Fruit cream: ఉపవాసంలో శక్తినిచ్చే ఫ్రూట్ క్రీం, పండ్లు తినడానికి మంచి మార్గం
Fruit cream: నవరాత్రి ఉపవాసం సమయంలో మీకు నీరసంగా, బలహీనంగా అనిపిస్తే, పండ్లతో చేసిన ఈ ఫ్రూట్ క్రీమ్ రెసిపీని తయారు చేయండి. రోజంతా శక్తి ఉంటుంది.

నవరాత్రులలో 9 రోజుల పాటు ఉపవాసం ఉంటే శక్తినిచ్చే ఆహారాలు కావాలి. కాబట్టి శక్తిని పొందడానికి పండ్లు, డ్రై ఫ్రైట్స్, గింజలను ఎక్కువగా తీసుకుంటారు. కానీ రోజూ పండ్లు తినాలంటే బోరింగ్ గా అనిపించొచ్చు. ఎక్కువగా తినలేరు. అలాంటప్పుడు ఇలా ఫ్రూట్ క్రీమ్ తయారు చేసుకోండి.
ఇది మీకు రుచిని ఇవ్వడమే కాకుండా శక్తి కోసం కూడా సహాయపడుతుంది. దీన్ని చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. కాసేపు ఫ్రిజ్‌లో పెట్టుకుని తింటే చాలు. రుచి మరింత బాగుంటుంది.
ఫ్రూట్ క్రీమ్ తయారీకి కావలసిన పదార్థాలు:
మీగడ లేదా ఫ్రెష్ క్రీం, పావు కప్పు
ఐస్ క్యూబ్స్
1 ఆపిల్
1 అరటిపండు,
1 దానిమ్మ
సగం బొప్పాయి,
2 స్ట్రాబెర్రీ
1 కివి,
గుప్పెడు బాదాం
గుప్పెడు జీడిపప్పు
గుప్పెడు ఎండుద్రాక్ష
చక్కెర లేదా తేనె
ఫ్రూట్ క్రీమ్ రెసిపీ:
1. ముందుగా ఐస్ క్యూబ్స్ ను ఒక వెడల్పాటి పెద్ద గిన్నెలో వేసుకోండి.
2. ఆ ఐస్ ముక్కల మధ్యలో మరో చిన్న గిన్నె పెట్టుకోండి.
3. అందులో ఫ్రెష్ క్రీం లేదా మీగడ వేసుకొని గిలక్కొడుతూ బాగా కలుపుకోవాలి.
4. కాసేపటికి నురుగు లాగా తేలిగ్గా, క్రీమీగా అయిపోతుంది.
5. అందులో చక్కెర పొడి లేదా తేనెను వేసుకోండి.
6. అన్నీ మరోసారి బాగా కలుపుకుని ఫ్రిజ్ లో పెట్టేయండి.
7. ఈ లోపు అన్ని పండ్లను చెక్కుతీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అరటిపండు, దానిమ్మ గింజలు, ద్రాక్ష ముక్కలు, కివీ ముక్కలు, బొప్పాయి ముక్కలు, స్ట్రాబెర్రీ ముక్కలన్నీ వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ కూడా ముక్కలు చేసి వేసేయండి.
8. ఫ్రిజ్ లో పెట్టిన క్రీం బయటకు తీసి అందులో పండ్ల ముక్కలన్నీ వేసుకోండి. అన్నీ కలిసేలా బాగా కలుపుకుని సర్వ్ చేసుకుంటే ఫ్రూట్ క్రీం రెడీ.