చపాతీలు సుతిమెత్తగా రావాలంటే ఈ చిట్కాలు పాటించండి

By Haritha Chappa
Dec 11, 2024

Hindustan Times
Telugu

చపాతీలు మెత్తగా ఉంటేనే తినాలనిపిస్తుంది. కానీ ఎంతో మందికి అవి మెత్తగా చేయడం రాదు. 

చపాతీ పిండిని కలిపేటప్పుడ రెండు స్పూన్ల నూనెను వేసి కలపండి. 

పిండి కలిపిన తరువాత పైన మూత పెట్టి పావు గంట సేపు పక్కన వదిలేయండి. 

చపాతీ పిండిని చల్లటి నీటిని కాకుండా గోరువెచ్చగా ఉన్న నీటిని వాడడం వల్ల చపాతీలు మెత్తగా వస్తాయి. 

 పిండి కలుపుతున్నప్పుడే చిటికెడు బేకింగ్ సోడాను వేసి కలిపితే చపాతీలు మెత్తగా వస్తాయి. 

చపాతీ పిండి కలిపేటప్పుడు పాలను కూడా కలిపితే అవి మెత్తగా వస్తాయి. 

చపాతీని ఒత్తుతున్నప్పుడు పొడి పిండిని అధికంగా వేయకండి. అవి గట్టిగా అయిపోయే అవకాశం ఉంది. 

 చపాతీలు కాల్చాక వాటిని గాలికి వదిలేయకుండా పైన మూత పెడితే అవి మెత్తగా ఉంటాయి.

 అలాగే చపాతీను పెద్ద మంట మీద కాల్చితే అవి గట్టిగా అయిపోతాయి. కాబట్టి మీడియం మంట మీదే కాల్చాలి. అప్పుడు అవి మెత్తగా వస్తాయి. 

ఎముకల ఆరోగ్యం మెుత్తం శరీరంలో కీలకమైన అంశం. మానవ శరీరంలో ఎముకలను బలంగా ఉంచుకునేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి.

Unsplash