Karthika Deepam 2 Today Episode: ఉద్యోగానికి రాజీనామా చేసిన కార్తీక్, దీప కోసమే ఇంత పెద్ద నిర్ణయం-karthika deepam 2 serial december 17th episode karthik who resigned from his job took such a big decision for deepa ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Today Episode: ఉద్యోగానికి రాజీనామా చేసిన కార్తీక్, దీప కోసమే ఇంత పెద్ద నిర్ణయం

Karthika Deepam 2 Today Episode: ఉద్యోగానికి రాజీనామా చేసిన కార్తీక్, దీప కోసమే ఇంత పెద్ద నిర్ణయం

Haritha Chappa HT Telugu
Dec 17, 2024 11:03 AM IST

Karthika Deepam 2 Today Episode: దీపకు జరిగిన అవమానాన్ని సీరియస్‌గా తీసుకున్న కార్తీక్ తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కంపెనీ నుంచి బయటకు వచ్చేసాడు.

కార్తీక దీపం లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం లేటెస్ట్ ఎపిసోడ్ (Starmaa)

కార్తీకదీపం 2 సీరియల్ రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. దీప, కార్తీక్, శివన్నారాయణ, జ్యోత్స్న వీళ్ళ నలుగురు మధ్య ప్రధమంగా సాగుతున్న కథ ప్రేక్షకులకు నచ్చుతోంది. కార్తీకదీపం ఈనాటి ఎపిసోడ్‌లో ఆఫీసులో సీన్ మొదలవుతుంది. ఆఫీసులో దీప, కార్తీక్, జ్యోత్స్న, శివన్నారాయణ ఉంటారు. శివన్నారాయణ మాట్లాడుతూ దీపా తన మనవరాలు అయి ఉంటే ఇంత బాధ పెట్టినందుకు బస్ స్టాప్ లో వదిలేసి ఉంటానని అంటాడు. దానికి కారణం దీప లాంటి మనవరాలు మీకు పుట్టాలంటే మీరు ఎన్నో జన్మల అదృష్టం చేసుకోవాలి మీకు అంతలేదు అని అంటాడు. అలాగే జ్యోత్స్నను చూపిస్తూ అందుకే మీకు ఇలాంటి మనవరాలు పుట్టిందని చెబుతాడు. దీపా తన సర్వస్వమని వివరిస్తాడు. అలా చెబుతున్నప్పుడు దీపపై చేయి వేసి తన దగ్గరకు తీసుకుంటాడు. ఆ సీన్ చూసిన జోత్స్నకు కడుపు రగిలిపోతుంది. దీప చేయని పట్టుకున్న కార్తీక్ ఈ చేయి జీవితాంతం వదలనని, తనకు తోడుగా ఉంటానని చెబుతాడు. అంతేకాదు శివన్నారాయణతో ఇక మీ దగ్గర పని చేయనని రాజీనామా ఇచ్చేస్తాడు.

కార్తీక్, దీప వెళ్ళిపోతుంటే జ్యోత్స్నా బాధతో ‘బావని ఆపు’ అని తాతతో చెబుతుంది. దానికి శివన్నారాయణ ‘ చైర్మన్ గా తాను కార్తీక్ రాజీనామాను యాక్సెప్ట్ చేస్తున్నానని, ఎక్కడికి వెళ్లినా తిరిగి నా దగ్గరికే వస్తాడని’ అంటాడు. జ్యోత్స్న మనసులో కోపంతో ‘బావని నువ్వే నాకు దూరం చేస్తున్నావ్’ అని తాత గురించి అనుకుంటుంది.

అక్కడితో సీన్ దాసు ఇంటి దగ్గరికి మారిపోతుంది. పారిజాతం, దాసు ఇంటికి వెళ్లి మిఠాయిలు ఇస్తుంది. కార్తీక్ కంపెనీ నుంచి బయటకు వచ్చేసాడని ఆనందిస్తూ చెబుతుంది. స్వప్న కూడా ఆనందంతో గుడ్ న్యూస్ అంటూ స్వీట్స్ తింటుంది. ఈ సమయంలో పారిజాతం ‘దీపా ఒక అనాధ’ అని అంటుంది. దానికి వెంటనే దాసు ‘దీప అనాధ కాదు, ఆమెకి మేము ఉన్నాం’ అని చెబుతాడు. పారిజాతం మాత్రం దీప బాగుపడకూడదని తిడుతుంది.

దీపా, కార్తిక్ కార్లో వెళ్తూ ఒకచోట ఆగుతారు. తన ఉద్యోగం గురించి బాధపడుతూ ఉంటారు. సీఈఓ పోస్ట్ నుంచి తీసి అవమానించారని ఏ పోస్ట్ ఇవ్వాలో తెలియక ఏదో ఒకటి ఇచ్చేసారని అంటారు. తన సంతకాలు కూడా అవసరం లేకుండా నచ్చినట్టు ప్రవర్తించారని, అందుకే ఆ కంపెనీ వద్దని వదిలేసినట్టు చెబుతాడు. దానికి దీప ‘కంపెనీ నుంచి బయటికి రావడం అంటే మీరు ఆ కుటుంబం నుంచే బయటకు రావడం’ అని అంటుంది. కార్తీక్ కూడా ‘అలాగే వచ్చేసాను’ అని చెబుతాడు. దాంతో దీపా చాలా బాధపడుతూ ‘నేను మీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను. మిమ్మల్ని మీ కుటుంబానికి దూరం చేశాను’ అని చెబుతుంది. దీపా ఏడవడం చూసి కార్తీక్ బాధపడతాడు. నువ్వు అనాధ కాదని నీకు నేనున్నానని చెల్లి బావ అత్త అనసూయ ఉన్నారని అంటాడు కార్తీక్.

దీప మాట్లాడుతూ ‘మీరు జ్యోత్స్నను పెళ్లి చేసుకొని ఉంటే ఇంత గొడవలు ఉండేవి కాదు, మీ రెండు కుటుంబాలు కలిసేవి’ అని అంటుంది. దానికి వెంటనే కార్తీక్ కోపంతో దీప చేయి పట్టుకొని ‘పదా అయితే వెళ్లి పెళ్లి సంబంధం మాట్లాడుకుని వద్దాం’ అని అంటాడు. భర్తను మరదలకు ఇచ్చి పెళ్లి చేస్తే అందరూ నిన్ను సన్మానిస్తారని వెటకారంగా మాట్లాడతాడు. ఆ వెంటనే తనకు జ్యోత్స్న అంటే ఇష్టం లేదని, నువ్వంటేనే ఇష్టమని దీపతో చెబుతాడు. వెంటనే దీప ఇప్పటికైనా జరిగిందంతా అత్తయ్యకు చెప్పమని చెబుతుంది. కానీ కార్తీక్ అందుకు ఒప్పుకోడు. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆగిపోతుంది.

Whats_app_banner