CAT 2024 : క్యాట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారా? ఈ 7 టిప్స్‌తో మీ స్కోర్ పెంచుకోండి..
CAT 2024 Preparation tips : దేశవ్యాప్తంగా నవంబర్ 24న క్యాట్ 2024 పరీక్ష జరగనుంది. మీరు ఈ పరీక్ష రాస్తున్నారా? అయితే, ఈ 7 టిప్స్ పాటించి, మీరు మీ క్యాట్ స్కోర్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి.
క్యాట్ 2024 పరీక్ష నవంబర్ 24న జరగనుంది. లక్షలాది మంది అభ్యర్థులు ఈ ఎగ్జామ్ కోసం చివరి నిమిషం ప్రిపరేషన్లో ఉండి ఉంటారు. వీరిలో మీరూ ఒకరా? అయితే ఇది మీరు కచ్చితంగా తెలుసుకోవాలి. క్యాట్ 2024లో ఈ కింద చెప్పే 7 వ్యూహాత్మక టిప్స్‌ని ఫాలో అవ్వండి. మీరు మీ స్కోర్‌ని పెంచుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి.
రివ్యూ చేసుకోండి..
- ఇప్పుడు ఇక కొత్త టాపిక్స్ ముట్టుకోకూడదు. ఇప్పటివరకు మీరు నేర్చుకున్నవి రివ్యూ చేసుకోండి. తరచూ అడిగే టాపిక్స్‌ని మరోసారి కవర్ చేయండి.
- కొత్త టాపిక్‌లు లేదా టెక్నిక్లను అన్వేషించాలన్న ఆలోచలను కట్టిపడేయండి.
మాక్ టెస్ట్‌లతో మీ టైమింగ్ పర్ఫెక్ట్ చేసుకోండి..
- అత్యుత్తమ పర్ఫార్మెన్స్ కోసం మీ మనస్సుకు శిక్షణ ఇవ్వడానికి మీ వాస్తవ పరీక్ష సమయంలో మాక్‌లను షెడ్యూల్ చేయండి.
- ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఈజీ, మాడరేట్, డిఫికల్టీ లెవల్స్‌ని ఎంచుకోండి.
- ఆప్టిమైజేషన్ అవకాశాలను గుర్తించడం కోసం మీ మాక్ పనితీరు నమూనాలను విశ్లేషించండి!
మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి..
- డీప్-బ్రీత్ వంటి స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్‌ని ఫాలో అవ్వండి.
- మీ ఫోకస్ పెంచుకునేందుకు కృషి చేయండి.
మీరు పరీక్షించిన వ్యూహాన్ని విశ్వసించండి..
- మీ ప్రాక్టీస్ విధానంతో స్థిరత్వాన్ని కొనసాగించండి.
- మీ బలాలను తెలుసుకోండి. వాటి ఆధారంగా వ్యూహాలు బిల్డ్ చేసుకోండి.
- విభిన్న క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు బ్యాకప్ ప్లాన్లను సిద్ధంగా ఉంచుకోండి.
పరీక్ష..
- అసలు పేపర్ క్లిష్టత స్థాయి ఆధారంగా మీ ప్రయత్న వ్యూహాన్ని అడ్జెస్ట్ చేసుకోండి.
- క్వాంటిటీ కంటే అక్యురసీపై దృష్టి పెట్టండి - నాణ్యత ప్రయత్నాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది!
- క్లిష్టమైన ప్రశ్నల దగ్గర ఆగిపోకండి. రివ్యూ మార్క్ చేసి ముందుకు సాగండి.
ప్రీ-ఎగ్జామ్ వెల్నెస్ కు ప్రాధాన్యత ఇవ్వండి..
- ముందు రోజు రాత్రి తేలికపాటి కానీ పోషకమైన భోజనం ప్లాన్ చేయండి
- 7-8 గంటల నాణ్యమైన నిద్రను లక్ష్యంగా పెట్టుకోండి
- చివరి నిమిషంలో రివిజన్ లేదా సుదీర్ఘ చర్చలకు దూరంగా ఉండండి!
- ప్రశాంతంగా ఉండటానికి తేలికపాటి వ్యాయామం లేదా ధ్యానం సాధన చేయండి
లాజిస్టిక్స్‌పై పట్టు సాధించండి..
- మీ అడ్మిట్ కార్డు, చెల్లుబాటు అయ్యే ఐడీ ప్రూఫ్‌ను రెండు, మూడుసార్లు తనిఖీ చేయండి.
- మీ పరీక్షా కేంద్రం స్థానాన్ని ముందుగానే సర్వే చేయండి.
- రిపోర్టింగ్ సమయం కంటే కనీసం అరగంట ముందుగా వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి.
- అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్ల బ్యాకప్ ఉంచుకోండి.
క్యాట్ 2024లో విజయం కేవలం మీకు తెలిసిన దానితో రాదు! ఒత్తిడి సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. ఖచ్చితంగా, మీరు నెలల తరబడి కష్టపడి బలమైన పునాదిని నిర్మించున్నారు. కానీ డీ-డేలో మీ మనస్తత్వం అన్ని మార్పులను చేయగలదు.
మీ బలాలకు అనుగుణంగా స్టెప్స్ తీసుకోండి. అవసరమైన విధంగా మార్చుకోండి. మీ సన్నద్ధతను విశ్వసించండి. గుర్తుంచుకోండి, క్యాట్ మీ అకాడమిక్స్ని మాత్రమే కాదు, ఒత్తిడిలో స్పష్టంగా ఆలోచించే, సమయంతో స్మార్ట్ ఎంపికలు చేసే మీ సామర్థ్యాన్ని సైతం పరీక్షిస్తుంది. మీరు బాగా ప్రిపేర్ అయ్యారని తెలుసుకుని ఆ పరీక్షా కేంద్రానికి వెళ్లి ఏకాగ్రతతో ఉండి, ఒకేసారి ఒక ప్రశ్న తీసుకోండి. ఇలా చేస్తే సక్సెస్ మీదే!
(రచన: కరణ్ మెహతా, టోప్రాంకర్స్ సహ వ్యవస్థాపకుడు)
సంబంధిత కథనం