Mogalirekulu Sagar: మొగలి రేకులు సాగర్ మూవీకి రిలీజ్‌కు ముందే అవార్డులు - డైరెక్టర్ కృష్ణవంశీకి అంకితం
Mogalirekulu Sagar: మొగలి రేకులు సాగర్ హీరోగా నటిస్తోన్న ది 100 మూవీ రిలీజ్‌కు ముందే పలు అవార్డులను అందుకున్నది. ఈ మూవీతో కృష్ణవంశీ శిష్యుడు ఓంకార్ శశిధర్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తోన్నాడు. ఈ సక్సెస్‌ను కృష్ణవంశీకే అంకింతం ఇస్తోన్నట్లు ఓంకార్ శశిధర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు.
Mogalirekulu Sagar: మొగలిరేకులు సాగర్ హీరోగా నటిస్తోన్న ది 100 మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి ముందే పలు అవార్డులను అందుకున్నది. పారిస్ ఫిల్మ్ అవార్డ్స్, గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులను గెలుచుకుంది ఈ సినిమాకు ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించాడు.
కృష్ణవంశీ వద్ద...
గతంలో డైరెక్టర్ కృష్ణవంశీ వద్ద పలు సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేశాడు ఓంకార్ శశిధర్.ది 100 మూవీతోనే దర్శకుడిగా ఓంకార్ శశిధర్ టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తోన్నాడు.
కృష్ణవంశీ వల్లే దర్శకుడిగా తనకు పేరుప్రఖ్యాతులు, గుర్తింపు వస్తోన్నాయని, ఈ సక్సెస్‌ను ఆయనకే అంకితం ఇస్తోన్నట్లు దర్శకుడు దర్శకుడు ఓంకార్ శశిధర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు.
కృష్ణవంశీ వద్దే నేర్చుకున్నా...
“నేను దర్శకత్వం వహించిన ది 100 మూవీ రిలీజ్‌కు ముందే పలు నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులను అందుకోవడం ఆనందంగా ఉంది. ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ కాన్సెప్ట్‌తో పాటు నా టేకింగ్ బాగుందంటూ ప్రశంసిస్తోన్నారు. ఓ కథను అర్థవంతంగా స్క్రీన్‌పై ఎలా చెప్పాలి...క్యారెక్టర్లను డిజైన్ చేసుకునే తీరును కృష్ణవంశీ నుంచే నేర్చుకున్నారు.
ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే ది 100 కథ, సినిమాలోని క్యారెక్టర్లను క్రియేట్ చేసుకున్నాను. రిలీజ్‌కు ముందే సినిమాకు అవార్డులు రావడం పెద్ద సక్సెస్‌గా భావిస్తున్నా. ఈ విజయాన్ని నా గురువు కృష్ణవంశీకి వందశాతం అంకింతం ఇస్తున్నాను” అని ఈ పోస్ట్‌లో ఓంకార్ శశిధర్ పేర్కొన్నాడు.త్వరలోనే ది 100 మూవీ థియేటర్లలోకి రానుందని తెలిపాడు.
ఐపీఎస్ ఆఫీసర్...
ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ది 100 మూవీ టీజర్‌ను ఇటీవల చిరంజీవి తల్లి కొణిదెల అంజనాదేవి రిలీజ్ చేశారు. నగర శివార్లలోజరిగిన కొన్ని సీరియల్ మర్డర్స్‌ను ఇన్వేస్టిగేట్ చేసే విక్రాంత్ అనే ఐపీఎస్ ఆఫీసర్‌గా ఈ మూవీలో సాగర్ కనిపించబోతున్నాడు. హీరోగా సాగర్‌ను డిఫరెంట్ యాంగిల్‌లో ప్రజెంట్ చేసే మూవీ అవుతోందని సినిమా యూనిట్ చెబుతోంది.
మిషా నారంగ్ హీరోయిన్...
ది 100 మూవీలో ఆర్కే సాగర్ సరసన మిషా నారంగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ధన్యా బాలకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు అర్జున్‌రెడ్డి, యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.
మొగిలి రేకులు సీరియల్ ద్వారా..
మొగిలి రేకులు సీరియల్‌లో ఆర్కేనాయుడు పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు సాగర్. చక్రవాకం సీరియల్‌లో లీడ్ రోల్ చేశాడు. మనసంతా నువ్వే, మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాల్లో చిన్న పాత్రలు చేసిన సాగర్ సిద్ధార్థ్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సాగర్ హీరోగా నటించిన షాదీ ముబారక్ మూవీ కమర్షియల్‌గా మంచి వసూళ్లను రాబట్టింది.