తెలుగు న్యూస్ / ఫోటో /
Celebrities Weddings: కీర్తి సురేష్ నుంచి నాగచైతన్య వరకు - ఈ ఏడాది పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సెలిబ్రిటీలు వీళ్లే!
ఈ ఏడాది పలువురు టాలీవుడ్ సెలిబ్రిటీలు పెళ్లి పీటలెక్కారు. కొందరు పెళ్లి కబురు సడెన్‌గా వినిపించి అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. మరికొందరు స్టార్స్ పెద్దల అంగీకారంతో సంప్రాదయబద్ధంగా ఏడడుగులు వేశారు. ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన స్టార్స్ ఎవరంటే?
(1 / 8)
కీర్తి సురేష్ తన చిరకాల స్నేహితుడు ఆంటోనీ తాటిల్‌తో ఇటీవలే ఏడడుగులు వేసింది. గోవాలో వీరి పెళ్లి జరిగింది.
(2 / 8)
తొలుత హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్, ఆంటోనీ ఆ తర్వాత క్రిస్టియన్ పద్ధతిలో మరోసారి ఒక్కటయ్యారు.
(3 / 8)
నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల డిసెంబర్ 4న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల అంగీకరాంతో పెళ్లిపీటలెక్కారు.
(4 / 8)
నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. నాగచైతన్యకు ఇది రెండో వివాహం కాగా...శోభితకు మొదటిది.
(5 / 8)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ మెడలో బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో మూడుముళ్లు వేశాడు. రకుల్, జాకీ భగ్నాని పెళ్లి గోవాలోనే జరిగింది.
(6 / 8)
లవ్ బర్డ్స్ సిద్ధార్థ్, అదితీరావ్ ఈ ఏడాదే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ఓ గుడిలో సింపుల్‌గా వివాహం చేసుకొని అభిమానులకు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.
(7 / 8)
వరలక్ష్మి శరత్ కుమార్ 2024 లోనే పెళ్లిపీటలెక్కింది. . ముంబైకి చెందిన నికోలాయ్ సచ్‌దేవ్‌ను వివాహమాడింది.
ఇతర గ్యాలరీలు