వేసవి కాలం మరికొన్ని రోజుల్లో రానుంది. వేడి ఎక్కువగా ఉండడంతో ఆ కాలంలో డీహైట్రేషన్‍తో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
Photo: Pexels
అందుకే ఎండాకాలంలో ఎప్పుడూ హైడ్రేటెడ్‍గా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో హైడ్రేషన్ పెరిగేందుకు ఉపయోగపడే ఐదు రకాల ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ ఇవే.
Photo: Pexels
కొబ్బరి నీళ్లలో పోటాషియమ్, సోడియం, మెగ్నిషియమ్ పుష్కలంగా ఉంటాయి. ఈ నీటిని తాగితే శరీరంలో హైడ్రేషన్‍తో పాటు శక్తి కూడా పెరుగుతుంది.
Photo: Pexels
కీరదోసకాయ జ్యూస్‍లో వాటర్ కంటెంట్, యాంటీఆక్సిడెంట్లు సహా మరిన్ని పోషకాలు ఉంటాయి. ఈ జ్యూస్ మీకు హైడ్రేషన్ అందిస్తుంది. చర్మానికి కూడా మేలు చేస్తుంది.
Photo: Pexels
పుచ్చకాయ జ్యూస్‍లోనూ పొటాషియమ్, మెగ్నిషియమ్ లాంటి ఎలక్ట్రోలైట్స్, వాటర్ కంటెంట్ మెండుగా ఉంటాయి. అందుకే వేసవిలో ఈ జ్యూస్ తాగితే చాలా మంచిది.
Photo: Pexels
నిమ్మరసం తాగడం వల్ల కూడా హైడ్రేషన్ పెరుగుతుంది. ఈ రసంలో ఉప్పు వేసుకొని తాగొచ్చు. తేనె కలుపుకొని తాగడం కూడా మేలు చేస్తుంది.
Photo: Pexels
కలబంద (అలో వేరా) జ్యూస్‍లో కాల్షియమ్, మెగ్నిషియమ్, పొటాషియమ్ సహా మరిన్ని పోషకాలు ఉంటాయి. ఈ జ్యూస్ తాగితే హైడ్రేషన్ మెరుగవుతుంది.
Photo: Pexels
నిద్రపోయే ముందు మనం చేసే కొన్ని పనుల కారణంగా సరైన నిద్రపట్టకపోవచ్చు. దీంతో నిద్ర నాణ్యత దెబ్బతిని ఆ తర్వాత రోజుపై ప్రభావం పడుతుంది. పడుకునే ముందు చేయకూడని 8 పనులేంటో చూద్దాం.