Karthika Deepam Today December 13: రౌడీలను రప్ఫాడించిన దీప.. బాదేసిన కార్తీక్, అనుమానం.. బెంబేలెత్తిన జ్యోత్స్న, పారు
Karthika Deepam 2 Today Episode December 13: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో దీపపై దాడి చేసేందుకు లారెన్స్ ఓ చోటికి తీసుకెళతాడు. అయితే, రౌడీలను దీప బాదేస్తుంది. కార్తీక్ కూడా వచ్చి ఎవరు పంపారో చెప్పాలంటూ రౌడీలను కొడతాడు. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగింతో పూర్తిగా చూడండి.
కార్తీక దీపం 2 నేటి (డిసెంబర్ 13) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. స్కూల్‍లో శౌర్య కళ్లు తిరిగిపడిపోయిందని లారెన్స్ ఫోన్ చేయడంతో ఏం జరిగిందోనని దీప కంగారు పడుతుంది. స్కూల్‍కు త్వరగా వెళ్లేందుకు రోడ్డుపై పరుగులు తీస్తుంది. ఆటో డ్రైవర్ వేషంలో ఉన్న రౌడీ లారెన్స్.. దీపను ఆటో ఎక్కించుకుంటాడు. “మేడం (జ్యోత్స్న) మరీ ఇంత అమాయకురాలిని చంపమందేంటి. ఈవిడ గట్టిగా అరిస్తేనే భయపడి చచ్చేలా ఉంది” అని దీప గురించి మనసులో అనుకొని ఆటో నడుపుతుంటాడు లారెన్స్. కంగారు పడుతూ త్వరగా వెళ్లాలని దీప అంటుంది.
వేరే ప్రదేశానికి తీసుకెళ్లి..
శౌర్యకు ఏం జరిగిందోనని దీప టెన్షన్ పడుతుంది. అయితే, ఆటోను వేరే దారిలో తీసుకెళతాడు లారెన్స్. దీంతో మార్కెట్ రోడ్‍కు దారి ఇది కాదు కదా అని దీప అడుగుతుంది. షార్ట్ కట్ అంటాడు లారెన్స్. ఆ తర్వాత ఓ ప్రాంతానికి తీసుకెళ్లి ఆపుతాడు. ఇక్కడ ఆపారేంటి అని దీప అడుగుతుంది. మీరు దిగాల్సిన ప్లేస్ వచ్చేసిందని లారెన్స్ అంటాడు. శౌర్య కళ్లు తిరిగిపడిపోయిందని ఫోన్ చేసి అబద్ధం చెప్పానని చెబుతాడు. రౌడీలను లారెన్స్ పిలుస్తాడు. వచ్చిన కానివ్వాలని చెబుతాడు. వచ్చిన పని ఏంటి అని దీప అంటే.. “నిన్ను తీసుకొచ్చింది చంపడానికి” అని దీపతో లారెన్స్ అంటాడు.
దీపను రౌండప్ చేసిన రౌడీలు.. కారులో జ్యోత్స్న, పారిజాతం
దీపను లారెన్స్ వారి గ్యాంగ్‍లోని రౌడీలు రౌండప్ చేస్తారు. డప్పు కొట్టుకుంటూ చుట్టూ తిరుగుతారు. అంతలోనే జ్యోత్స్న, పారిజాతం కారులో వచ్చి.. దూరం నుంచి చూస్తుంటారు. “మా బావ నిన్ను పెళ్లి చేుకున్నందుకు.. నేను నీకు ఇచ్చే గిఫ్ట్ చావే దీప” అని జ్యోత్స్న అంటుంది.
కంగారుగా బయలుదేరిన కార్తీక్
దీప.. దీప అంటూ పిలుస్తాడు. ఎక్కడికి వెళ్లిందని కాంచన అడుగుతుంది. శౌర్య కళ్లు తిరిగిపడిపోయిందని స్కూల్ నుంచి ఫోన్ వస్తే వెళ్లిపోయిందని అనసూయ చెబుతుంది. ఎప్పుడు వెళ్లింది.. అలాంటి ఫోన్ వస్తే తనతో చెప్పాలని కదా అని కార్తీక్ అంటాడు. ఏమో బాబు నాకేం అర్థం కాలేదు, దీప హడావుడిగా వెళ్లిపోతుయిందని అనసూయ అంటుంది. శౌర్య ఆరోగ్యం గురించి దీపకు తెలిస్తే ఎంత బాధడుతుందో తెలుసా అని కార్తీక్ అంటాడు. దీంతో కార్తీక్ కూడా బయలుదేరతాడు.
రౌడీలను రప్ఫాడించిన దీప
పాపం భయపడుతున్నట్టుందిరా అని దీపను చూసి రౌడీ అంటాడు. అందరూ దాడి చేసేందుకు రెడీ అవుతారు. ఓ రౌడీ కత్తి తీసి దీపను పొడిచేందుకు ప్రయత్నిస్తాడు. అతడి చేయి మతడ పెట్టి కుమ్ముస్తుంది దీప. మిగిలిన రౌడీలు కూడ దీపపై దాడి చేసేందుకు వస్తారు. అందరినీ కుమ్మేస్తుంది దీప. కర్ర తీసుకొని ఒక్కక్కరిని చితకబాదేస్తుంది. వీర కుమ్ముడు కుమ్మేస్తుంది. దీంతో ఈవిడెంటి ఇలా కొడుతోందని లారెన్స్ షాక్ అవుతాడు. కారులో నుంచి చూస్తున్న జోత్య్స్న, పారిజాతం కూడా షాక్ అవుతారు. దీప మాత్రం బాదుడు కొనసాగిస్తుంది. ఎందుకు చంపాలనుకుంటున్నారంటూ రౌడీలను దీప గట్టిగా అడుగుతుంది.
కుమ్మేసిన కార్తీక్..
“ఏంటి గ్రానీ దానికి స్కేచ్ వేస్తే అది ఈ రేంజ్‍లో కొడుతుందేంటి” అని జ్యోత్స్న అనుకుంటుంది. పేరు చెబుతారేమోనని పారిజాయం కంగారు పడితే.. చెప్పేందుకు వారికి పేరు తెలియదన జ్యోత్స్న అంటుంది. దీప ఈరోజు బతకకూడదని అంటుంది. దానికి ఉతుకుడు ఆగేలా లేదే అని పారిజాతం అంటే.. పోతురాజు అపుతాడని జ్యోత్స్న అంటుంది. లారెన్స్ కత్తి పట్టుకొని వెనుక నుంచి దీపను పొడిచేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. లారెన్స్ చేయి పట్టుకుంటాడు. రౌడీలను కుమ్మేస్తాడు.
జ్యోత్స్న, పారిజాతం బెంబేలు
కార్తీక్ ఎంట్రీ ఇవ్వడంతో జ్యోత్స్న, పారిజాతం భయపడతారు. తాను ఇది అంచనా వేయలేదని జ్యోత్స్న అంటుంది. రౌడీ లారెన్స్‌ను కార్తీక్ బాదేస్తాడు. ఎవరు మీరు ఎందుకు దీపను చంపాలనుకుంటున్నారని అడుగుతాడు. తనకు శౌర్య గురించి అబద్ధం చెప్పి బయటికి తీసుకొచ్చారని దీప చెబుతుంది. ఎవరు మిమ్మల్ని పంపించింది అని కార్తీక్ అడుగుతాడు. రౌడీలందరూ పట్టుకొని కార్తీక్‍ను కాస్త కొడతారు. దీంతో బావకు ఏమైనా జరుగుతుందేమోనని జ్యోత్స్న కంగారు పడుతుంది. వెళతానంటే.. స్కెచ్ అర్థమవుతుందని ఆపేస్తుంది పారిజాతం. దీంతో బోరు సీసాలను ఓ టవల్‍లో చుట్టి రౌడీలను కొట్టి కార్తీక్‍ను విడిపిస్తుంది దీప. దీంతో కార్తీక్ మళ్లీ రౌడీలను చితకబాదేస్తాడు. ఎవరు పంపారో చెప్పాలని గట్టిగా అడుగుతాడు.
దుమ్ముకొట్టి పారిపోయిన రౌడీలు
చెప్పరా.. చెప్పరా అంటూ కార్తీక్, దీప కలిసి లారెన్స్‌ను కొడతారు. వాడు మనిషి అనుకుంటున్నారా.. బాల్ అనుకుంటున్నారా అని జ్యోత్స్న అనుకుంటుంది. ఇప్పుడు మనల్ని వాళ్లు చూస్తే అంటూ.. తనను కొడుతున్నట్టుగా పారిజాతం ఊహించుకుంటుంది. తనకు భయంగా ఉందని, వాడికి ఇద్దరం తెలుసని జ్యోత్స్న అంటుంది. ఎవరు పంపించారో చెప్పాలని మళ్లీ అడగగా.. కార్తీక్, దీప కళ్లలో దుమ్ముకొట్టి రౌడీలు పారిపోతారు. బావ కళ్లలో ఇసుక పడినట్టు ఉందని ఫీల్ అవుతుంది జ్యోత్స్న. పదవే అంటూ పారిజాతం అంటుంది. దీంతో వారిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.
నరసింహంపై దీప అనుమానం.. కార్తీక్‍కు జ్యోత్స్నపై..
కళ్లలో దుమ్ము కడుక్కునేందుకు కార్తీక్‍ను నీరు ఇస్తుంది దీప. ఇదంతా ఎవరు చేసి ఉంటారని కార్తీక్ అంటాడు. దీంతో తన మాజీ భర్త నరసింహం ఇది చేయించి ఉంటాడని దీప అంటుంది. అతడు జైలులో ఉన్నాడు కదా అని కార్తీక్ అంటే.. పెళ్లి గురించి తెలిసి ఇలా చేసి ఉంటాడని దీప అంటుంది. తాను బతికి ఉండడం ఇష్టం లేని వ్యక్తి వాడేనని నరసింహం గురించి దీప చెబుతుంది. అయితే, ఇంకా ఎవరైనా ఉంటారా అని కార్తీక్ అనుమానిస్తాడు. శౌర్యను చూసి వెళదామని దీప అంటే.. స్కూల్‍కు తాను ఫోన్ చేశానని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న ఇదంతా చేయించి ఉంటుందని కార్తీక్‍కు అనుమానం వస్తుంది.
జ్యో, పారిజాతం కంగారు
దానికి కోపం వస్తే ఆడవాళ్లను కొడుతుందని తెలుసు కానీ, రౌడీలను కూడా ఉతికి ఆరేస్తుందని తెలియదని ఇంటికి వెళ్లాక పారిజాతంతో జోత్స్న అంటుంది. నరసింహం వేస్ట్ గాడు అని జ్యోత్స్న అంటే.. నువ్వు సుపారీ ఇచ్చినోడు కూడా అంతే అని పారిజాతం అంటుంది. కార్తీక్ రాకపోయి ఉంటే దీపను వాడు చంపేసేవాడని జ్యోత్స్న అంటుంది. చెవిలో పూలు పెట్టొద్దని వెటకరిస్తుంది పారిజాతం. పొరపాటున ఆ గుండుగాడు మన పేరు చెప్పి ఉంటే.. మీ బావ మనిద్దరికి గుండు కొట్టేంచేవాడు అని పారిజాతం అంటుంది. అటాక్ చేయించింది ఎవరు అని అనుకుంటూ ఉంటారని జ్యో అంటే.. ఇప్పటికే చర్చ మొదలై ఉంటుంది పారిజాతం అంచనా వేస్తుంది.
కార్తీక్ కాల్.. వణికిన జ్యోత్స్న, పారిజాతం
దీపను చంపాలనుకోవడం ఏంటి అని కాంచన అంటుంది. జైలులో ఉన్న నరసింహం పనే అయి ఉంటుందని అనసూయ చెబుతుంది. మిగతా వాళ్ల సంగతి పక్కన పెట్టు.. బావ ఏం ఆలోచిస్తుంటాడని జ్యోత్స్న అనుకుంటుంది. జ్యోత్స్న యాక్సిడెంట్‍కు గురైన విషయాలను కార్తీక్ గుర్తు చేసుకుంటాడు. దీప వైపు కారు దూసుకొచ్చి.. అది చెట్టుకు గుద్దుకోగా.. అందులో జ్యోత్స్న ఉందని దాసు అప్పట్లో చెప్పిన మాటలను కార్తీక్ గుర్తు చేసుకుంటాడు. కాల్ వస్తే తమను అనుమానించినట్టు అని పారిజాతం అంటుంది.
ఇంతలోనే కార్తీక్ కాల్ రావడంతో జ్యోత్స్న, పారిజాతం వణికిపోతారు. మనపై అనుమానం వచ్చిందని వారు అనుకుంటారు. దీంతో నాకోసం ఏమైనా చెయ్ అని జ్యోత్స్న అడుగుతుంది. దీపను చంపబోవడం ఎవరైనా వీడియో రికార్డు చేశారా.. మన ముఖాలు పడ్డాయా అని భయపడుతుంది పారిజాతం. భయపడొద్దని జ్యోత్స్న అంటుంది.
ఎందుకు చేశారు.. దబాయించిన పారిజాతం
ఫోన్ ఎత్తాలని పారిజాతంతో జ్యోత్స్న చెబుతుంది. ఫోన్ ఎందుకు లేట్‍గా ఎత్తావని కార్తీక్ అడుగుతాడు. భయపడుతున్నారా అని అంటాడు. దీంతో నాకెందుకు భయం అంటూ తడబడుతూనే అరుస్తుంది పారిజాతం. తప్పు అంటూ ఏమేమో మాట్లాతున్నావ్.. ఎందుకు కాల్ చేశావో చెప్పు అని పారిజాతం అంటుంది. “నా భార్య మీద అటాక్ జరిగింది. ఎందుకు చేశారు. నువ్వు చేశారా.. జ్యోత్స్న చేసిందా” అని కార్తీక్ నేరుగా అడుగుతాడు. రేయ్ ఏం మాట్లాడుతున్నావ్ రా అని పారిజాతం అరుస్తుంది.
నా భార్య సేఫ్
“నా భార్యను చంపాల్సిన అవసరం ఇద్దరికే ఉంది.. ఒకరు జైలులో ఉన్నాడు. రెండో మనిషి నీ పక్కనే ఉండి నా మాటలు వింటుంది. నా భార్య సేఫ్ అని ఆ మనిషి చెప్పు పారు” అని కార్తీక్ అంటాడు. రివర్స్ అటాక్ ఇవ్వు పారు అని జ్యోత్స్న అంటుంది. అనుకున్నది సాధించడానికి ఒక మనిషి ఎంత దిగారిపోవాలో అంత దిగజారిందని కార్తీక్ అంటాడు. దీంతో ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అని గట్టిగా అరుస్తుంది పారిజాతం. జరిగిన దాంతో మీకేం సంబంధం లేదా అని కార్తీక్ మళ్లీ అడుగుతాడు. సంబంధం ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయా, నీ భార్యను చంపే ఖర్మ మాకేం అంటూ దబాయిస్తుంది పారిజాయం. నరసింహమే.. దీపను చంపాలనుకున్నాడని కార్తీక్‍కు నమ్మించేలా మాట్లాడుతుంది.
“నీ పెళ్లాం ముందు మొగుడు తాగోబోతోడు.. తిరిగుబోతోడు. వాడే పెళ్లాన్ని చంపాలనుకున్నాడు” అని పారిజాతం చెబుతుంది. జైలులో వేసినందుకు అది మనసులో పెట్టుకొని నరసింహం ప్లాన్ చేసి ఉండొచ్చు కదా అని పారిజాతం అంటుంది. వాడుకాకపోతే వాడి రెండో పెళ్లాం పగతో దీపను చంపాలని అనుకొని ఉండొచ్చు కదా అని పారిజాతం అంటుంది. దీప గతాన్ని తవ్వుకుంటూ పోతే ఈ పని ఎవరు చేశారో అర్థమవుతుందని చెబుతుంది. కార్తీక్ ఆలోచిస్తాడు. దీంతో కార్తీక దీపం 2 నేటి (డిసెంబర్13) ఎపిసోడ్ ముగిసింది.