Shlokas for Students: మీ పిల్లలకు చదువు మీద ధ్యాస ఉండటం లేదా..? ఈ శ్లోకాలను నేర్పించండి-boost student focus and success with powerful sanskrit shlokas for exam preparation ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Shlokas For Students: మీ పిల్లలకు చదువు మీద ధ్యాస ఉండటం లేదా..? ఈ శ్లోకాలను నేర్పించండి

Shlokas for Students: మీ పిల్లలకు చదువు మీద ధ్యాస ఉండటం లేదా..? ఈ శ్లోకాలను నేర్పించండి

Ramya Sri Marka HT Telugu
Dec 16, 2024 11:45 AM IST

Sanskrit Shlokas for Students: మీ పిల్లలకు చదువు మీద ధాస్య ఉండటం లేదా..? ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిలో మార్పు కనిపించడం లేదా? అయితే సంస్కృత శ్లోకాలు మీకు సహాయం చేస్తాయి. ఇవి పిల్లలను మానసికంగా ఎదిగేలా చేయడంతో పాటు మంచి విద్యావంతులను చేస్తాయి. మీ చిన్నారులకు ఈ శ్లోకాలను నేర్పించి, పఠించేలా చేయండి.

మీ పిల్లలకు చదువు మీద ధ్యాస ఉండటం లేదా..?
మీ పిల్లలకు చదువు మీద ధ్యాస ఉండటం లేదా..? (pixabay)

పరీక్షల సీజన్ రాబోతుంది. విద్యార్థులు తమ ఫోకస్‌ మొత్తం చదువులపైనే పెట్టాల్సిన సమయం ఇది. వారిని దగ్గరుండి చదివించేందుకు పెద్దలు ఎంతో కష్టపడుతుంటారు. కొందరు పిల్లలు ఏం చేసినా చదువు మీద శ్రద్ధ పెట్టరు. పదే పదే వారి ధ్యాస్య మల్లిపోతుంది.మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తున్నారా..? అయితే ఇది మీకోసమే. ఉదయాన్నే ధ్యానం చేయడంతో పాటు ఈ పది సంస్కృత శ్లోకాలు మీ పిల్లల చేత చదివితే వారికి ఏకాగ్రత పెరగడంతో పాటు విజయం వరిస్తుంది. నేర్చుకునే సామర్థ్యాన్ని మెరుగుచేసి మానసిక సామర్థ్యాన్ని పెంచుతుంది. విద్యను అభ్యసించేందుకు ప్రేరణ కలిగిస్తుంది. ఆ శ్లోకాలేవో ఆలస్యం చేయకుండా చదివేద్దామా..

చదువు మీద ధ్యాసను పెంచే పది శ్లోకాలివే..

1. జ్ఞానం - విజ్ఞానం కోసం..

"ఓం ఏకం సద్విప్రా: బహుధా వదంతి"

ఈ శ్లోకం విద్యార్థులను అన్ని విషయాల నుండి జ్ఞానాన్ని పొందేందుకు, జ్ఞానంలో ఐక్యతను అర్థం చేసుకోనేందుకు ప్రోత్సహిస్తుంది.

2. సంకలనం కోసం..

"ధ్యోనాత్మానీ పశ్యంతి"

ఇది విద్యార్థులకు ఏకాగ్రత పెరిగేందుకు ఉపయోగపడుతుంది. ఆత్మానుభవంతో అసలైన వాస్తవాలను అవగాహన చేసుకునేందుకు సహాయపడుతుంది.

3. మానసిక బలం కోసం..

"మనసిజం దు:ఖం సర్వమ్ భవతి"

ఈ శ్లోకం మానసిక కటాక్షం కలిగి, సానుకూల ఆలోచనలు పెంపొందేందుకు సహకరిస్తుంది. చదువులో అడ్డంకులను అధిగమించేందుకు ఉపయోగపడుతుంది.

4. ఆత్మవిశ్వాసం కోసం..

"ఆత్మా దీపో భవ"

ఇది విద్యార్థులను తమ స్వంత సామర్థ్యాలు, అంతరబలం మెరుగుపరుచుకునేందుకు ప్రోత్సహిస్తుంది.

5. ఫోకస్, స్పష్టత కోసం..

"తస్మిస్నియతే జగతం సర్వం"

ఇది విద్యార్థులకు, వారి విద్యా లక్ష్యాలను సాధించడంలో ఒకే అంశంపై ఏకాగ్రత ఉంచేందుకు సహకరిస్తుంది.

6. సమయ నిర్వహణ కోసం..

"కాలోస్యం సర్వవినాశనహ".

ఇది విద్యార్థులకు సమయానికి ఉన్న విలువ తెలియజేసి, తన చదువులో సమర్థవంతంగా ఉండాలని గుర్తుచేస్తుంది.

7. అంతర శాంతి కోసం..

"శాంతాకారా భుజగశయనం ప్రజ్ఞానాభం సురేశం".

ఇది ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించి మనసుకు శాంతి కలిగించే మంత్రంగా ఉపయోగపడుతుంది.

8. జ్ఞానం, విజ్ఞానం కోసం..

"సర్వ జ్ఞానం తస్య లభ్యతే య: పున: విధా".

ఇది విద్యార్థులకు విజ్ఞానాన్ని అన్వేషించమని ప్రేరేపిస్తుంది. జ్ఞానానికి నిజమైన మూలాన్ని తెలియజేస్తుంది.

9. శిష్యత్వం కోసం..

"సంగచ్ఛధ్వం సంవద్ధవం"

ఇది కలిసి పనిచేయడం, శిష్యత్వాన్ని తూచా తప్పకుండా పాటించడం కోసం ఒక పిలుపుగా పనిచేస్తుంది. విద్యార్థులకు పెద్ద విజయాలను సాధించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.

10. ధైర్యం, పట్టుదల కోసం..

"న హి దేహభూతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషత:"

ఇది విద్యార్థులకు పట్టుదల, తన లక్ష్యాలకు చేరుకోవడం కోసం నిరంతర ప్రయత్నాల ప్రాముఖ్యతను తెలిపే శ్లోకం.

ఈ పది సంస్కృత శ్లోకాలు విద్యార్థులకు ఏకాగ్రత, ఫోకస్, ఆత్మవిశ్వాసం, సమయ నిర్వహణ, ధైర్యం, విజయం సాధించేందుకు ప్రేరణ కలిగిస్తాయి. ఇవి చదువులో మంచి ఫలితాలు అందించడంతో పాటు మానసిక బలాన్ని పెంచుతాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. వేరు వేరు వెబ్‌సైట్లు, నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఇది కేవలం మీ నమ్మకాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.

Whats_app_banner