CAT Result 2024 : క్యాట్​ 2024 ఫలితాల్ని ఇలా చెక్​ చేసుకోండి..-website and steps to check iim cat result 2024 when released full details inside ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Cat Result 2024 : క్యాట్​ 2024 ఫలితాల్ని ఇలా చెక్​ చేసుకోండి..

CAT Result 2024 : క్యాట్​ 2024 ఫలితాల్ని ఇలా చెక్​ చేసుకోండి..

Sharath Chitturi HT Telugu
Dec 17, 2024 09:45 AM IST

CAT Result 2024 : క్యాట్​ 2024 ఫలితాలు వెలుడినప్పుడు, వాటిని ఐఐఎం క్యాట్​ అధికారిక వెబ్​సైట్​ imcat.ac.in లో చెక్​ చేసుకోవచ్చు. ఎలా చెక్​ చేసుకోవాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

క్యాట్​ 2024 ఫలితాల్ని ఇలా చెక్​ చేసుకోండి..
క్యాట్​ 2024 ఫలితాల్ని ఇలా చెక్​ చేసుకోండి..

నవంబర్​లో జరిగిన ఐఐఎం క్యాట్​ 2024 పరీక్షకు సంబంధించిన ఫలితాలు వెలువడాల్సి ఉంది. క్యాట్​ 2024 రిజల్ట్స్​ డేట్​ని ఐఐఎం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ గత ట్రెండ్స్​ని పరిశీలిస్తే క్యాట్​ ఫలితాలు ప్రతియేటా డిసెంబర్​లో విడుదలవుతున్నాయి. 2022, 2023ల్లో జరిగిన క్యాట్​ పరీక్షల ఫలితాలు డిసెంబర్​ 21న వెలువడ్డాయి. ఇక ఈసారి ఫలితాలు వెలుడినప్పుడు, వాటిని ఐఐఎం క్యాట్​ అధికారిక వెబ్​సైట్​ imcat.ac.in లో చెక్​ చేసుకోవచ్చు. ఈ ఏడాది జరిగిన పరీక్షను ఐఐఎం కోల్​కతా నిర్వహించింది.

క్యాట్​ ఫలితాల్ని ఇలా చెక్​ చేసుకోండి..

భారత్ లో మేనేజ్మెంట్ విద్యలో అగ్రగామి ఉన్న ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్​ల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన కామన్ అడ్మిషన్ టెస్ట్ 2024 ఫలితాల్ని ఇలా చెక్​ చేసుకోండి..

స్టెప్​ 1:- ఐఐఎం క్యాట్​ అధికారిక వెబ్​సైట్​ని సందర్శించండి.

స్టెప్​ 2:- ఫలితాలు వెలువడిన అనంతరం అధికారిక వెబ్​సైట్​లోని హోం పేజ్​లో క్యాట్​ రిజల్ట్​ 2024 లింక్​ లైవ్​ అవుతుంది. ఆ లింక్​ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 3:- మీ లాగిన్​ డీటైల్స్​ని సమర్పించండి.

స్టెప్​ 4:- సబ్మీట్​ బటన్​పై క్లిక్​ చేయండి.

స్టెప్​ 5:- మీ క్యాట్​ 2024 ఫలితాలు స్క్రీన్​ మీద కనిపిస్తాయి.

స్టెప్​ 6:- తదుపరి అవసరాల కసం ఫలితాల్ని డౌన్​లోడ్​ చేసుకుని ప్రింటౌట్​ తీసుకోండి.

ఈ క్యాట్​ 2024 స్కోర్​ 2025 డిసెంబర్​ 31 వరకు వాలిడ్​గా ఉంటుంది.

క్యాట్​ ఫలితాల అనంతరం షార్ట్​లిస్ట్​ అయిన అభ్యర్థులకు వివిధ ఐఐఎంలు ఇంటర్వ్యూ లెటర్స్​ పంపిస్తాయి. షార్ట్​లిస్టింగ్​ క్రైటీరియా ఒక్కో ఐఐఎంకి ఒక్కో విధంగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. మరిన్ని వివరాల కోసం, ఫలితాలు వెలువడిన అనంతరం ఐఐఎంల వెబ్​సైట్​ని సందర్శించాల్సి ఉంటుంది.

క్యాట్ 2024 నవంబర్ 24న ఉదయం 8:30 గంటల నుంచి 10:30 గంటల వరకు, మధ్యాహ్నం 12:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు, సాయంత్రం 4:30 నుంచి 6:30 గంటల వరకు మూడు సెషన్లలో జరిగింది. దేశవ్యాప్తంగా 170 నగరాల్లోని వివిధ కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. గత సంవత్సరాల మాదిరిగానే ఐఐఎం కోల్​కతా క్యాట్ 2024 పరీక్ష జరిగిన ఐదు రోజుల్లోనే రెస్పాన్స్ షీట్​ను అందుబాటులో ఉంచింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం