Bigg Boss Elimination: బిగ్‌బాస్ నుంచి అవినాష్ సెల్ఫ్ ఎలిమినేష‌న్ - గౌత‌మ్‌పై ఎలాంటి క్ర‌ష్ లేద‌న్న య‌ష్మి-jabardasth avinash self eliminated from bigg boss 8 telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Elimination: బిగ్‌బాస్ నుంచి అవినాష్ సెల్ఫ్ ఎలిమినేష‌న్ - గౌత‌మ్‌పై ఎలాంటి క్ర‌ష్ లేద‌న్న య‌ష్మి

Bigg Boss Elimination: బిగ్‌బాస్ నుంచి అవినాష్ సెల్ఫ్ ఎలిమినేష‌న్ - గౌత‌మ్‌పై ఎలాంటి క్ర‌ష్ లేద‌న్న య‌ష్మి

Bigg Boss Elimination: బిగ్‌బాస్ 8 తెలుగు నుంచి ఎనిమిదో వారం మెహ‌బూబ్ దిల్ సే ఎలిమినేట్ అయ్యాడు. బెస్ట్ ఇవ్వాల‌నే బిగ్‌బాస్‌లోకి వ‌చ్చాన‌ని, కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ తాను ఎలిమినేట్ అయిన‌ట్లు చెప్పాడు. అత‌డితో పాటు అనారోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్ల అవినాష్ కూడా హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యిన‌ట్లు స‌మాచారం.

బిగ్‌బాస్ ఎలిమినేష‌న్‌

Bigg Boss Elimination: బిగ్‌బాస్ 8 తెలుగు ఎనిమిదో వారం నుంచి మెహ‌బూబ్ ఎలిమినేట్ అయ్యాడు. నామినేష‌న్స్‌లో మొత్తం ఆరుగురు నిల‌వ‌గా...పృథ్వీ, నిఖిల్‌, విష్ణుప్రియ‌, ప్రేర‌ణ వివిధ టాస్క్‌ల‌లో సేఫ్ అయ్యారు. చివ‌ర‌కు న‌య‌ని పావ‌ని, మెహ‌బూబ్ ఎలిమినేష‌న్స్‌లో మిగిలారు. వారిలో మెహ‌బూబ్ ఎలిమినేట్ అయిన‌ట్లు నాగార్జున ప్ర‌క‌టించాడు.

గౌత‌మ్‌, య‌ష్మి

అంత‌కుముందు స్పాన్స‌ర్‌షిప్ టాస్క్‌లో గౌత‌మ్‌, య‌ష్మి మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ‌కు సంబంధించిన వీడియోను నాగార్జున చూపించాడు. నీకు నాపై క్ర‌ష్ ఉంద‌ని అన్నావు...కానీ నేను నిన్ను మంచి ఫ్రెండ్‌గానే భావిస్తున్నాన‌ని గౌత‌మ్‌తో య‌ష్మి అన్న‌ది. ఫ్రెండ్స్ టీజ్ చేస్తూ ఎలా ఉంటారో నేను నీతో అలాగే ఉన్నాన‌ని, నా సైడ్ నుంచి నీ విష‌యంలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే సారీ అని గౌత‌మ్‌తో అన్న‌ది య‌ష్మి.

నీ లైఫ్ నీది నా లైఫ్ నాది అని య‌ష్మితో గౌత‌మ్ చెప్పాడు. గౌత‌మ్‌తో మాట్లాడుతోన్న టైమ్‌లో య‌ష్మి ఏడుస్తూనే ఉంది. నిఖిల్‌తో త‌న ఎలాంటి క్ర‌ష్ లేద‌ని య‌ష్మి చెప్పింది. నిఖిల్‌జెల‌సీగా ఫీల‌వ్వ‌డం కోసం త‌న‌ను య‌ష్మి వాడుకోవ‌డం బాగాలేద‌ని గౌత‌మ్ ఫీల‌య్యాడు.

మెహ‌బూబ్ సారీ...

ఆ త‌ర్వాత ఫైర్ టాస్క్‌లో ఎలిమినేట్ అయిన మెహ‌బూబ్‌కు నాగార్జున అత‌డి జ‌ర్నీని చూపించాడు. వ‌ర‌స్ట్ కంటెస్టెంట్ అని అవినాష్‌ను అవ‌మానించినందుకు అత‌డికి మెహ‌బూబ్ సారీ చెప్పాడు. హౌజ్‌మేట్స్‌కు క్రాక‌ర్స్‌లో ఎవ‌రికి ఏ ట్యాగ్ ఇస్తారో చెప్ప‌మ‌ని మెహ‌బూబ్‌ను అడిగాడు నాగార్జున‌. థౌజండ్‌వాడా ట్యాగ్ అవినాష్‌కు ఇచ్చాడు. హౌజ్‌లో అవినాష్ కామెడీ బాగుంటుంద‌ని అన్నాడు.

గంగ‌వ్వ‌కు ల‌క్ష్మిబాంబ్ అనే ట్యాగ్ ఇచ్చాడు. నీకు లైఫ్‌లో ఏం కావాల‌న్న నేను ఉన్నాన‌ని గంగ‌వ్వ‌కు మాటిచ్చాడు.

తారాజువ్వ‌...కాక‌ర‌వ‌త్తి...

తారాజువ్వ ట్యాగ్‌ను న‌బీల్‌కు ఇచ్చాడు. కాక‌ర‌వ‌త్తి గా రోహిణి, అగ్గిపెట్టెగా...గౌత‌మ్‌ల‌కు ట్యాగ్‌ల‌కు ఇచ్చాడు మెహ‌బూబ్‌. బిగ్‌బాస్ సీజ‌న్ 4లో దీపావ‌ళి రోజే మెహ‌బూబ్ బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఆ విష‌యాన్ని బిగ్‌బాస్ స్టేజ్‌పై గుర్తుచేసుకున్నాడు. లాస్ట్ లైమ్ దీపావ‌ళికి నా ఎలిమినేష‌న్ అయ్యింది. ఈ సారి దీపావ‌ళికే అయ్యింది.

దీపావ‌ళికి రోజు నా ఎలిమినేష‌న్ ఉంటుంద‌ని ముందే గెస్ చేశా. అలా ఎందుకు జ‌రిగిందో నాకు తెలియ‌దు. ప్ర‌తి టాస్క్‌లో నా నుంచి వంద శాతం ఇవ్వ‌డానికే క‌ష్ట‌ప‌డ్డా. బెస్ట్ ఇద్దామ‌నే వ‌చ్చా. కానీ దురుదృష్ట‌వ‌శాత్తూ బ‌య‌ట వ‌చ్చా అని మెహ‌బూబ్ ఎమోష‌న‌ల్ అయ్యాడు.

హైప‌ర్ ఆది కంప్లైంట్‌...

అంత‌కుముందు సండే ఎపిసోడ్‌కు గెస్ట్‌గా వ‌చ్చిన హైప‌ర్ ఆది...మెహ‌బూబ్ బాడీ బిల్డ‌ర్‌లా ఉన్నా...మిగిలిన కంటెస్టెంట్స్ ఎవ‌రితో స‌రిగా క‌ల‌వ‌డం లేద‌ని కంప్లైంట్ చేశాడు. మిగిలి కంటెస్టెంట్స్‌పై

అవినాష్ కూడా...

బిగ్‌బాస్ సండే ఎపిసోడ్‌ ముగిసిన త‌ర్వాత ప్రోమోను చూపించారు. ఈ ప్రోమోలో క‌డుపు నొప్పేస్తుంది, వెళ్లిపోతాన‌ని అవినాష్‌ చెబుతూ క‌నిపించాడు. ఆవినాష్ క‌డుపునొప్పితో బాధ‌ప‌డుతోన్న‌ట్లు తెలుస్తోంది. ట్రీట్‌మెంట్ కోసం అత‌డు బ‌య‌ట అడుగుపెట్ట‌నున్న‌ట్లు చెబుతోన్నారు. ట్రీట్‌మెంట్ పూర్త‌యిన త‌ర్వాత తిరిగి హౌజ్‌లో అడుగుపెట్టాడా? లేదంటే హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.