Allu Arjun Reaction : 'ఇప్పుడు ఏం మాట్లాడలేను' - హీరో అల్లు అర్జున్ ఫస్ట్ రియాక్షన్ ఇదే-allu arjun first reaction after coming out of jail ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Allu Arjun Reaction : 'ఇప్పుడు ఏం మాట్లాడలేను' - హీరో అల్లు అర్జున్ ఫస్ట్ రియాక్షన్ ఇదే

Allu Arjun Reaction : 'ఇప్పుడు ఏం మాట్లాడలేను' - హీరో అల్లు అర్జున్ ఫస్ట్ రియాక్షన్ ఇదే

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 14, 2024 09:09 AM IST

జైలు నుండి విడుదలైన హీరో అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. తాను బాగానే ఉన్నానని… చట్టాన్ని గౌరవిస్తానని చెప్పుకొచ్చారు. మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

మీడియాతో అల్లు అర్జున్
మీడియాతో అల్లు అర్జున్

సంథ్య థియేటర్ వద్ద ఘటన దురదృష్టకరమని హీరో అల్లు అర్జున్ అన్నారు. శనివారం జైలు నుంచి విడుదలైన తర్వాత… జూబ్లీహిల్స్ నివాసంలో మీడియాతో మాట్లాడారు. తనకు మద్దతు తెలిపిన అందరికీ తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. తాను బాగానే ఉన్నానని.. ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పుకొచ్చారు. కేసు కోర్టు పరిధిలో ఉందని… ఇప్పుడు ఏం మాట్లాడలేను స్పష్టం చేశారు.

yearly horoscope entry point

“నేను చట్టాన్ని గౌరవిస్తాను.. నాకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు. రేవతి కుటుంబానికి నా సానుభూతి. జరిగిన ఘటన దురదృష్టకరం. ఇది అనుకోకుండా జరిగిన ఘటన. అభిమానాలు ఆందోళన చెందాల్సిన పనిలేదు” అని అల్లు అర్జున్ చెప్పారు.

అల్లు అర్జున్ భావోద్వేగం..!

జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ్నుంచి జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వెళ్లారు. ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ ను చూసి భార్య స్నేహారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. భార్యా, బిడ్డలను హత్తుకొని అల్లు అర్జున్ కూడా భావోద్వేగానికి గురయ్యారు.

ఉదయమే విడుదల….

చంచల్ గూడ జైల్లో ఉన్న అల్లు అర్జున్ ఇవాళ ఉదయమే విడుదలయ్యారు. జైలు వెనక గేటు నుంచి బయటికి వెళ్లారు. నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక శుక్రవారం రాత్రి అల్లు అర్జున్‌ మంజీరా బ్యారక్‌లో ఉన్నారు. బెయిల్ పత్రాలు సకాలంలో అందకపోవటంతో… రాత్రంతా అల్లు అర్జున్ జైలులో ఉండాల్సి వచ్చింది.

సంథ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ పై బీఎన్ఎస్ 105, 118(1) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో శుక్రవారం అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేయించి.. ఆ తర్వాత నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు. రిమాండ్ విధించటంతో… జైలుకు తరలించారు.

తనపై కేసును సవాల్ చేస్తూ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం… అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ను మంజారు చేసింది.

 

Whats_app_banner

సంబంధిత కథనం