Eating In Bed: మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదా? శాస్త్రం ఏం చెప్తోంది?-eating in bed what happens if we eat in bed and correct way to eat food ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Eating In Bed: మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదా? శాస్త్రం ఏం చెప్తోంది?

Eating In Bed: మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదా? శాస్త్రం ఏం చెప్తోంది?

Peddinti Sravya HT Telugu
Dec 11, 2024 08:14 AM IST

Eating In Bed: చాలా మంది పెద్దవాళ్లు మంచం మీద కూర్చుని తినొద్దని చెప్తూ ఉంటారు. నానమ్మలు, అమ్మమ్మలు కూడా ఈ విషయాన్ని చెప్పే ఉంటారు. అయితే, ఎందుకు మంచం మీద కూర్చుని తినకూడదు?, దాని వెనుక కారణాలేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Eating In Bed: మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదా? శాస్త్రం ఏం చెప్తోంది?
Eating In Bed: మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదా? శాస్త్రం ఏం చెప్తోంది? (pinterest)

హిందువులు అనేక ఆచారాలను, నియమాలను పాటిస్తూ ఉంటారు. కానీ, చాలా మంది ఈరోజుల్లో వాటిని కొట్టి పారేస్తున్నారు. కానీ, ఈ పద్ధతులు వెనుక పెద్ద కారణాలే ఉన్నాయి. పూర్వీకులు కూడా అందుకే అన్ని ఆచారాలను పాటించేవారు. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం తగిన పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. కొన్నిటిని పాటించడం వలన ప్రతికూల శక్తి తొలగిపోయి,సానుకూల శక్తి కలుగుతుంది. అందుకనే మన పెద్దలు ఇది మంచి, ఇది చెడు అని చెప్తూ ఉంటారు. మనం రోజూ చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కూడా ఇబ్బందులు వస్తాయి.

yearly horoscope entry point

మంచం మీద కూర్చుని తినొద్దు:

చాలా మంది పెద్దవాళ్లు మంచం మీద కూర్చుని తినొద్దని చెప్తూ ఉంటారు. నానమ్మలు, అమ్మమ్మలు కూడా ఈ విషయాన్ని చెప్పే ఉంటారు. అయితే, ఎందుకు మంచం మీద కూర్చుని తినకూడదు?, దాని వెనుక కారణాలేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఎందుకు మంచం మీద కూర్చుని ఆహారం తీసుకోకూడదు?

మనం తినే ఆహారాన్ని అన్నపూర్ణగా భావిస్తాము. మనం ఏదైనా ఆహారాన్ని తినేటప్పుడు నమస్కరించుకొని, ఆ తర్వాత తింటాము. అయితే, మంచం మీద కూర్చుని తినడం అనేది భోజనాన్ని అవమానించడం. ఎందుకంటే మంచం అపవిత్రం. మంచం మీద నిద్రపోతాం. ఒకవేళ కనుక మంచం మీద కూర్చుని ఆహారం తీసుకుంటే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. అలాగే రాహువు, బృహస్పతి కూడా ఆగ్రహానికి గురవుతారు.

ఆనందం, ధనం ఉండవు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి, రాహువు, బృహస్పతి ఆనందాన్ని, ధనాన్ని ఇవ్వడంలో ముఖ్యపాత్ర వహిస్తారు. అదే ఒకవేళ వారు ఆగ్రహం చెందినట్లయితే సంతోషం ఉండదు. ధనం కూడా ఉండదు. కాబట్టి ఈ పొరపాటు చేయకుండా ఉండడం మంచిది.

ఎక్కడ భోజనం చేస్తే మంచిది?

వంటగదికి సమీపంలో కూర్చుని ఆహారం తీసుకోవడం మంచి ఫలితాలను ఇస్తాయి. వంట గది సమీపంలో డైనింగ్ టేబుల్ పై కూర్చుని తినొచ్చు. లేకపోతే కింద కూర్చుని తినొచ్చు. ఇలా చేయడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు కలగవు. కింద కూర్చుని తినడం లేదా డైనింగ్ టేబుల్ పై కూర్చుని తినడం వలన పొట్ట నిదానంగా ఉండడం వలన నేరుగా ఆహారం పొట్టలోకి వెళ్తుంది. దీంతో తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. అదే ఒకవేళ మంచంపై కూర్చుని తింటే మనం వంగి తినాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఆహారం వాయు నాళంపై లోపల ఇరుక్కుంటుంది. ఇలా ఇన్ని నష్టాలు ఉంటాయి. కాబట్టి, మంచంపై కూర్చుని భోజనం చేయడం మంచిది కాదు.

Whats_app_banner

సంబంధిత కథనం