Romantic OTT: మీరా జాస్మిన్ మలయాళం రొమాంటిక్ మూవీ ఓటీటీలోకి వస్తోంది - స్ట్రీమింగ్ ఎప్పుడు...ఎందులో అంటే?
Malayalam OTT: మీరా జాస్మిన్ హీరోయిన్‌గా నటించిన మలయాళం మూవీ పాలుమ్ పాళవుమ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కన్ఫామ్ అయ్యింది. సైనా ప్లే ఓటీటీ ద్వారా త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.పాలుమ్ పాళవుమ్ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వీకే ప్రకాష్ దర్శకత్వం వహించాడు.
మీరా జాస్మిన్ హీరోయిన్‌గా నటించిన మలయాళం మూవీ పాలుమ్ పాళవుమ్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీ సైనా ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేస్తామని సైనా ప్లే ఓటీటీ తెలిపింది.
థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత పాలుమ్ పాళవుమ్ మూవీ ఓటీటీలోకి రాబోతుండటం గమనార్హం. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్, మనోరమా మాక్స్ దక్కించుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ ఓటీటీలలో కాకుండా సైనా ప్లే ద్వారా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ...
పాలుమ్ పాళవుమ్ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వీకే ప్రకాష్ దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ కామెడీ అంశాలకు మెసేజ్‌ను జోడిస్తూ ఈ మూవీ రూపొందింది. పెళ్లి విషయంలో సొసైటీలో ఉన్న అపోహలను వినోదాత్మకంగా పాలుమ్ పాళవుమ్ సినిమాలో చూపించాడు డైరెక్టర్.
ఆగస్ట్ నెలలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ కమర్షియల్‌గా మంచి వసూళ్లను రాబట్టింది. పాలుమ్ పాళవుమ్ మూవీలో తన కంటే వయసులో పదేళ్లు చిన్నవాడైన ఓ యువకుడిని పెళ్లిచేసుకునే మహిళగా మీరా జాస్మిన్ తన కామెడీ టైమింగ్, యాక్టింగ్‌తో అభిమానులను మెప్పించింది.
పదేళ్లు చిన్నవాడితో పెళ్లి...
సుమికి (మీరా జాస్మిన్) కుటుంబ బాధ్యతల కారణంగా పెళ్లికి దూరమవుతుంది. 33 ఏళ్లు వచ్చినా సింగిల్‌గానే ఉంటుంది. సునీల్ (అశ్విన్ జోస్) ఇంజినీరింగ్ చదువును మధ్యలోనే ఆపేస్తాడు. ఈజీగా జీవితంలో ఎదిగే దారుల కోసం వెతుకుతుంటాడు.
సునీల్, సుమికి సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన పరిచయంప్రేమగా మారుతుంది. పెళ్లికి సిద్ధపడతారు. కానీ సుమి కంటే సునీల్ పదేళ్లు చిన్నవాడు కావడంతో వారి పెళ్లికి కుటుంబసభ్యులతో పాటు సొసైటీ అంగీకరించదు. ఆ అడ్డంకులను దాటి సుమి, సునీల్ ఎలా ఒక్కటయ్యారు? పెళ్లి తర్వాత వారి లైఫ్ ఎలా సాగింది అన్నదే పాలుమ్ పాళవుమ్ మూవీ కథ.
గోపీ సుందర్ మ్యూజిక్...
పాలుమ్ పాళవుమ్ మూవీలో అశ్విన్ జోష్ హీరోగా నటించాడు. శాంతికృష్ణ, అశోకన్ కీలక పాత్రలు చేశారు.ఈ సినిమాకు గీత గోవిందం ఫేమ్ గోపీసుందర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశాడు.
తెలుగులో నంబర్ వన్ హీరోయిన్...
మీరా జాస్మిన్ స్వతహాగా మలయాళీ అయినా తెలుగు సినిమాలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది. టాలీవుడ్‌లో పవన్‌కళ్యాణ్, బాలకృష్ణ, రవితేజ వంటి అగ్ర హీరోలతో సినిమాలు చేసింది. భద్ర, గుడుంబాశంకర్, అమ్మాయి బాగుంది లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. 2014లో దుబాయ్‌కి చెందిన ఇంజినీర్‌ను పెళ్లిచేసుకున్న మీరా జాస్మిన్ ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. మలయాళంతో పాటు మళ్లీ తెలుగులోనూ సినిమాలు చేస్తోంది.
స్వాగ్ మూవీలో...
తెలుగులో స్వాగ్ మూవీ రీఎంట్రీ ఇచ్చింది. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ మూవీలో ఉత్పలదేవి క్యారెక్టర్‌లో కనిపించింది. ప్రస్తుతం తమిళంలో ది టెస్ట్ మూవీ చేస్తోంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీలో నయనతార, మాధవన్ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు.