Karthika Deepam Today December 14: జ్యోత్స్న మాటలు విని సుమిత్ర ఆగ్రహం.. పారిజాతానికి కౌంటర్లు.. కార్తీక్ ఎమోషనల్-karthika deepam today episode december 14 sumitra fires on jyotsna star maa tv serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam Today December 14: జ్యోత్స్న మాటలు విని సుమిత్ర ఆగ్రహం.. పారిజాతానికి కౌంటర్లు.. కార్తీక్ ఎమోషనల్

Karthika Deepam Today December 14: జ్యోత్స్న మాటలు విని సుమిత్ర ఆగ్రహం.. పారిజాతానికి కౌంటర్లు.. కార్తీక్ ఎమోషనల్

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 14, 2024 08:39 AM IST

Karthika Deepam 2 Today Episode December 14: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. దీపపై తాము దాడి చేయించలేదని పారిజాతం గట్టిగా చెప్పడంతో కార్తీక్ కూడా అదే ఆలోచిస్తాడు. జ్యోత్స్న, పారిజాతంపై సుమిత్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.

Karthika Deepam Today December 14: జ్యోత్స్న మాటలు విని సుమిత్ర ఆగ్రహం.. పారిజాతానికి కౌంటర్లు.. కార్తీక్ ఎమోషనల్
Karthika Deepam Today December 14: జ్యోత్స్న మాటలు విని సుమిత్ర ఆగ్రహం.. పారిజాతానికి కౌంటర్లు.. కార్తీక్ ఎమోషనల్

కార్తీక దీపం 2 నేటి (డిసెంబర్ 14) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. దీపను చంపేందుకు నరసింహమే ప్రయత్నించి ఉండొచ్చని కార్తీక్‍కు ఫోన్‍లో గట్టిగా చెబుతుంది పారిజాతం. నరసింహం రెండో పెళ్లాం పగతో అయినా ఇలా చేసి ఉండొచ్చని చెబుతుంది. ఏ సాక్ష్యం లేకుండా తమను అడిగితే మర్యాదగా ఉండదని అరుస్తుంది

కార్తీక్‍ను తికమకలో పెట్టిన పారిజాతం

“ఏమీ తెలియకుండా.. ఏ సాక్ష్యం లేకుండా ఇలా ఫోన్ చేసి అడిగావంటే మర్యాదగా ఉండదు జాగ్రత్త. మొదటి సారి కాబట్టి వదిలేస్తున్నా. ఇంకోసారి జరిగిందంటే మీ తాతను తీసుకొని నేరుగా మీ ఇంటికి వస్తాను. అప్పుడు నువ్వు ఈ పారిజతాన్ని తట్టుకోలేవు” అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది పారిజాతం. దీంతో నువ్వు సూపర్.. నీ రివర్స్ అటాక్‍కు బావ కన్‍ఫ్యూజ్ అవుతాడు అని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. “పారు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుందేంటి. వీళ్ల గురించి నేను తప్పుగా భావిస్తున్నానా” అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. పారిజాతం మొత్తంగా కార్తీక్‍ను తికమకలో పెట్టేసి.. వారే దీపపై అటాక్ చేయించారన్న విషయంలో అనుమానం పెరగకుండా జాగ్రత్త పడింది.

అలా మాట్లాడకపోతే మాట వినదు

శౌర్య దగ్గరికి కార్తీక్, దీప వస్తారు. ట్యాబ్లెట్స్ వేయిస్తుంది దీప. తనకు వర్క్ ఉందంటూ కార్తీక్ వెళతానంటే.. వంటగదిలో పనుందని దీప కూడా వెళ్లేందుకు రెడీ అవుతుంది. దీంతో వెళ్లిపోండి.. ఇద్దరూ వెళ్లిపోండి అంటూ బాధగా ముఖం పెడుతుంది శౌర్య. ఏమైందని దీప అడిగితే.. ఉదయం నుంచి సాయంత్రం వరకు తాను స్కూల్‍లో ఉంటానని, కాసేపైనా తనతో కబుర్లు చెప్పొచ్చు కదా అని అడుగుతుంది. నాతో ఎప్పుడూ మాట్లాడతారు అంటుంది. అలా మాట్లాడితే అమ్మ బాధడుతుంది కదా రౌడీ అని కార్తీక్ అంటే.. అలా మాట్లాడకపోతే అమ్మ మాట వినదు నాన్న అని శౌర్య అంటుంది. దీంతో అలా కూర్చోవాలని దీపతో కార్తీక్ అంటాడు. కార్తీక్, దీప ఇద్దరూ శౌర్య పక్కన కూర్చుంటారు.

అమ్మకు ఫైటింగ్ అంటే భయం.. నవ్వుకున్న కార్తీక్

తమ స్కూల్ గ్రౌండ్‍లో గొడవ జరిగిందని, తనకు భయం వేసిందని శౌర్య చెబుతుంది. “నాకే కాదు నాన్న.. అమ్మకు కూడా ఫైటింగ్ అంటే చాలా భయం” అని చెబుతుంది. దీంతో రౌడీలను దీప చితకబాదిన దృశ్యాలను కార్తీక్ గుర్తు చేసుకుంటాడు. ఎవరికి అని సాగదీసి అడుగుతాడు. అమ్మకే అని శౌర్య అంటే.. కార్తీక్ లోలోపల నవ్వుకుంటాడు. దీపకు ఫైటింగ్ భయమా అన్నట్టుగా చూస్తాడు. గట్టిగా అరిస్తే చాలు అమ్మ భయపడుతుందని శౌర్య అంటుంది. ఇది నిజం అంటూ ఫైటింగ్ సీన్ గుర్తు చేసుకొని వెటకారంగా అంటాడు కార్తీక్. ఇలా వారి మధ్య ముచ్చట్లు సాగాయి. దీప మౌనంగా చూస్తూ ఉంటుంది. “ఈ రోజు మీ అమ్మ రౌడీలను కొట్టిన కొట్టుడు చూసి ఉంటే నీకే భయం వేసేది. ఆ రేంజ్‍లో కొట్టింది” అని మనసులో అనుకుంటాడు కార్తీక్.

దీప కొంగుతో కార్తీక్ కన్ను తుడిచిన శౌర్య

ఇంతలో కన్ను నలుపుకుంటాడు కార్తీక్. ఏమైందని శౌర్య అడుగుతుంది. ఫైట్ చేసిన సమయంలో రౌడీలు కార్తీక్.. కళ్లలో దుమ్ము కొట్టిన విషయాన్ని దీప గుర్తు చేసుకుంటుంది. నేను తగ్గిస్తానంటూ శౌర్య అంటుంది. దీప చీర కొంగు తీసుకొని నీటితో తడి చేసి.. కార్తీక్ కంటిని తుడుస్తుంది శౌర్య. నీకు నేనున్నానంటూ కార్తీక్‍తో చెబుతుంది. దీంతో కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. ఇంత ప్రేమగా కూతురు నాతో ఉంటే మంట ఎందుకు ఉంటుంది, అదెప్పుడో పోయందని కార్తీక్ అంటాడు. దీంతో దీప కూడా కన్నీరు పెట్టుకుంటుంది. దీపపై దాడి జరిగిన విషయాన్ని తలుచుకొని కాంచన కన్నీరు పెట్టుకుంటుంది. శౌర్యయను తీసుకొని రేపు ఎగ్జిబిషన్‍కు వెళదామని దీపతో కార్తీక్ అంటాడు. ఏ పూలు తీసుకురావాలని అడుగుతాడు. వద్దని దీప అంటే.. తీసుకొస్తానని కార్తీక్ చెప్పేస్తాడు.

ఆలోచనలో జ్యోత్స్న.. పారిజాతం వెటకారం

తాను పురమాయించిన రౌడీలను దీప చితకబాదిన విషయాన్ని, తమకు కార్తీక్ అనుమానించిన మాటలను గుర్తు చేసుకొని దీర్ఘంగా ఆలోచిస్తుంటుంది జ్యోత్స్న. కాఫీ కలుపుతూ థింగ్ చేస్తుంటుంది. ఇంతలో పారిజాతం వచ్చి కప్ తీసుకున్నా.. చూసుకోకుండా చక్కెర వేస్తుంది. ఏం ఆలోచిస్తున్నావని పారిజాతం అడుగుతుంది. ఆఫీస్‍కు వెళ్లాలంటే భయంగా ఉందని, దీప విషయంలో జరిగిన దాని నుంచి వార్నింగ్ కాల్ వచ్చింది కదా అని జ్యోత్స్న అంటుంది. దీంతో మనం తగ్గామా, ఇచ్చి పడేశాం కదా అని పారిజాతం అంటుంది. ఆఫీస్‍కు వెళ్లగానే కార్తీక్ అడిగితే అని జ్యోత్స్న అంటే పారిజాతం వెటకారంగా మాట్లాడుతుంది.

“దీన్నే దారికి పోతున్న కంపను ఎక్కడో తగిలించుకోవడం అంటారు” అని పారిజాతం అనడంతో.. గ్రానీ అంటూ జ్యోత్స్న అరుస్తుంది. ఎదురెళ్లి మరీ అనుమానం ఉందా బావా అని అడిగేలా ఉన్నావే అని పారిజాయం మళ్లీ వెటకరిస్తుంది. జరిగింది మరిచిపో అంటుంది. నీ మీద అనుమానం ఉంటే నీకే ఫోన్ చేసే వాడు కదా అని చెబుతుంది. తనపైనే కార్తీక్‍కు అనుమానం వచ్చిందంటుంది. కానీ మనం తిప్పి కొట్టాం కదా అని చెబుతుంది.

జ్యోత్స్న, పారిజాతంపై సుమిత్ర ఆగ్రహం

“ఆ దీపను మాత్రం ప్రశాంతంగా ఉండనివ్వకూడదు.. గ్రానీ. దాన్ని ఏదో ఒకటి చేయాలి” అని కసిగా జ్యోత్స్న అంటుంది. అంతలోనే సుమిత్ర ఎంట్రీ ఇస్తుంది. “ఏం చేస్తావ్. చెప్పవే దీపను ఏం చేస్తావ్” అని గట్టిగా అరుస్తుంది. జ్యోత్స్నపై ఫైర్ అవుతుంది. నీ జీవితంతో ఎవరైనా ఆడుకొని ఉంటే నీకు అర్థమయ్యేది నా బాధేంటో అని జ్యోత్స్న అంటే.. నేనైతే ఇంతే రాసిపెట్టి ఉందని అనుకునే దాన్ని అని సుమిత్ర అంటుంది. నాన్నమ్మకు చెప్పినట్టు విని నాశనం అయ్యే దాన్ని కాదంటూ పారిజాతంపై కూడా పంచ్ వేస్తుంది. ఏం సుమిత్ర అంత మాట అన్నావని అంటే.. దీని బుద్ధిని నాశనం చేశారని సుమిత్ర కోప్పడుతుంది. వరుసకు నానమ్మ అయినా అత్తయ్య నీకు ఫ్రెండే కాదా.. ఆమె ఆలోచనలు నీపై ప్రభావం చూపిస్తాయని అంటుంది.

దీప మంచినతం నీకు అర్థం కాలేదు

తాను తప్పుడు ఆలోచనలు చేయడం లేదని జ్యోత్స్న అంటుంది. దీపను ప్రశాంతంగా ఉండనివ్వనని అనుకోవడం మంచి ఆలోచనా అంటూ సుమిత్ర ప్రశ్నిస్తుంది. దీప ఏమైనా దేవతా.. దేశాన్ని ఉద్దరించిందా.. పచ్చిగా చెప్పాలంటే మన ఎదుగుదలకు అందరినీ వాడుకుందని జ్యోత్స్న అంటుంది. దీప మంచితనం నీకు అర్థం కావడం లేదని సుమిత్ర చెబుతుంది. తప్పును సరి చేస్తున్నానంటుంది. “నీ కూతురుని ఆ వంట మనిషి దీప కొట్టొచ్చు. నువ్వు దాని గురించి మాట్లాడవు. నేను దీప గురించి ఒక్క మాట మాట్లాడిన రచ్చ” అని జ్యోత్స్న కోపంగా అంటుంది. దీప కొట్టే వరకు తెచ్చుకున్నావని సుమిత్ర చెబుతుంది. నీ నోరు అదుపులో ఉండి ఉంటే.. దీప చేయి అదుపులో ఉండేదని అంటుంది. దీప ఎంతైనా నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ కదా, ఈ విషయం తెలియకపోయినా ఒకరి గురించి మరొకరు ఆలోచించేలా చేస్తుందని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ఇంతలోనే శివన్నారాయణ రావడంతో ఆ చర్చ ఆపేస్తుంది సుమిత్ర. అత్తయ్య మంచి సలహా ఇస్తున్నారని సుమిత్ర అంటే.. పారిజాతం మంచి సలహా ఇచ్చిందంటూ దాన్ని ప్రపంచ వింతల్లో చేర్చాల్సిందే అని వెటకారంగా అంటాడు శివన్నారాయణ. దీప విషయంలో ఏ తప్పు చేయకు అని ఆఫీస్‍కు వెళ్లే జ్యోత్స్నకు సుమిత్ర చెబుతోంది.

కార్తీక్ ఎమోషనల్

ఫైల్ మరిచిపోయి ఆఫీస్‍కు వెళుతుంటాడు కార్తీక్. దీంతో అతడికి ఫైల్ తెచ్చి ఇస్తుంది దీప. ఆఫీస్‍కు వెళ్లాలని అనిపించడం లేదని కార్తీక్ అంటాడు. ఒకప్పుడు తాతయ్య ఇంట్లో సంతోషంగా ఉన్న విషయాలను కార్తీక్ గుర్తు చేసుకుంటాడు. దీపకు వాటిని వివరిస్తుంటాడు. ఎమోషనల్‍గా మాట్లాడతాడు. తాతయ్య ఇంటితో చాలా అనుబంధం ఉండేదని అంటాడు. “ఇప్పుడు అదంతా పోయింది. రోడ్డు మీద వెళుతున్నా ఇప్పుడు ఆ ఇంటిని చూడాలనిపించడం లేదు. ఇది అనిచెప్పుకోలేని ఏదో బాధ” అని ఎమోషనల్‍ మాట్లాడతాడు కార్తీక్. ఇప్పుడు ఆ ఆఫీస్ కూడా అలాగే అనిపిస్తోందని, ఎవరి కోసమో బలంవంతంగా వెళుతున్నట్టు ఉందని చెబుతాడు.

కార్తీక్‍కు సర్ది చెప్పిన కాంచన, దీప

వాళ్లు మీ వాళ్ల కాకుండా పోతారా అని దీప అంటే.. గతాన్ని మర్చిపోయారని కార్తీక్ చెబుతాడు. శివన్నారాయణ కోపం వెనుక ప్రేమ ఉందని కార్తీక్‍కు దీప సర్ది చెబుతుంది. ఆఫీస్‍కు వెళ్లకూడదని అనుకుంటున్నానని కార్తీక్ అంటాడు. దీంతో వెళ్లకపోవడానికి అది ఎవరిదో కాదు.. మనదే అని కాంచన ఎంట్రీ ఇస్తుంది. మీ తాతయ్య ఏదో అన్నాడని నువ్వు ఆ విషయాలు మనసులో పెట్టుకొని మానేస్తానని అనుకోకు అని చెబుతుంది. సీఈవో కాకపోయినా కంపెనీ విషయాలు చూసుకోవాలని సూచిస్తుంది. జ్యోత్స్న తప్పు చేస్తే సరిదిద్దాలని చెబుతుంది. కంపెనీకి ఏదైనా చాలా మంది జీవితాలకు నష్టం జరుగుతుందని దీప అంటుంది. రెండు కుటుంబాలు ఒక్కటవుతాయని, ఓర్చుకోవాలని చెబుతుంది. ఇద్దరూ సర్దిచెప్పవడంతో కారెక్కి ఆఫీస్‍కు ఇష్టం లేకుండానే కార్తీక్ బయలుదేరతాడు. తాను తప్పు చేయలేదనేదే కార్తీక్ కోపం అని కాంచన అంటే.. “బంధాల కోసం కోపాలను వదులుకోవాలని కానీ.. కోపాల కోసం బంధాలను ఎప్పుడూ వదులుకోకూడదని దీప అంటుంది. ఇది నిజమే అని కాంచన మనసులో అనుకుంటుంది. దీంతో కార్తీక దీపం 2 నేటి (డిసెంబర్ 14) ముగిసింది.

Whats_app_banner