Gita Jayanthi: రేపే గీతా జయంతి, ఇలా చేస్తే సుఖ సంతోషాలు కలుగుతాయి
Gita Jayanthi: 2024 లో గీతా జయంతి 5161 వార్షికోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈరోజే శ్రీకృష్ణుడు అర్జునుడికి గీత జ్ఞానాన్ని ఇచ్చాడు. అందుకనే గీతా జయంతిగా జరుపుతాము. గీతా జయంతి నాడు కృష్ణుడు ఆశీర్వాదం పొంది సంతోషం, శ్రేయస్సు కలగాలంటే కొన్ని పరిహారాలను పాటించడం మంచిది.
మార్గశిర మాసం శుక్లపక్షం యొక్క ఏకాదశి రోజున కృష్ణుడు అర్జునుడికి గీత సందేశాన్ని ఇచ్చారు. కురుక్షేత్రంలో అర్జునుడికి 45 నిమిషాల పాటు కృష్ణ భగవానుడు భగవద్గీతను బోధించారు. గీత జ్ఞానంలో మత మార్గాలు గురించి చెప్పబడింది. వాటిని ఎవరైతే అనుసరిస్తారో వారికి మోక్షం కలుగుతుంది. కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడికి ఇచ్చిన బోధలు మానవాళికి స్ఫూర్తిదాయకం. గీతా జయంతి నాడు కొన్ని పరిహారాలని పాటించడం వలన సుఖ సంతోషాలు కలుగుతాయి. దుఃఖాల నుంచి బయటపడవచ్చు. సంతోషంగా జీవించొచ్చు.
గీతా జయంతిని ఎప్పుడు జరుపుకోవాలి?
గీతా జయంతి ని ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుక్లపక్షం ఏకాదశి నాడు జరుపుకుంటాము. ఈసారి గీతా జయంతి డిసెంబర్ 11న వచ్చింది. 2024 లో గీతా జయంతి 5161 వార్షికోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈరోజే శ్రీకృష్ణుడు అర్జునుడికి గీత జ్ఞానాన్ని ఇచ్చాడు. అందుకనే గీతా జయంతిగా జరుపుతాము. గీతా జయంతి నాడు కృష్ణుడు ఆశీర్వాదం పొంది సంతోషం, శ్రేయస్సు కలగాలంటే కొన్ని పరిహారాలను పాటించడం మంచిది.
గీతా జయంతి నాడు ఇలా చేస్తే మంచి జరుగుతుంది:
శ్రీకృష్ణుడిని పూజించండి:
గీతా జయంతి నాడు శ్రీకృష్ణుడిని ఆరాధించడం వలన ఎంతో మంచి జరుగుతుంది. శ్రీకృష్ణ భగవానుని ఆరాధిస్తే ఆయన అనుగ్రహం తప్పక కలుగుతుంది. శ్రీకృష్ణుని విగ్రహం లేదా ఫోటో ముందు దీపం పెట్టాలి. ధూపం, పువ్వులు కూడా సమర్పించాలి.
గీతా పారాయణం
ఈరోజు భగవద్గీతను పఠించడం వలన విశేష ఫలితాలు కలుగుతాయి. దీనిని పుణ్యకార్యంగా చెప్తారు. గీత జ్ఞానం జీవితంలో అనేక సమస్యలకి మార్గాలని ఇస్తుంది.
సాత్విక ఆహారం
సాత్విక ఆహారాన్ని మాత్రమే ఈరోజున తీసుకోవాలి. సాత్విక ఆహారం శరీరం, మనసు రెండింటికీ కూడా మంచిది.
ఉపవాసం చేయాలి
గీతా జయంతి నాడు ఉపవాసం ఉంటే చాలా మంచి జరుగుతుంది. మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలాగే శ్రీకృష్ణ భగవానుడి అనుగ్రహాన్ని కూడా ఉపవాసంతో పొందవచ్చు.
ఈ మంత్రాన్ని జపించండి
గీతా జయంతి నాడు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే మంత్రాన్ని జపిస్తే మంచిది. కృష్ణుని అనుగ్రహాన్ని పొందాలనుకునే వాళ్ళు ఈ మంత్రాన్ని జపిస్తే విశేష ఫలితాలు వస్తాయి.
తులసి మొక్కను ఆరాధించండి
విష్ణుమూర్తికి తులసి మొక్క అంటే చాలా ఇష్టం. తులసి మొక్కని ఆరాధించడం వలన భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. తులసి దళాలను కూడా దేవునికి సమర్పించాలి.
దానం చేయొచ్చు
శక్తి కొద్ది పేదలకి మీకు నచ్చిన వాటిని దానం చేయొచ్చు. దానం చేయడం వలన పుణ్యం కలుగుతుంది. ఆహారం కానీ బట్టలు లేదా డబ్బులు కానీ దానం చేయొచ్చు.
సంబంధిత కథనం