చదువులో ఏకాగ్రత పెంచి, పరీక్షల్లో టాపర్​ అవ్వాలంటే ఈ టెక్నిక్​ అలవాటు చేసుకోండి..

pexels

By Sharath Chitturi
Dec 10, 2024

Hindustan Times
Telugu

చదువులో బాగా రాణించేందుకు కొన్ని టెక్నిక్స్​ ఉన్నాయి. వాటిల్లో 'పోమోడోరో' టెక్నిక్​ ఒకటి.

pexels

మీరు చేయాల్సిన పనులను లిస్ట్​ చేసుకోండి. టైమర్​ను 25 నిమిషాల పాటు సెట్ చేయండి.

pexels

వర్క్​ని పూర్తి చేయడానికి కేటాయించిన ఈ సమయంలో అంకితభావంతో పనిచేయండి. 25 నిమిషాల పాటు చుట్టూ ఎటువంటి పరధ్యానం లేకుండా సరిగ్గా దృష్టి పెట్టండి.

pexels

25 నిమిషాలకు అలారం మోగిన తర్వాత, 4-5 నిమిషాలు విరామం తీసుకోండి. ఈ టైం 5 నిమిషాలకు మించకుండా చూసుకోండి.

pexels

4-5 నిమిషాల బ్రేక్​ తర్వాత మరో 25 నిమిషాలు ఈ ప్రక్రియను మళ్లీ రిపీట్​ చేయండి. మళ్లీ 5 నిమిషాలు బ్రేక్​ తీసుకోండి.

pexels

ఇలా కొన్నిసార్లు రిపీట్​ చేసిన తర్వాత 30 నిమిషాల పాటు లాంగ్​ బ్రేక్​ తీసుకుని ఫ్రెష్​ అవ్వండి.

pexels

ఈ టైమ్​ మేనేజ్​మెంట్​ టెక్నిక్​ని అలవాటు చేసుకుంటే, మీలో ఫోకస్​ పెరుగుతుంది. అనుకున్నది సాధిస్తారు.

pexels

బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ఈ 6 రకాల పండ్లు తినండి

Photo: Pexels