Nita Ambani: స్టైలిష్ పింక్ బ్లేజర్, ఖరీదైన బ్యాగ్‌లో మెరిసిన అంబానీ కోడలు నీతా అంబానీ, ధర తెలిస్తే షాకవుతారు
Nita Ambani: నీతా అంబానీ తన డ్రెస్సింగ్‌తో ఎంతో మందిని ఆకర్షిస్తుంది. ఆమెకు డ్రెస్సింగ్ కు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. బెంగళూరులో జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో నీతా అంబానీ లగ్జరీ హ్యాండ్ బ్యాగ్ తో కూడిన పింక్ బ్లేజర్ ను ధరించింది.
నీతా అంబానీ డ్రెస్సింగ్ సెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఆమె చీర నుంచి వెస్ట్రన్ వేర్ వరకు ఎంతో అందమైన దుస్తులను డిజైన్ చేయించుకుంటుంది. ఈరోజు మరోసారి ఆమె సింపుల్ వెస్ట్రన్ వేర్ లుక్ లో కనిపించింది. ఇటీవల బెంగళూరులో జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో పాల్గొన్న ఈ బిజినెస్ ఐకాన్ బ్లేజర్ లుక్ తో వచ్చి బాస్ ఉమెన్ ఎనర్జీని అందరిలోకి వ్యాపించేలా చేసింది. వస్త్రధారణ, విలాసవంతమైన ఆభరణాల పట్ల నీతా అంబానీకి ఎంతో ఇష్టం. ఆమె అరవై వయసులో కూడా ఫ్యాషన్ ఐకాన్‌లా నిలిచింది. ఆమె లుక్ ను ఇప్పటికే ష్యాషన్ డిజైనర్లు డీకోడ్ చేశారు.
బ్లేజర్ లుక్ లో నీతా అంబానీ
ముంబై ఇండియన్స్ అధికారిక ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో నీతా అంబానీకి సంబంధించిన వీడియోను షేర్ షేర్ చేశారు . బ్లేజర్ లో ఆత్మవిశ్వాసాన్ని, హుందాతనాన్ని ప్రసరింపజేస్తూ, పవర్ డ్రెస్సింగ్ ను చాటి చెప్పే మహిళగా నీతా అంబానీ గురించి క్యాప్షన్ పెట్టారు.
డబుల్ కాలర్, నాచ్డ్ లాపెల్స్ తో కూడిన లేత గులాబీ రంగు షేడ్‌లో ఉన్న బ్లేజర్ ను నీతా అంబానీ ధరించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించే నీతా అంబానీ ఈ బ్లేజర్ ను కస్టమ్ "ఎం" ఇనిషియల్ తో డిజైన్ చేయించారు. సింపుల్ వైట్ ట్యాంక్ టాప్ తో ఆమె తన సిల్హౌట్ ను చక్కగా వేసుకుంది. హై వెస్ట్ జీన్స్ ధరించి ఆమె అందంగా ఉంది.
లగ్జరీ టచ్ లేకుండా నీతా అంబానీ లుక్ ఏదీ కంప్లీట్ కాదు. అందుకే ఆమె ఈ సింపుల్ డ్రెస్ పై ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ ధరించింది. హై ఎండ్ యాక్సెసరీస్ కు నీతా అంబానీ పెట్టింది పేరు. ఈ బ్లేజర్‌పై డైమండ్ స్టడ్ చెవిపోగులు, గుండె ఆకారంలో ఉన్న పెండెంట్ నెక్లెస్, తెల్లని రిస్ట్ వాచ్, న్యూడ్ స్టైల్ హై హీల్స్ ధరించింది.
ఆమె బ్యాగ్ ధర ఎంత?
ఆమె ధరించిన పింక్ హ్యాండ్ బ్యాగ్ లగ్జరీని సూచిస్తోంది. ఆ బ్యాగ్ పట్టుకుని ఆమె నడుస్తూ ఉంటే ఎంతో హూందాగా కనిపించింది. ఈ హ్యాండ్ బ్యాగ్ ప్రసిద్ధ బ్రాండ్ గోయార్డ్‌కు చెందింది. పింక్, తెలుపు కలగలిసిన హ్యాండ్ బ్యాంగ్ అద్భుతంగా కనిపిస్తుంది. ఇక ఈ హ్యాండ్ బ్యాగ్ ధర ఎంతంటే బ్యాగ్ $ 12,000 అమెరికన్ డాలర్లు. అంటే మన రూపాయల్లో తొమ్మది లక్షలు.
నీతా అంబానీ చాలా సింపుల్ మేకప్ లుక్ ను ఎంపిక చేసుకుంది. న్యూడ్ ఐషాడో, ఐలైనర్, మస్కారా పూసిన కనురెప్పలు, చెంపలకు లేత పింక్ రంగు, గులాబీ రంగు లిప్ స్టిక్ తో ఆమె తన లుక్ ను పర్ఫెక్ట్ గా ఫినిష్ చేసింది. ఆమె జుట్టును సున్నితంగా అందంగా, వదులుగా మిగిలిపోయింది