Mokshada Ekadashi: నేడే మోక్షద ఏకాదశి.. విష్ణుమూర్తి ఆరాధనలో ఏ రాశి వారు ఎలాంటి నైవేద్యం సమర్పించాలి?
Mokshada Ekadashi: డిసెంబర్ 11 అంటే నేడు మోక్షద ఏకాదశి పండగ. ఈ రోజు విష్ణుమూర్తి, లక్ష్మీదేవిలను ఆరాధించడం వల్ల సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం నెలకొంటాయని విశ్వాసం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజున ఒక్కో రాశి వారు ఒక్కో రకమైన నైవేద్యంతో విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.
ఏకాదశిలలో ఉత్తమమైనది మోక్షద ఏకాదశి. ప్రతి ఏడాది మార్గశిర మాసంలొని శుక్లపక్ష ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు. ఈ రోజు విష్ణుమూర్తి, లక్ష్మీదేవిలను భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వల్ల జీవితం సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యంతో నిండిపోతుందని విశ్వాసం. బ్రహ్మాండ పురాణం ప్రకారం మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం దీక్ష చేపట్టడం వల్ల పితృదేవతలకు మోక్షం లభించి సంతానం కలుగుతుంది. మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల పాపాలు నశిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజు ఒక్కో రాశి వారు ఒక్కో రకమైన పూజలు చేయడం, నైవేద్యాన్ని సమర్పించడం వల్ల విష్ణమూర్తినీ, లక్ష్మీదేవినీ ప్రసన్నం చేసుకొవడం సులభమవుతుందని వారి ఆశీస్సులు తప్పక లభిస్తాయని నమ్మకం.
పూజకు శుభసమయం ఏది?
ఈ ఏడాది డిసెంబర్ 11వ తేదీ బుధవారం మోక్షద ఏకాదశి పర్వదినాన్ని జరుపుకోనున్నారు.
తిథి ప్రారంభం - డిసెంబర్ 11, 2024 ఉదయం 03:42 గంటలకు
ఏకాదశి తిథి ముగింపు - డిసెంబర్ 12, 2024 ఉదయం 01:09 గంటలకు
వ్రత పరాయణ సమయం - డిసెంబర్ 12, పరాయణం,
ఉపవాసాన్ని విచ్ఛిన్నం చేయడానికి తగిన సమయం - ఉదయం 07:05 నుండి 09:09 గంటల వరకు
ద్వాదశి ముగింపు తిథి - 10:20గంటలు
ఏ రాశి వారు ఎలాంటి నైవైద్యం సమర్పించాలి?
మేష రాశి:
మోక్షద ఏకాదశి రోజున మేష రాశి వారు మహావిష్ణువుకు గంగా జలంతో అభిషేకం చేసి పసుపు చందనం పూయాలి. బంగాళాదుంప, పప్పు, కూరగాయలు, విత్తనాలు మంచి నైవేద్యాలు.
వృషభ రాశి:
ఈ రాశి విష్ణువు అనుగ్రహం పొందడానికి ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించాలి. పాలు, తేనె, పానీయాలు వంటి వాటిని సమర్పిస్తే శుభం కలుగుతుంది.
మిథున రాశి:
మిథున రాశి వారు మోక్షద ఏకాదశి నాడు విష్ణువుకు శనగపిండి లడ్డూను సమర్పించాలి. పండ్లు, తేనె, పాలు వంటి సాధారణ నైవేద్యాలను అర్పించడం కూడా శుభప్రదమే.
కర్కాటక రాశి:
శ్రీమహావిష్ణువు అనంతమైన అనుగ్రహం పొందడానికి కర్కాటక రాశి వారు మోక్షద ఏకాదశి రోజున భగవంతుడికి పసుపు పువ్వులను సమర్పించాలి. మినప్పప్పు, కూరగాయలు, విత్తనాలు, పండు వంటి ఆరోగ్యకరమైన నైవేద్యాలను కూడా అర్పించవచ్చు.
సింహ రాశి:
మోక్షద ఏకాదశి రోజున సింహ రాశి వారు విష్ణుమూర్తికి బెల్లం సమర్పించి పంచామృతంతో అభిషేకం చేయాలి. పసుపు, పాలు, మిఠాయిలు, వంటలు సమర్పిస్తే శుభం.
కన్యా రాశి:
కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువు అనంతమైన అనుగ్రహం పొందడానికి పసుపు గంధాన్ని స్వామికి పూయండి. పండ్లు, పాలు, పిండిపధార్థాలు మంచి నైవేద్యాలు.
తులా రాశి:
మోక్షద ఏకాదశి పర్వదినాన తులా రాశి వారు విష్ణువుకు పచ్చిపాలు, గంగా జలాలతో అభిషేకం చేసి పూజించాలి. తేనె, పాలు, పండ్లు, మంచి వంటలు అర్పించడం శుభప్రదంగా ఉంటుంది.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారు విష్ణువుకు పెరుగు, తేనెతో అభిషేకం చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించాలి. పండ్లు, పాలు, మిఠాయిలు, బెల్లం సమర్పించడంలో శుభ ఫలితాలు ఉన్నాయి.
ధనుస్సు రాశి:
మోక్షద ఏకాదశి రోజున ధనుస్సు రాశి వారు శ్రీ హరి విష్ణువుకు పసుపు రంగు పూలు, వస్త్రాలు సమర్పించాలి. పప్పు, పండ్లు, విత్తనాలు మరియు ఇతర పూర్ణాహుతి నైవేద్యాలు అందిస్తే మంచి ఫలితాలు.
మకర రాశి:
మోక్షద ఏకాదశి రోజున మకర రాశి వారు శ్రీ విష్ణు చాలీసా పఠించి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందాలి. మామిడి పండ్లు, పాలు, పసుపు, కుంకుమను అర్పించడం శుభం.
కుంభ రాశి:
మోక్షద ఏకాదశి రోజున కుంభ రాశి వారు విష్ణుమూర్తికి బెల్లం, శనగపప్పు సమర్పించి పసుపు ముద్దలను సమర్పించాలి. పప్పు, పండ్లు మిఠాయిలు మంచి నైవేద్యాలు.
మీన రాశి:
మోక్షద ఏకాదశి నాడు విష్ణువు అనుగ్రహం పొందడానికి మీన రాశి వారు ఓం విష్ణువే నమః అనే మంత్రాన్ని పఠించాలి. పాలు, తేనె, పండ్లు, పిండి పదార్థాలు, శుభ కార్యాల కోసం నైవేద్యంగా సమర్పిస్తే శుభప్రదంగా ఉంటుంది.