో తెలుసా?
మీ రాశిని బట్టి మీరు ఎలాంటి ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటారో తెలుసా? (Pixabay)

గ్రహాల సంచారాన్ని బట్టి రాశి చక్రాల గుర్తుల వారికి అనుకూలత, ప్రతికూలత ఉంటాయి. పుట్టిన సమయాన్ని బట్టి మీ ఏ రాశికి చెందిన వారో తెలుస్తుంది. దాన్ని బట్టి మీ వ్యక్తిత్వ, ఉద్యోగం, స్వభావంతో పాటు ఆరోగ్యం గురించిన కొన్ని విషయాలను కూడా స్పష్టంగా అంచనా వేయచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. రాశులను బట్టి ఒక్కో రాశి వారికి ఒక్కో రకమైన ఆరోగ్య సమస్య వెంటాడుతుది. ప్రతి రాశి వారికి ప్రత్యేక రాశి వ్యక్తులకు ప్రత్యేకమైన సమస్యలు ఉన్నట్టే.. ప్రత్యేకమైన ఆహాలుంటాయి. అవి వీటిని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. జ్యోతిష్య శాస్త్రాన్ని బట్టి ఒక్కో రాశి వారికి కొన్ని రకాల ఆహార పదార్థాలు కలిసొస్తాయి. అంతేకాకుండా ఏదైనా ముఖ్యమైన పని చేయాలని అనుకుంటున్న రోజుల్లో ఆయా రాశుల వారు తమకు అనుకూలమైన కూరగాయలను తినడం ద్వారా సానుకూల ఫలితాలు పొందొచ్చు. జ్యోతిష్యం ప్రకారం మీ రాశిని బట్టి మీకు ఎలాంటి ఆహారం కలిసొస్తుంది, ఏయే ఆహార పదార్థాలు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయో తెలుసుకోండి.

1. మేషం

ఆహారం: మేషరాశి వారికి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు, పండ్లు, పచ్చిమిరప, మిరియా వంటి ఘాటైన ఆహారాలు సరిపోతాయి.

ఎందుకంటే: మేష రాశి చాలా చురుకుగా, శక్తివంతంగా ఉండే వ్యక్తులు. వీరిని శారీరకంగా, మానసికంగా ఉత్తేజపరిచే ఆహారాలు ఇవ్వడం అవసరం.

2. వృషభం

ఆహారం: మృదువైన ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. పాలు, పన్నీర్, కూరగాయలు, పండ్లు తినాలి.

ఎందుకంటే: వృషభ రాశి వారికి శక్తినిచ్చే, శరీరానికి మంచి పోషణ ఇచ్చే ఆహారం అవసరం.

3. మిథునం

ఆహారం: తియ్యని ఆహారాలు, కోడిగుడ్లు, సూపులు, పప్పు కూరలు, తక్కువ క్యాలరీలైన ఆహారాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు.

ఎందుకంటే: మిథున రాశి వారు స్వభావాన్ని బట్టి చురుకుగా, చక్కటి మేధస్సుతో ఉంటారు. వీరికి తిరిగి ఉత్తేజాన్ని అందించగల ఆహారాలు అవసరం.

4. కర్కాటకం

ఆహారం: పాలు, కూరగాయలు, మెత్తటి ఆహారాలు, చేపలు, టోఫు, సూపులు సరిగ్గా సరిపోతాయి.

ఎందుకంటే: కర్కాటక రాశి వారు గ్రహానుకూలత రీత్యా డీహైడ్రేషన్ కు ఎక్కువగా గురవుతుంటారు. వీరికి ఆరోగ్యకరమైన, హైడ్రేషన్ కలిగించే ఆహారాలు అవసరం.

5. సింహం

ఆహారం: మాంసాహారాలు, పండ్లు, గోధుమలు, బాదంపప్పులు, లేత కూరగాయలు తీసుకోవాలి. నాయకత్వ లక్షణాలతో ఉండే ఈ రాశివారి బలవర్ధకమైన ఆహారాలకే ప్రాధాన్యత ఇవ్వాలి.

ఎందుకంటే: సింహ రాశి వారికి శక్తి కోసం ప్రోటీన్, విటమిన్లు ఉండే ఆహారం ఉత్తమం.

6. కన్యా

ఆహారం: పాలు, సూపులు, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు వంటి ఆహార పదార్థాలు సరిపోతాయి.

ఎందుకంటే: కన్య రాశి వారికి శరీరానికి మంచి ప్యూరిఫైయింగ్ ఆహారాలు అవసరం.

7. తులా

ఆహారం: శీతల పదార్థాలు, పండ్లు, పప్పులు, పప్పు గింజలు, గ్రీన్ టీ లాంటివి తీసుకోవడం బెటర్.

ఎందుకంటే: తులా రాశి వారు శాంతిని కోరుకుంటారు. కాబట్టి వారికి శాంతిని ప్రేరేపించే ఆహారం ఉండాలి.

8. వృశ్చికం

ఆహారం: మసాలా వంటలు, అల్లం టీ, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.

ఎందుకంటే: వృశ్చిక రాశి వారికి అత్యంత శక్తివంతమైన, వేగవంతంగా కోలుకునే ఆహారాలు అవసరం.

9. ధనుస్సు

ఆహారం: తియ్యని ఆహారాలు, చక్కెర, పాలు, వృత్తి ఆధారిత ఆహారాలు ఎంపిక చేసుకోవాలి.

ఎందుకంటే: ధనుస్సు రాశి వారు సాధారణంగా చురుకైన ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కాబట్టి సహజ పదార్థాలు తీసుకోవడం వారి తత్వానికి అనుకూలంగా ఉంటాయి.

10. మకరం

ఆహారం: మాంసాహారాలు, గోధుమలు, కూరగాయలు, పసుపు, జీలకర్ర, బెల్లం

ఎందుకంటే: మకర రాశి వారి శక్తి కోసం మంచి ప్రోటీన్‌లు, విటమిన్లు ఉండే ఆహారం అవసరం.

11. కుంభం

ఆహారం: పచ్చి ఆహారాలు, పాలు, తేనె, జీర్ణ వ్యవస్థకు సహకరించే కూరగాయలు, చికెన్, పప్పు.

ఎందుకంటే: కుంభ రాశి వారు వ్యక్తిత్వం రీత్యా అధిక శక్తితో కూడిన ఆహారాలు తినాలని కోరుకుంటారు.

12. మీనం

ఆహారం: సముద్ర ఆహారాలు, తేలికపాటి ఆహారాలు, పండ్లు, నిమ్మకాయ, జీడిపప్పు లాంటివి బెటర్.

ఎందుకంటే: మీన రాశి వారికి హైడ్రేటింగ్, త్వరగా జీర్ణమయ్యే ఆహారాలు అవసరం.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. వేరు వేరు వెబ్‌సైట్లు, నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఇది కేవలం మీ నమ్మకాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.

Whats_app_banner