Full Moon Day Rituals: రాబోయే పౌర్ణమి చాలా స్పెషల్, ఈ ఐదు పనులు చేశారంటే మీకు తిరుగులేనట్లే!-powerful full moon rituals for manifestation and spiritual growth ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Full Moon Day Rituals: రాబోయే పౌర్ణమి చాలా స్పెషల్, ఈ ఐదు పనులు చేశారంటే మీకు తిరుగులేనట్లే!

Full Moon Day Rituals: రాబోయే పౌర్ణమి చాలా స్పెషల్, ఈ ఐదు పనులు చేశారంటే మీకు తిరుగులేనట్లే!

Ramya Sri Marka HT Telugu
Dec 14, 2024 08:35 AM IST

Full Moon Day Rituals: హిందూ ఆచారాల్లో అమావాస్య, పౌర్ణమి తిథులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజున కొన్ని పనులు చేస్తే చాలా మంచిదని నమ్ముతారు. సంవత్సరం చివర్లో వస్తున్న పౌర్ణమి కనుక వచ్చే పౌర్ణమి మరింత ప్రత్యేకం. ఈ రోజున ఐదు ఆచారాలను పాటిస్తే మీ జీవితంలో కొత్త వెలుగులు చూడొచ్చు.

పౌర్ణమి రోజు ఈ ఐదు పనులు చేస్తే మీకు తిరుగులేనట్లే!
పౌర్ణమి రోజు ఈ ఐదు పనులు చేస్తే మీకు తిరుగులేనట్లే! (pixabay)

హిందూ ఆచారాల్లో పౌర్ణమి, అమావాస్య తిథులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజును అత్యంత శుభ దినంగా పరిగణిస్తారు. పౌర్ణమి రోజు అంటేనే నెలలోని మిగిలిన రోజుల కంటే చాలా ప్రత్యేకం. ఆ రోజున ఇష్టదైవాన్ని నమస్కరించి మనం చేయాలనుకున్న పనులను, మరిచిపోవాలనుకున్న సంగతులను విన్నవించుకోవాలి. డిసెంబరు 15న రాబోయే ఈ పౌర్ణమి సంవత్సరంలో ఆఖరిది కావడం విశేషం. దీనిని కోల్డ్ మూన్ అని కూడా అంటారట. ఈ రోజు చంద్రానుగ్రహంతో పాత అలవాట్లను విడిచిపెట్టడంతో పాటు కొత్త పనులను సంకల్పించుకోవడానికి సరైన సమయం. అలా చేసేందుకు ముఖ్యంగా ఈ ఐదు సంప్రదాయాలు పాటించాలి. అవేంటంటే,

1. పాతవి విడిచిపెట్టడం

దీని కోసం ముందుగా దీపాలు, ధూపం, ఫైర్ పిట్ లేదా కాగితాలు, కాల్చేందుకు అనువుగా ఉండే ఒక పాత్ర, చిన్న పేపర్ల ముక్కలు.

చేయాల్సిన పని: ధూపం, దీపాలు అమర్చే విధంగా ఫైర్ పిట్ లేదా బాసిన్‌తో ఒక పవిత్రమైన స్థలాన్ని సిద్ధం చేసుకోండి. గత సంవత్సరాన్ని రివైండ్ చేసుకుని మీ విజయాలను, కష్టాలను, నేర్చుకున్న పాఠాలను జ్ఞప్తికి తెచ్చుకోండి. మరిచిపోవాలనుకున్న సంగతులను మాత్రమే పేపర్ మీద రాయండి. చెడు అలవాట్లు, హానికరమైన సంబంధాలు, లేదా పరిమితమైన ఆలోచనలు ఉన్న పేపర్లను దీపంతో నిప్పు పెట్టి గిన్నెలో వేసి పూర్తిగా కాల్చేయండి. ఇలా చేయడం వల్ల పనికిరాని పాత ఆలోచనలు పోయి కొత్త కోరికలు సాకారం చేసుకునేందుకు మనస్సుకు ప్రశాంతత దొరుకుతుంది.

2. ఆర్థిక సంపదను ఆహ్వానించడం

దీని కోసం ముందుగా నాణేలు లేదా ఆభరణాలు సిద్ధం చేసుకోవాలి. వాటితో పాటుగా ఆకుపచ్చ దీపం, చిన్న బౌల్ ఉంచుకోవాలి.

చేయాల్సిన పని: ఆకుపచ్చ దీపం అంటే, ఇది సంపద, అభివృద్ధిని సూచిస్తుంది. దానిని వెలిగించి కోరికలను నాణేలు లేదా ఆభరణాలులా భావిస్తూ బౌల్ లో ఉంచండి. ఆర్థిక భద్రత, సంపద, అభివృద్ధి కలగాలని కోరుకుంటూ మీ లక్ష్యాలను స్పష్టంగా ధ్యానించండి. "నేను సంపద, అభివృద్ధి పొందేందుకు అర్హుడిని" అనే శబ్దాలు పలకండి.

3. ఆధ్యాత్మిక మహిళా శక్తిని ఏర్పరచడం

ఈ ఆచారం పూర్తి చేయడానికి మృదువైన కుర్చీలు, తేమగా ఉండే లైటింగ్, దేవతల విగ్రహాలు లేదా చిత్రపటం అవసరం.

చేయాల్సిన పని: మృదువైన కుర్చీలను అమర్చుకుని ఒక పవిత్రమైన స్థలాన్ని ఏర్పరచుకోండి. విగ్రహం పెట్టిన దేవతలకు సంబంధించిన కొన్ని వస్తువులను ఆ ప్రదేశంలో ఉంచండి. ఆత్మసంతృప్తి కోసం పునరుద్ధరణ, సున్నితత్వం వంటి అంశాలను మననం చేసుకుంటూ ఉండండి. "నేను నా అంతరంగ భావాలను విశ్వసిస్తాను" అనుకుంటూ కాస్త సమయం గడపండి చాలు.

4. భయాలు, అపోహలను విడిచిపెట్టడం

ఈ ఆచారం పూర్తి చేసేందుకు నీటి బౌల్‌తో పాటు ఒక నలుపు దీపం, స్వీట్ గ్రాస్ సిద్ధం చేసుకోండి.

చేయాల్సిన పని: నీటి బౌల్, నలుపు దీపం, స్వీట్ గ్రాస్ సహాయంతో భయాలు, సందేహాలను విడిచిపెట్టడానికి పవిత్రమైన స్థలాన్ని ఎంచుకోండి. వాటిని గుర్తు చేసుకుని చిన్న చిన్న పేపర్లమీద రాయండి. ఆ తర్వాత కాగితాలను కాల్చి, వాటిని వదిలేయండి. మీకు తొలగిపోవాలనుకుని భావిస్తున్న భయాలను, అపోహలను విడిచిపెట్టేస్తున్నానని అనుకుంటూ సంకల్పించుకోండి.

5. భవిష్యత్తు కోరికలు నెరవేర్చుకోవడం

ఈ సంప్రదాయం కోసం చిన్న బౌల్, చిన్న గిన్నెలో మొక్క లేదా ఆకు, తెల్లని దీపం తీసుకోవాలి.

చేయాల్సిన పని: మీ భవిష్యత్తు లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి ఒక తెలుపు దీపం వెలిగించండి. మీరు తీసుకున్న గిన్నెలో మొక్క లేదా ఆకు వేసి, కొత్త ప్రారంభాన్ని, స్పష్టతను కోరుకుంటున్నానని సంకల్పించుకోండి. "నా కోరికలు సమయానుకూలంగా సాకారం అవుతాయని నేను విశ్వసిస్తున్నాను" అని బయటకు వినిపించేలా పలకండి.

ఈ ఆచారాలు పాటించడానికి ముందు మీ లక్ష్యాలను స్పష్టంగా గుర్తించి, మీ కోరికలను విశ్వసించండి. మీరు చేసే ప్రతి పనిలో ఆశయాలపై దృష్టి ఉంచండి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner