Foody Zodiac Signs: ఈ రాశుల వారికి ఆహారం అంటే చాలా ఇష్టం.. బాగా తింటారు!-these zodiac signs love food and tend to eat a lot according to astrology ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Foody Zodiac Signs: ఈ రాశుల వారికి ఆహారం అంటే చాలా ఇష్టం.. బాగా తింటారు!

Foody Zodiac Signs: ఈ రాశుల వారికి ఆహారం అంటే చాలా ఇష్టం.. బాగా తింటారు!

Ramya Sri Marka HT Telugu
Dec 14, 2024 09:35 AM IST

Foody Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో రాశికి చెందిన వ్యక్తులకు ఒక్కో రకమైన ఇష్టాలు, అభిరుచులు ఉంటాయి. కొందరికి ఆట అంటే ఇష్టం మరికొందరికి పాట అంటే ఇష్టం. మరి కొందరికి బాగా తినడం అంటే ఇష్టం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి ఆహారం అంటే చాలా ఇష్టమట.. బాగా తింటారట.

 ఈ రాశుల వారికి ఆహారం అంటే చాలా ఇష్టం.. బాగా తింటారు!
ఈ రాశుల వారికి ఆహారం అంటే చాలా ఇష్టం.. బాగా తింటారు! (pexel)

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఒక్కో రాశి వ్యక్తులకు ఒక్కో రకమైన స్వభావం, ప్రవర్తన, అభిరుచుల, అలవాట్లు ఉంటాయి. ఈ రకంగా చూస్తే ప్రతి రాశి వారికి ప్రత్యేక ఇష్టాలు, ఆహారపు అలవాట్లు ఉంటాయి. వారి రాశిని బట్టి వారి ఇష్టపడే వంటకాలు, భోజన రుచి భిన్నంగా ఉంటాయట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు ఆహారం విషయంలో చాలా శ్రద్ధగా, స్పష్టంగా ఉంటారట. వారి తినే ఆహారం రుచిగా, అమోఘంగా ఉండాలని కోరుకుంటారట. అందుకే వారు ఎక్కువగా తినే అలవాట్లను కలిగి ఉంటారట.అస్ట్రాలజీ ప్రకారం ఎక్కువగా తినే రాశుల వారు ఎవరో చూద్దాం..

yearly horoscope entry point

1. వృషభ రాశి :

వృషభరాశి వారు భౌతికమైన, శారీరక సుఖం మీద ఎక్కువ దృష్టి పెడతారు. వారు ఎప్పుడూ భోజనంలో రుచికరమైన వంటకాలు కోరుకుంటారు. వీరికి ఆహారం అనేది ప్రాధాన్యత ఉన్న అంశం. వీరికి అత్యంత నాణ్యమైన, రుచికరమైన వంటకాలు అంటే ఇష్టం. సమయానికి తినాలని అనుకుంటారు. ఆహారం కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధపడతారు. లగ్జరీ ఫుడ్ అంటే వీరికి మరీ ఇష్టం. చాక్లెట్, ఐస్ క్రీమ్ వంటివి పసందుగా తింటారు.మాంసాహార వంటకాలు, సూప్స్, పాస్తా వంటి వంటకాలను బాగా ఇష్టపడతారు.

2. కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారు కుటుంబంతో ఎక్కువ గడపాలని కోరుకుంటారు. సౌమ్యంగా, నమ్మకంగా వ్యవహరించే వ్యక్తులు. వీరు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వీరికి ఇంట్లో తయారు చేసిన ఆహారాలంటేనే చాలా ఇష్టం. ఇంట్లో తినే వంటకాలు, సాంప్రదాయ వంటకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.నాన్చిన రొట్టెలు, దోశ, చపాతీలు, వడలు వీరికి ప్రీతికరం. మిఠాయిలు, పాయసం, పులిహోర, ఆరటిపళ్లు, సూప్స్ అంటే ప్రత్యేకమైన ఇష్టం.ఫ్యామిలీ డిన్నర్స్, ప్రత్యేక వేడుకల్లో పరిమితి లేకుండా తినడం వీరి స్పెషాలిటి.

3. సింహ రాశి:

సింహరాశి వారు ఆత్మవిశ్వాసంతో కూడిన, శక్తివంతమైన వ్యక్తులు. వీరికి ఖరీదుగా కనిపించే, విలాసవంతమైన ఆహారం అంటే చాలా ఇష్టం. ఖరీదైన వంటకాలు, పెద్ద పండగలు, విందులల్లో భోజనాలు చేయడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. రెస్టారెంట్లలో ప్రత్యేకమైన ఫుడ్ ట్రై చేయడం, కొత్త కొత్త రుచుల కోసం ప్రయాణించడం వీరికి ఇష్టం.కేక్, పన్నీర్, పాస్తా వంటి రిచ్ డిషెస్ అంటే వీరికి పిచ్చి. ఎగ్జాటిక్ ఫుడ్, ఫ్రెంచ్ ఫుడ్, రకరకాల ఫ్రూట్ డిషెస్ వీరి ఆహారపు అభిరుచిల్లో భాగం.

4. తులా రాశి:

తులారాశి వారు సామాజికంగా, ఫ్యామిలీహార్మనీగా, సౌమ్యంగా ఉంటారు. ముఖ్యంగా వీరు సమతుల్యంగా జీవించటానికి ఇష్టపడతారు. ఆహారపు అలవాట్లలో కూడా సమతుల్యత పాటిస్తారు. వీరికి సాఫ్ట్, డైలీ ఫుడ్ ఇష్టం. ఆహారం అనేది ఆరోగ్యవంతంగా ఉండాలని భావిస్తారు. సుసంపన్నమైన, తేలికపాటి ఫుడ్ ఎంచుకుంటారు. పండ్లు, చపాతీలు, కూరగాయలు ఇష్టంగా తింటారు. డైట్, సమతుల్యత కోసం సలాడ్, ఫ్రూట్స్, పల్లీలు, సూప్, నట్స్ వంటి వాటిని ఇష్టంగా తింటారు.

5. మకర రాశి:

మకర రాశి వారు క్రమబద్ధత, కష్టపడే స్వభావం కలిగి ఉంటారు. వీరికి ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు ఉంటాయి. కానీ వీరికి బాగా తినే అలవాటు కూడా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం, సాంప్రదాయ వంటకాలు ఇష్టపడతారు. పాలు, పప్పు, కూరగాయలు, మాంసాహార వంటకాలు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. ఆలివ్ ఆయిల్, సూప్స్, కాలిఫ్లవర్, క్యాబేజీలను ఇష్టంగా తింటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner