Financial Remedies: అప్పుల బాధలు తట్టుకోలేక పోతున్నారా? నల్ల పసుపుతో ఇలా చేయండి!
Financial Remedies: అప్పులతో, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ, ఆ కష్టాల నుంచి గట్టెక్కాలనుకుంటే ఈ చిట్కాలు పాటించండి. నల్ల పసుపు లేదా కాలీ హల్దీ ఉపయోగించి ఆర్థిక పరిస్థితిని ఇలా మెరుగుపరుచుకోండి.
పసుపు మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలుసు. కొన్ని సందర్భాల్లో దీనిని బాధల నుంచి ఉపశమనం కలిగించే ఔషదంగా కూడా వినియోగిస్తారు. వేడి పాలలో కాస్త కలుపుకొని తాగితే ఒంటి నొప్పులు మాయం అయిపోతాయట. దెబ్బ తగిలిన చోట పసుపు రాస్తే దాని ప్రభావం తగ్గుతుందట. ఇవన్నీ తెలిసినవే కదా అనుకోకండి.. అసలు విషయం ఏంటంటే.. పసుపు కేవలం శారీరక ఆరోగ్యం కోసమే కాదు ఆర్థిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్నేళ్లుగా పట్టిపీడిస్తున్న అప్పుల సమస్యల నుంచి గట్టెక్కించే శక్తి పసుపుకు ఉందట.
శాస్త్రాల ప్రకారం, పసుపు అంటే విష్ణు మూర్తి స్వరూపంగా భావిస్తారు. మన జీవితాల్లో సంతోషం, శ్రేయస్సును తీసుకొచ్చే దివ్యమైన పదార్థంగా వర్ణిస్తారు. అయితే ఇవన్నీ సాధ్యమయ్యేది పసుపు రంగులో ఉండే పసుపుతో కాదు. చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన నల్ల పసుపుతో. నల్ల పసుపుతో అద్భుతమైన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయట. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, నల్ల పసుపు చాలా దోషాల పరిహారానికి ఉపయోగపడుతుంది. శారీరకంగానూ, ఆధ్మాత్మికంగానూ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. నల్ల పసుపుతో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. వ్యక్తిగత జీవితాన్ని పట్టిపీడిస్తున్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి సానుకూల పరిస్థితులను కలగజేస్తుంది.
నల్ల పసుపుతో ఏం చేయాలి:
వృథా ఖర్చులు తగ్గించడం
అనవసరమైన లేదా వృథా ఖర్చులను నివారించడానికి నల్ల పసుపుతో ఇలా చేయండి. కాస్త కుంకుమతో కలిపి వెండిగిన్నెలో ఉంచండి. లక్ష్మీదేవి విగ్రహం దగ్గరకు పాదాలను తాకించి ఇంట్లో డబ్బులు ఉంచే ప్రదేశంలో పెట్టండి.
ఆర్థిక సంక్షోభం నివారించడం
కొన్ని విశ్వాసాల ప్రకారం, ఆర్థిక సంక్షోభాన్ని నల్ల పసుపుతో నివారించవచ్చు. గణేశ్ చతుర్దశి, శుక్రవారం కలిసి వచ్చిన రోజున నల్ల పసుపు, వెండి నాణేన్ని పసుపు వస్త్రంలో చుట్టండి. పూజా స్థలంలో ఆ వస్తువును ఉంచాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. దీంతో పాటు ఆర్థిక సంక్షోభాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
వ్యాపారంలో పురోగతి కోసం
వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారు నల్ల పసుపును, కుంకుమ పువ్వును కలిపి మెత్తగా రుబ్బండి. దానికి పవిత్రమైన నది నీటిని కలిపి మెడపై స్వస్తిక్ గుర్తు వేసుకోండి. ప్రతి నెలా తొలి బుధవారం ఇలా చేస్తే వ్యాపార విస్తరణ కోసం మరిన్ని అవకాశాలు చేతికందుతాయి.
సంపద మెరుగవడం కోసం
నల్ల పసుపును, కుంకుమతో కలిపి ఎర్రని వస్త్రంతో చుట్టండి. గురు-పుష్య నక్షత్ర కలిసిన రోజున ఆ వస్త్రపు మూటని డబ్బులు ఉంచే ప్రదేశంలో పెట్టండి. ఇలా చేయడం వల్ల డబ్బు ఇంటికి రావడం క్రమంగా పెరుగుతూ ఉంటుందని చాలా మంది విశ్వాసం.
ఆర్థిక వృద్ధి కోసం
మీ ఆర్థిక పరిస్థితి మెరగవ్వాలంటే, నల్ల పసుపును, గోమతి చక్రతో, వెండి నాణెం, గవ్వతో కలిపి పసుపు రంగులో ఉండే వస్త్రంలో కలిపి చుట్టండి. దీనిని ఎవరూ తాకని చోట ఉంచితే ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగవుతుంది.