చలికాలంలో జలుబు, దగ్గు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఉష్ణోగ్రతల్లో మార్పులతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో వేడిని సమతుల్యం చేసేందుకు పసుపు పాలు సహాయపడతాయి. గోల్డెన్ మిల్క్ తో కలిగే 6 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
pexels
By Bandaru Satyaprasad Dec 11, 2024
Hindustan Times Telugu
పసుపు పాలలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మీ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
pexels
చలికాలంలో గాయాలు తొందరగా తగ్గవు. పసుపు పాలలోని యాంటీ బాక్టీరియల్, హీలింగ్ లక్షణాలు గాయాల నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. గాయాన్ని నయం చేసేందుకు తోడ్పడుతుంది.
pexels
పసుపు పాలు జీర్ణక్రియకు సహాయపడతాయి. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరు వెచ్చని గోల్డెన్ మిల్క్ తాగితే గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
pexels
శరీరంలో వాపు, నొప్పి ఉంటే...ఒక గ్లాస్ వేడి పసుపు పాలు మీకు సహాయపడతాయి. ఇందులోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు నొప్పిని తగ్గిస్తుంది.
pexels
చలికాలంలో కొందరికి నిద్ర సరిగ్గా పట్టదు. రాత్రి పడుకునే ముందు ఒక కప్పు వెచ్చని పసుపు పాలు తాగితే ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
pexels
గోల్డెన్ మిల్క్ -టర్మరిక్ మిల్క్ భారతీయ సంప్రదాయ ఆరోగ్య పానీయం. దీనిని టర్మరిక్ లాట్ అని పిలుస్తారు. దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం. గోరు వెచ్చని పాలలో ఒక చెంచా పసుపు కలిపింది. పాలు కాస్త వేడిగా ఉన్నప్పుడే తాగండి. అవసరమైతే చక్కెర, మిరియాలు, దాల్చిన చెక్క జోడించుకోవచ్చు.
pexels
చలికాలంలో జలుబు, దగ్గు, ఫ్లూ రావడం సర్వసాధారణం. ఒక గ్లాసు వెచ్చని పసుపు పాలు తాగితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి.
pexels
లవంగాలతో ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉంటాయి. అయితే వాటిని పరగడపునే తింటే మరింత మంచిది