Gautham Krishna: బిగ్‌బాస్‌లో తెలుగు వాళ్లకు అన్యాయం జరిగిందా? - రన్నరప్ గౌతమ్ కృష్ణ ఏమన్నాడంటే?
Gautham Krishna: కన్నడ యాక్టర్ నిఖిల్‌ను విన్నర్‌గా ప్రకటించి తెలుగు కంటెస్టెంట్స్‌కు అన్యాయం చేశారని బిగ్‌బాస్‌పై నెటిజన్లు ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్ చేస్తోన్నారు. ఈ ట్రోల్స్‌పై రన్నరప్ గౌతమ్ కృష్ణ రియాక్ట్ అయ్యాడు. బిగ్‌బాస్ బ్యాక్ ఎండ్‌లో ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పాడు.
బిగ్‌బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిలవలేకపోవడంపై గౌతమ్ కృష్ణ ఆసక్తికరంగా కామెంట్స్ చేశారు. గ్రాండ్ ఫినాలే రోజు ఓటింగ్‌తో గౌతమ్ ముందున్నట్లు ప్రచారం జరిగింది. అతడే కప్ గెలుస్తాడని అనుకున్నారు. కానీ గౌతమ్‌కకు షాకిస్తూ నిఖిల్ టైటిల్ ఎగరేసుకుపోయాడు. తెలుగు వాడైన గౌతమ్‌ను కాదని కన్నడ యాక్టర్ నిఖిల్‌ను విన్నర్‌గా ప్రకటించడంపై సోషల్ మీడియాలో కొందరు ఫ్యాన్స్ బిగ్‌బాస్‌పై ట్రోల్స్ చేస్తోన్నారు. ఈ ట్రోల్స్‌పై గౌతమ్ రియాక్ట్ అయ్యాడు.
ఏం జరిగిందో తెలియదు...
బిగ్‌బాస్ షోలో బ్యాక్ ఎండ్‌లో ఏం జరిగిందో తనకు తెలియదని అన్నాడు. జరిగిపోయిన దానిని మార్చలేమని చెప్పాడు. తానే విన్నర్ అవుతానని అనుకున్నానని, కానీ అలా జరగకపోవడం కొంత బాధను కలిగించిందని గౌతమ్ చెప్పాడు.
అప్పుడే రియాక్ట్ అవుతా...
బయట ఏం జరుగుతుందో తెలుసుకున్న తర్వాతే తెలుగు వాడికి అన్యాయం జరిగిందా లేదా అనే దానిపై రియాక్ట్ అవుతానని గౌతమ్ కృష్ణ చెప్పాడు. నేను విన్నర్ అవుతానని చాలా మంది నమ్మారు. వారందరి మనసుల్ని గెలుచుకోవడం ఆనందంగా ఉంది. డబ్బు, పేరు కంటే కోట్లాది మంది మనసులను, వారి ప్రేమను గెలవడం ఆనందంగా ఉందని గౌతమ్ చెప్పాడు. చివరి వరకు గెలుపు కోసం పోరాడానని, డబ్బు కోసం నా పోరాటాన్ని ఆపకూడదనే గోల్డెన్ బ్రీఫ్ కేసు తీసుకోలేదని చెప్పాడు.
రెమ్యునరేషన్ ఎంతంటే?
రన్నరప్‌గా నిల్చిన గౌతమ్ కృష్ణకు ప్రైజ్‌మనీ దక్కకపోయినా రెమ్యునరేషన్ భారీగానే అందినట్లు సమాచారం. వారానికి కోటి డెబ్బై ఐదు లక్షలు రెమ్యునరేషన్‌తో బిగ్‌బాస్ హౌజ్‌లోకి గౌతమ్ ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. మొత్తం పది వారాల పాటు హౌజ్‌లో ఉన్న గౌతమ్ దాదాపు 18 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం.
సోలో బాయ్ మూవీ...
ప్రస్తుతం హీరోగా సోలోబాయ్ మూవీ చేస్తోన్నాడు గౌతమ్. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బిగ్‌బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ ఈ మూవీకి హెల్ప్ అవుతుందని గౌతమ్ నమ్ముతున్నాడు. సోలో బాయ్ మూవీకి నవీన్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్నాడు. శ్వేత అవస్తి హీరోయిన్‌గా నటిస్తోంది.
సీజన్ 7లో కంటెస్టెంట్‌గా
బిగ్‌బాస్ సీజన్ 8 కంటే ముందు సీజన్ 7లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. బిగ్‌బాస్ 8లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు.
మరోవైపు సీజన్ 8 విన్నర్‌గా నిలిచిన నిఖిల్ భారీగా రెమ్యునరేషన్ దక్కించుకున్నది. యాభై ఐదు లక్షల ప్రైజ్‌మనీతో పాటు 30 లక్షలకుపైనే రెమ్యూనరేషన్ రూపంలో అతడికి దక్కినట్లు సమాచారం.