Gunde Ninda Gudi Gantalu:మీనాకు పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్ - కుళ్లుకున్న ప్ర‌భావ‌తి - బాలుపై గ‌న్ గురిపెట్టిన సంజు-gunde ninda gudi gantalu december 16th episode prabhavathi feels jealous after meena becomes a celebrity star maa serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gunde Ninda Gudi Gantalu:మీనాకు పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్ - కుళ్లుకున్న ప్ర‌భావ‌తి - బాలుపై గ‌న్ గురిపెట్టిన సంజు

Gunde Ninda Gudi Gantalu:మీనాకు పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్ - కుళ్లుకున్న ప్ర‌భావ‌తి - బాలుపై గ‌న్ గురిపెట్టిన సంజు

Nelki Naresh Kumar HT Telugu
Dec 16, 2024 10:17 AM IST

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంట‌లు డిసెంబ‌ర్ 16 ఎపిసోడ్‌లో మీనా సెల‌బ్రిటీగా మార‌డంతో బాలు ఆనందం ప‌ట్ట‌లేక‌పోతాడు. మీనా ఊరంతా పొగుడుతున్నార‌ని చెప్పి కుటుంబ‌స‌భ్యులంద‌రికి స్వీట్లు పంచుతాడు. మ‌రోవైపు త‌న‌ను కొట్టి అవ‌మానించిన మీనాపై ప‌గ‌తో సంజు ర‌గిలిపోతుంటాడు.

గుండె నిండా గుడి గంట‌లు డిసెంబ‌ర్ 16 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంట‌లు డిసెంబ‌ర్ 16 ఎపిసోడ్‌

శృతిని కాపాడి మీనా సెలిబ్రిటీగా మారుతుంది. టీవీ ఛానెల్ వాళ్లు పోటీప‌డి మీనా ఇంట‌ర్వ్యూలు తీసుకుంటారు. అవ‌న్నీ చూసి బాలు సండ‌ర‌ప‌డిపోతాడు. భార్య‌పై తెగ పొగ‌డ్త‌లు కురిపిస్తాడు బాలు. సంజును మీనా చిత‌క‌బాదిన ఇటుక‌రాయిని ఇంట్లోకి తీసుకొస్తాడు బాలు. ఇక నుంచి మీనాను ఇంట్లో ఎవ‌రైనా ఏదైనా అనాలంటే ఈ ఇటుక‌రాయిని చూసి మాట్లాడాల‌ని ప్ర‌భావ‌తి, రోహిణి, మ‌నోజ్‌ల‌ను హెచ్చ‌రిస్తాడు బాలు.

మ‌నోజ్‌పై సెటైర్‌...

మీనా కాపాడింది ర‌వి అన్న‌య్య భార్య‌ను అని మౌనిక అంటుంది. ర‌వి పేరు విన‌గానే బాలు కోప్ప‌డుతాడు. అవ‌త‌లి వాళ్ల సంగ‌తి అన‌వ‌స‌రం అని అంటాడు. బాలు చేతిలోని ఇటుక‌రాయిని స‌త్యం తీసుకుంటాడు. ఇంత బ‌రువు ఉన్న రాయిని సంజుపై ఎలా విసిరావ‌ని మీనాను అడుగుతాడు. ఇప్పుడు ఆ ప్ర‌శ్న అడితే మ‌రోసారి రాయి విసిరి చూపించిన చూపిస్తుంద‌ని బాలు భ‌య‌ప‌డిన‌ట్లుగా న‌టిస్తాడు. నీ గురి ఒక్క‌సారి చూడాల‌ని ఉంద‌ని, ఒక్క‌సారి వీడి త‌ల‌కాయ‌పై విస‌ర‌మ‌ని మ‌నోజ్‌ను చూపిస్తాడు బాలు. త‌మ్ముడి మాట‌ల‌తో మ‌నోజ్ భ‌య‌ప‌డ‌తాడు.

మీనా వీర‌గాథ‌కు గుర్తుగా...

ఈ ఇటుక‌రాయిని ఇంట్లోకి ఎందుకు తెచ్చావ‌ని బాలును అడుగుతాడు స‌త్యం. నా పెళ్లాం వీర‌గాథ‌కు గుర్తుగా మ‌న ఇంట్లో శాశ్వ‌తంగా ఉంచేస్తాన‌ని బాలు స‌మాధాన‌మిస్తుంది. ఇంట్లో దొంగ‌లు ప‌డితే ప‌నికొస్తుంద‌ని మౌనిక అన‌గానే...ఇంటి దొంగ‌ల‌కు కూడా ప‌నికొస్తుంద‌ని మ‌నోజ్‌ను దృష్టిలో పెట్టుకొని కౌంట‌ర్ వేస్తాడు బాలు.

ప్ర‌భావ‌తి భ‌యం...

అత్త‌య్య కాఫీ అడిగారుగా ఇవ్వ‌నా అని మీనా అన‌గానే..వ‌ద్దులే అస‌లే అలిసిపోయావు రెస్ట్ తీసుకోమ‌ని భ‌యంగా ప్ర‌భావ‌తి స‌మాధానం చెబుతుంది. మీనా వెళ్లిపోగానే ఎందుకైన మంచిది మీనాతో జాగ్ర‌త్త‌గా ఉండ‌మ‌ని రోహిణి, మ‌నోజ్‌ల‌ను హెచ్చ‌రిస్తుంది ప్ర‌భావ‌తి. మా కంటే నువ్వే ఎక్కువ‌గా మీనాను మాట‌లు అంటావ‌ని, నువ్వే జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని త‌ల్లికి మ‌నోజ్ స‌ల‌హా ఇస్తాడు.

సురేంద్ర పోలీస్ కేసు...

శృతిపై సంజు చేసిన ఎటాక్ గురించి నీల‌కంఠాన్ని నిల‌దీస్తాడు సురేంద్ర‌. త‌న‌కు ఈ ఎటాక్ గురించి తెలియ‌ద‌ని నీల‌కంఠం అన‌గానే వీడియో చూపిస్తాడు. త‌న కొడుకు ఇలాంటి ప‌నులు చేయ‌డ‌ని సంజును వెన‌కేసుకొని వ‌స్తాడు నీల‌కంఠం. నా ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చ‌డానికి ఎవ‌రో ప‌న్నిన కుట్ర ఇద‌ని చెబుతాడు. పోలీసుల‌కు కంప్లైంట్ ఇస్తే అత‌డు సంజు కాదో వాళ్లే తేల్చుతార‌ని ఆవేశంగా నీల‌కంఠానికి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు సురేంద్ర‌.

ప్ర‌భావ‌తి చిరాకు...

సెల‌బ్రిటీగా మారిన మీనా గురించి చాలా మంది ఆరాలు తీస్తుంటారు. ప్ర‌భావ‌తికి ఫోన్‌లు చేస్తుంటారు. వారికి స‌మాధానం చెప్ప‌లేక చిరాకు ప‌డుతుంది ప్ర‌భావ‌తి. అప్పుడే సంజుపై మీనా దాడి చేసిన వీడియోను న్యూస్‌లో చూపిస్తారు. అది చూడ‌లేక టీవీ క‌ట్టేస్తుంది ప్ర‌భావ‌తి. సంజుకు గ‌ట్టిగా ఆ దెబ్బ‌లు త‌గిలి ఉంటే మీడియా వాళ్లు కాదు...పోలీసులు ఇంటికి వ‌చ్చేవాళ్లు అని ప్ర‌భావ‌తి అంటుంది.

భోజ‌నం రెడీ చేశావా లేదా అని మీనాపై అరుస్తుంది ప్ర‌భావ‌తి. గ‌ట్టిగా అర‌వ‌కు అమ్మ... అస‌లే ఇటుక‌రాయి ఇంట్లోనే ఉంద‌ని భ‌య‌ప‌డ‌తాడు మ‌నోజ్‌. బాలు స్వీట్స్ తీసుకొని ఇంటికొస్తాడు. మీనాక‌కు తానే స్వ‌యంగా తినిపిస్తాడు. ఊరంతా ఫోన్ చేసి త‌న‌కు కంగ్రాట్స్ చెబుతున్నార‌ని బాలు సంబ‌ర‌ప‌డ‌తాడు.

శృతి ఇంటికి వ‌స్తానంటే...

మీనా శృతికి సాయం చేస్తే పొగుడుతున్నారు...కానీ నేను శృతిని ఇంటికి తీసుకొస్తానంటే తిడుతున్నారు అంటూ ప్ర‌భావ‌తి లాజిక్‌లు మాట్లాడుతుంది. ఆ ప‌రిస్థితుల్లో శృతి కాదు ఎవ‌రు ఉన్నా మీనా సాయం చేస్తుంద‌ని, క‌ష్టాల్లో ఉన్నార‌ని ర‌వి, శృతి చేసిన త‌ప్పులు ఒప్పు కావ‌ని బాలు ఫైర్ అవుతాడు.

మీనా కంటే త‌న‌కు ఎక్కువ పేరు రావాలంటే ప‌ది బ్యూటీ పార్ల‌ర్ బ్రాంచ్‌లు ఓపెన్ చేయ‌మ‌ని రోహిణితో అంటుంది ప్ర‌భావ‌తి. ఆ మాట విన‌గానే రోహితి పొల‌మారుతుంది.

ఫ్రెండ్స్‌కు పార్టీ...

మా ఫ్రెండ్స్ పార్టీ అడుగుతున్నార‌ని, నాన్న‌కు చెబితో ఒప్పుకోర‌ని, నువ్వే మ్యానేజ్ చేయాల‌ని మీనాను బ‌తిమిలాడుతాడు బాలు. అదా సంగ‌తి అని మీనా ఇటుక‌రాయి తీస్తుంది. ఇది విసిరే ప‌ని పెట్టుకోకు అని బాలు కంగారు ప‌డ‌తాడు. మావ‌య్య గారికి తెలిస్తే న‌న్ను తిడ‌తారు...నాకెందుకు వ‌చ్చిన తంటా అని మీనా అంటుంది. నిన్ను ప‌ర్మిష‌న్ అడ‌గ‌టం లేదు...హెల్ప్ చేయ‌మ‌ని అడుగుతున్నాన‌ని బాలు అంటాడు. నిన్ను మోసం చేసిన శృతికి సాయం చేశావు...నాకు చేయ‌వా అని అంటాడు. చాలా ఓవ‌ర్ యాక్ష‌న్ చేస్తున్నావంటూ మీనాపై ఫైర్ అవుతాడు. నేను ఓవ‌ర్ యాక్ష‌న్ చేస్తున్నానా అంటూ మీనా కూడా రివ‌ర్స్ ఎటాక్ మొద‌లుపెట్ట‌డంతో బాలు త‌గ్గుగాడు.

నీల‌కంఠం చివాట్లు…

మీనాను బ‌తిమిలాడ‌టం మొద‌లుపెడ‌తాడు. పార్టీకి వెళ్ల‌డానికి మీనా ఒప్పుకోవ‌డంతో సంబ‌ర‌ప‌డిపోయిన బాలు మీనా బుగ్గ‌పై ముద్దుపెడ‌తాడు. శృతిపై ఎటాక్ చేసిన సంజుపై నీల‌కంఠం ఫైర్ అవుతాడు. సిగ్గు లేకుండా ఆ అమ్మాయి చేతిలో దెబ్బ‌లు తిని వ‌స్తావా అని కొప్ప‌డుతాడు. ఇలా అంద‌రూ క‌నిపించేలా నేరం చేస్తే నిన్ను...నీతో పాటు న‌న్నుఉరితీయ‌డం ఖాయ‌మ‌ని అంటాడు. నిన్ను ఎవ‌రైనా గుర్తుప‌డితే ప్ర‌మాదమ‌ని కొన్నాళ్లు ఫామ్‌హౌజ్‌లో ఉండ‌మ‌ని సంజుతో చెబుతాడు నీల‌కంఠం.

మీనా దొర‌క‌డం అదృష్టం...

బార్‌లో స్నేహితుల‌కు మందు పార్టీ ఇస్తాడు బాలు. మూడు పెగ్‌లు తాగి ఆపేస్తాడు. ఇంత‌కుమించి ఎక్కువ తాగ‌న‌ని మాటిచ్చాన‌ని అంటాడు. బాలును మీనా మార్చేసింద‌ని స్నేహితులు అత‌డిని ఆట‌ప‌ట్టిస్తారు. మీనా లాంటి భార్య దొర‌క‌డం బాలు అదృష్టం అని అంటారు. బార్‌లో సంజు కూడా మందు తాగుతుంటాడు. త‌న‌ను రాళ్ల‌తో కొట్టి అవ‌మానించిన మీనాపై ప‌గ‌తో ర‌గిలిపోతుంటాడు.

సంజుపై మీనా ఎటాక్ చేసిన వీడియోను బాలు, రాజేష్‌తో పాటు అత‌డి స్నేహితులు చూస్తుంటారు. ఇలాంటి ద‌రిద్రుల‌ను చావ చిత‌క్కొట్టాలి అని వీడియో చూస్తూ గ‌ట్టిగా అరుస్తాడు రాజేష్‌. వాళ్ల‌ను న‌రికేయాల‌ని అంటాడు.

సంజును చితక్కొట్టిన బాలు…

త‌న గురించి రాజేష్ మాట్టాడిన‌ మాట‌ల‌ను సంజు భ‌రించ‌లేక‌పోతాడు. రాజేష్ వెళుతుండ‌గా కాలు అడ్డంపెడ‌తాడు సంజు. కావాల‌నే త‌న‌ను త‌న్నావ‌ని రాజేష్‌ను కొడ‌తాడు. త‌న కళ్ల ముందే రాజేష్‌ను సంజు కొట్ట‌డం చూసి బాలు కోపం ప‌ట్ట‌లేక‌పోతాడు. సంజుతో పాటు అత‌డి మ‌నుషుల‌ను చిత‌క్కొడ‌తాడు.

త‌న‌ను కొట్టిన బాలు చంప‌డానికి అత‌డి ఇంటికి వ‌స్తాడు సంజు. అక్క‌డే మీనా క‌నిపించ‌డంతో ఇద్ద‌రిని క‌లిపి చంపేయాల‌ని అనుకుంటాడు. గ‌న్ తీసి వారిపై గురిపెడ‌తాడు. అక్క‌డితో నేటి గుండె నిండా గుడి గంట‌లు సీరియ‌ల్ ముగిసింది.

Whats_app_banner