Ka Movie Teaser: మిస్టరీ పోస్ట్ మ్యాన్‌గా కిరణ్ అబ్బవరం - ఇంట్రెస్టింగ్‌గా “క” మూవీ టీజర్
Ka Movie Teaser: కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తోన్న క మూవీ టీజర్ సోమవారం రిలీజైంది. యాక్షన్ సస్పెన్స్ అంశాలతో టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. పాన్ ఇండియన్ లెవెల్‌లో క మూవీ విడుదలకాబోతోంది.
Ka Movie Teaser: కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తోన్న ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ క టీజర్ సోమవారం రిలీజైంది. పీరియాడికల్ యాక్షన్ అంశాలతో టీజర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఈ టీజర్‌లో పోస్ట్‌మ్యాన్‌గా కిరణ్ అబ్బవరం కనిపించాడు. రెండు ఎత్తైన కొండల నడుమ ఉన్న కృష్ణగిరి అనే టౌన్‌లోకి కిరణ్ అబ్బవరం ఎంట్రీ ఇచ్చినట్లుగా టీజర్‌లో చూపించారు.
పవర్‌ఫుల్ డైలాగ్స్...
ఎవరు నవ్వు ఎక్కడి నుంచి వచ్చావు....పక్కవాళ్ల ఉత్తరాలు చదివే అలవాటు ఏంటి? నీకంటూ ఎవరూ లేరా? హత్యలు చేసేంత వరకు వెళ్లావు... అంటూ వచ్చే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. నాకు తెలిసిన నేను మంచి...నాకు తెలియని నేను... అంటూ తన క్యారెక్టర్ గురించి కిరణ్ అబ్బవరం చెప్పిన డైలాగ్ టీజర్‌కు హైలైట్‌గా నిలుస్తోంది. టీజర్ చివరలో తోడేలివిరా నువ్వు అంటూ ఓ వాయిస్ కిరణ్ అబ్బవరాన్ని ఉద్దేశించి చెప్పడం ఆకట్టుకుంటోంది.
పాజిటివ్...నెగెటివ్....
క మూవీలో కిరణ్ అబ్బవరం పాజిటివ్ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నాడా....నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్ చేస్తున్నాడా అన్నది రివీల్ చేయకుండా ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశారు మేకర్స్. విజువల్స్, బీజీఎమ్ ఆకట్టుకుంటోంది. కిరణ్ అబ్బవరం లుక్ కొత్తగా ఉంది. టీజర్ చూస్తుంటే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు కనిపిస్తోంది.
హీరోయిన్ ఎవరు?
క మూవీలో హీరోయిన్ ఎవరన్నది రివీల్ చేయకుండా మేకర్స్ ఆడియెన్స్‌లో సస్పెన్స్ క్రియేట్ చేశారు. టీజర్‌లో కిరణ్ అబ్బవరం తప్ప హీరోయిన్‌తో పాటు మిగిలిన ప్రధాన పాత్రధారులను చూపించలేదు.
క మూవీతో సుజీత్, సందీప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీతోనే వీరిద్దరు డైరెక్టర్లుగా టాలీవుడ్‌లోకిఎంట్రీ ఇస్తోన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుతోన్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో క మూవీ రిలీజ్ కాబోతోంది. శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి క మూవీ ప్రొడ్యూస్ చేస్తోన్నాడు. ఈ సినిమాకు సామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తోన్నాడు.
గత ఏడాది రెండు సినిమాలు...
దాదాపు ఏడాది విరామం తర్వాత క మూవీతో కిరణ్ అబ్బవరం తెలుగు ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు. గత ఏడాది కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన మీటర్. రూల్స్ రంజన్ సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఈ సినిమాల్లో కథ, కథనాలతో పాటు కిరణ్ అబ్బవరం క్యారెక్టర్‌పై దారుణంగా నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. ఈ ఫెయిల్యూర్స్‌తో కథల ఎంపికలో తన పంథాను మార్చాడు కిరణ్ అబ్బవరం. కొత్త పాయింట్‌తో క మూవీ చేస్తోన్నాడు.
త్వరలో పెళ్లి...
మరోవైపు కిరణ్ అబ్బవరం త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన తొలి సినిమా హీరోయిన్ రహస్య గోరక్ మెడలో మూడుముళ్లు వేయబోతున్నాడు. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈ ఏడాది మార్చిలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు.