Gunde Ninda Gudi Gantalu: మీనా ప్రేమమైకంలో మునిగిన బాలు -అత్తింట్లో పూలగంపకు పెరిగిన గౌరవం -శృతి ఇంటికి ప్రభావతి
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 17 ఎపిసోడ్‌లో సంజును బాలు చితక్కొట్టడమే కాకుండా బార్‌లో అందరి ముందు అతడి షర్ట్ చించేస్తాడు. బాలు చేసిన అవమానం భరించలేక కోపంతో రగిలిపోతాడు సంజు. శృతి,రవిని తిరిగి ఇంటికి తీసుకొచ్చేందుకు కొత్త ప్లాన్ వేస్తుంది ప్రభావతి.
Gunde Ninda Gudi Gantalu: రాజేష్‌ను కొట్టిన సంజుతో పాటు అతడి స్నేహితులను బాలు చితక్కొడతాడు. బార్‌లో అందరి ముందు సంజు షర్ట్ చింపేసి అవమానిస్తాడు. డబ్బు ఉందన్న పొగరుతో ఇష్టం ఉన్నట్లుగా ప్రవర్తిస్తే నాలాంటి వాడు నరికిపారేస్తాడని గుర్తుపెట్టుకో అని సంజుకు వార్నింగ్ ఇస్తాడు బాలు. ఆ అవవమానం తట్టుకోలేకపోతాడు సంజు. కోపంతో రగిలిపోతాడు.
తాగడం మర్చిపోయా...
పార్టీకి వెళ్లిన బాలు తాగేసి ఇంటికివస్తాడు. గేటు బయటే ఉండి మీనాను పిలుస్తాడు. నీ కోసం తొందరగా వచ్చానని అంటాడు. బార్‌లో నీ యాక్షన్ వీడియో చూసి తాగడం కూడా మర్చిపోయానని చెబుతాడు. బాలు మాటలతో మీనా మురిసిపోతుంది. సత్యం కంట పడకుండా బాలును బెడ్‌రూమ్‌లోకి మెళ్లగా బాలును తీసుకెళుతుంది. బాలును దాహంగా ఉందని అనడంతో అతడికి నీళ్లు తీసుకురావడానికి వెళుతుంది మీనా.
సెలిబ్రిటీ హోదా...
మీనా రూమ్‌లోకి వచ్చేసరికి ఇటుకరాయిని పట్టుకొని కనిపిస్తాడు బాలు. ఆ ఇటుకరాయిని మీనా కొంగుతో తుడిచేస్తాడు. ఏం చేస్తున్నారని మీనా అడగ్గానే...శుద్ధిగా బుద్ది చేస్తున్నానని చెబుతాడు. ఈ రాయి ఓ అమ్మాయి ప్రాణాలు కాపాడిన స్పెషల్ రాయి...ఓ మహిళకు విజయాన్ని ఇచ్చిన రాయి. అని పొగడ్తలు కురిపిస్తాడు. రాయికి సెలిబ్రిటీ హోదా వచ్చిందని మీనాతో అంటాడు బాలు.
ఓ ఆయుధం వచ్చింది...
ఇంట్లో వాళ్లు ఈ రాయిని చూస్తే ఏమనుకుంటున్నారని మీనా అంటుంది. ఇన్నాళ్లు చేతిలో గరిటె, చీపురు ఉన్న నీ చేతిలోకి ఓ ఆయుధంలా ఈ ఇటుకరాయి వచ్చిందని, నిన్ను చూసి అందరూ భయపడతారని, నీ జోలికి ఎవరూ రారని బాలు సమాధానమిస్తాడు. ఇంటే ఇక నుంచి ఈ రాయి చూపించి అందరిని భయపెట్టాలా మీనా అంటుంది.
ఆయుధాలే కావాలా...
మొగుడిని భయపెట్టాలంటే పెళ్లానికి ఆయుధాలే కావాలా...కళ్లలో నుంచి నిప్పులు కురిపిస్తారు. అదే కళ్ల నుంచి బాణాలు వదులుతారు అంటూ బాలు సెటైర్లు వేస్తాడు. మరి నాకు మీరు ఎప్పుడు భయపడలేదు ఎందుకుని మీనా అడగ్గానే తాను ఏ రోజు ఏ తప్పు చేయలేదని బాలు సమాధానమిస్తాడు.
ఇటుకరాయికి పూజలు...
సంజును మీనా కొట్టిన ఇటుకరాయికి బాలు దండం పెడతాడు. మీనా దగ్గర ఉన్న పూలు తీసుకొచ్చి రాయిని అలంకరిస్తాడు. ఈ దేవుడు నన్ను కరుణించాలి తప్ప నామీద పడకూడదని బాలు అంటాడు.
నీలో ఇంత ధైర్యం ఉంది కదా...ఆ రోజు పోలీస్ స్టేషన్‌లో నేను చెంపమీద లాగిపెట్టి ఒక్కటి కొడితే ఎందుకు మౌనంగా ఎందుకు ఉన్నావని మీనాను అడుగుతాడు బాలు. మీరు నా భర్త కాబట్టి మౌనంగా ఉన్నానని, మీ ప్లేస్‌లో వేరేవాడు ఉంటే వాడిపై రాళ్లను కాదు...వాడినే విసిరికొట్టేదానిని అని మీనా చెబుతుంది. భర్తను విలువ, గౌరవం ఇచ్చే భార్యను, అది మీరు గుర్తిస్తే చాలని మీనా అంటుంది.
ఈ ధైర్యం తెగువ మీ నుంచే నేర్చుకున్నానని, మీరే నా గురువు అని భర్తపై పొగడ్తలు కురిపిస్తుంది. మీనా చెప్పిన మాటలు వినగానే ఆమెను ఎత్తుకొని తిప్పుతాడు. నువ్వు నా బంగారు బుచ్చి అంటూ మీనాపై ప్రేమను కురిపిస్తాడు.
ప్రభావతికి సలహా...
ప్రభావతిని వెతుక్కుంటూ కామాక్షి వస్తుంది. ఇటుకరాయి విసిరిన మీనా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని, ఇక నుంచి తిట్టే ముందు జాగ్రత్తగా ఉండమని ప్రభావతికి సలహా ఇస్తుంది. మీనా నా ముందు నిలబడటానికే వణికిపోతుందని ప్రభావతి బిల్డప్‌లు ఇస్తుంది. లైట్ తీసుకుంటే నువ్వే వణికిపోవాల్సివస్తుందని కామాక్షి భయపెడుతుంది.
కామాక్షి ఐడియా...
రవి, శృతిని తిరిగి ఇంటికి తీసుకొచ్చేందుకు ప్రభావతికి ఐడియాఇస్తుంది కామాక్షి. రవి, శృతి ఇద్దరికి భద్రత లేదని ఇంటికి తీసుకురమ్మని చెబుతుంది. నువ్వు ఆలస్యం చేస్తే శృతి తల్లిదండ్రులు రవిని ఇంటికి తీసుకెళ్లిపోతారని అంటుంది.. శృతి ప్రాణాలు కాపాడిన మీనా కూడా వారిని తన చెప్పుచేతల్లో పెట్టుకొనే ప్రమాదం ఉందని చెబుతుంది.
సత్యాన్ని ఒప్పిస్తే చాలు...
రవి, శృతిలను ఇంటికి తీసుకురావడానికి సత్యాన్ని ఒప్పిస్తే అంత ఆయనే చూసుకుంటారని, బాలుకు సర్ధిచెబుతాడని కామాక్షి అంటుంది. కామాక్షి చెప్పిన ఐడియా విని ప్రభావతి సంబరపడిపోతుంది.
శృతి భయం...
సంజు ఎటాక్ నుంచి కోలుకోలేకపోతుంది శృతి. చిన్న సౌండ్ వచ్చిన భయపడుతుంది. తాను ఉన్నానని భయపడవద్దని రవి ధైర్యం చెబుతాడు. రవి ఇంటికి కామాక్షితో కలిసి వస్తుంది ప్రభావతి. నా కోడలికి ఎలా ఉందని, ఎటాక్‌లో గాయపడిందా అంటూ శృతిపై ప్రేమను కురిపిస్తుంది. ఇలాంటివి ఉంటాయనే మిమ్మల్ని ఇంటికి రమ్మన్నానని రవితో అంటుంది ప్రభావతి.
షాకిచ్చిన శృతి...
తన తల్లి వచ్చిన విషయం శృతికి చెప్పడానికి బెడ్‌రూమ్‌లోకి వెళతాడు రవి. తలనొప్పిగా ఉందంటే ఎందుకు మాటిమాటికి పిలుస్తున్నావని భర్తపై కోప్పడుతుంది శృతి. ప్రభావతిని చూడగానే సైలెంట్ అవుతుంది. శృతి రాగానే నీ కాళ్లపై పడుతుంది చూడు అని ప్రభావతితో అంటుంది కామాక్షి. కానీ ప్రభావతికి షాకిస్తుంది శృతి. ప్రభావతి ముందే కాళు మీద కాళు వేసుకొని కూర్చొని ఆమెతో మాట్లాడుతుంది. ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతూ వార్నింగ్ ఇస్తుంది. ఆమె మాటలు, చేష్టలు చూసి ప్రభావతి లోలోన కోపంతో రగిలిపోతుంది.
బాలు కోపాన్ని పట్టించుకోవద్దు...
ప్రభావతి ఆలోచనలను రవి కనిపెడతాడు. అమ్మ ముందు కాలు మీద కాలు వేసుకొని మాట్లాడవద్దని మెసేజ్ పెడతాడు. రవి, శృతిలను ఇంటికి రమ్మని పిలుస్తుంది ప్రభావతి. కానీ బాలు ఉంటే మేము రాలేమని శృతి అంటుంది. బాలు మూర్ఖుడు అని, వాడికి కోపాన్ని పట్టించుకోవద్దని ప్రభావతి చెబుతుంది.
మా అమ్మ కూడా ఇప్పటివరకు నా బాగోగులు తెలుసుకోవడానికి ఇంటికి రాలేదని, మీరు రావడం ఆనందంగా ప్రభావతితో శృతి అంటుంది. అప్పుడే శృతి తల్లి శోభన ఇంట్లోకి అడుగుపెడుతుంది. అక్కడితో నేటి గుండెనిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.