Makara Rasi 2025 Telugu: మకర రాశి ఫలితాలు.. ఆరు నెలలు అనుకూలం
Makara Rasi 2025 Telugu: మకర రాశి 2025 రాశి ఫలాలను బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. ఆరోగ్యం, ఆర్థికం, కుటుంబ సంబంధాలు వంటి విషయాల్లో కొత్త సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోండి.
మకర రాశి జాతకులకు 2025 సంవత్సరం రాశి ఫలాలు ఇక్కడ చూడొచ్చు. చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా ఈ రాశి ఫలాలు తెలుసుకోవచ్చు. బృహస్పతి మే నుండి ఆరవ స్థానములో, శని మూడో స్థానములో సంచరించనున్నారు. రాహువు మే నుండి రెండో స్థానంలో, కేతువు మే నుండి ఎనిమిదో స్థానంలో సంచరించుటచేత మకరరాశి వారికి 2025 సంవత్సరం ప్రథమార్థం అనుకూలంగా, తృతీయార్థం మధ్యస్థముగా ఉన్నది. మకరరాశి వారికి ఏలినాటి శని పూర్తి అవ్వటం చేత ఆర్థిక సమస్యల నుండి బయటపడెదరు.
ఎవరెవరికి ఎలా ఉండబోతోంది?
నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతమగును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శుభ ఫలితాలు కలుగును. వ్యాపారస్తులకు వ్యాపారవిషయాల యందు మార్పు కలుగును.
మకర రాశి విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలు కలుగును. మకరరాశి స్త్రీలు రాజకీయాలకు, గొడవలకు దూరంగా ఉండాలని సూచన. వాక్ స్థానములో రాహువు ప్రభావం చేత మకర రాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకు, గొడవలకు దూరంగా ఉండాలి. శత్రువుల వలన సమస్యలు ఏర్పడును. శత్రు స్థానములో ఉన్నటువంటి బృహస్పతి ఇబ్బంది పెట్టును.
రాజకీయనాయకులకు రాజకీయపరమైన ఒత్తిళ్ళు అధికమగును. ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగును. రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది. సినీరంగంలోని వారికి శుభఫలితాలు కలుగును. మీడియా రంగంలోని వారికి ఉన్నత పదవులు లభించును. మొత్తం మీద మకర రాశివారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి శుభఫలితాలు కలుగును.
మకర రాశి వారు చేయాల్సిన పరిహారాలు
2025 సంవత్సరంలో మకరరాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం విఘ్నేశ్వరుడిని, దుర్గాదేవిని పూజించండి. గురు దక్షిణామూర్తి సోత్రాన్ని పఠించాలి. రాహుకాల సమయంలో దుర్గాదేవి దగ్గర దీపాన్ని వెలిగించి దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించండి. దక్షిణామూర్తి ఆలయాలను దర్శించడం వల్ల మరింత శుభఫలితాలు పొందుతారు.
జనవరి 2025:
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. మీరు చేసే ప్రతి పని కలసివచ్చును. విందులలో పాల్గొంటారు. దూరప్రయాణాలుంటాయి. స్త్రీ విరోధములు. ఉత్సాహంగా ఉంటారు. మీ మాటలయందు పెంకితనం. ఇంటియందు శుభములు. వాహన సౌఖ్యం
ఫిబ్రవరి 2025:
ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. చెడు సహవాసాలకు దూరంగా ఉండాలి. ఆడంబరములకై ధనం ఖర్చు చేసెదరు. రుణ ప్రయత్నాలు చేస్తారు. గౌరవం తగ్గును. కొన్ని శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు.
మార్చి 2025:
ఈ మాసం మీకు మధ్యస్థముగా ఉన్నది. దానధర్మాలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ కలహాలు ఏర్పడతాయి. కొన్ని విషయాలలో ఓడిపోతారు. ఆరోగ్యం సమస్యలు వచ్చును. కుటుంబములో వృథాఖర్చులు ఉంటాయి. గృహమార్పులు ఉంటాయి.
ఏప్రిల్ 2025:
మకర రాశి జాతకులకు ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ఇంటియందు సమస్యలు. ఏ పని తలపెట్టినా కలసిరాదు. ఉన్నత విద్యకు ఆటంకం. ఆందోళన, ఆస్వస్థత. దంపతుల మధ్య విరోధాలుంటాయి. సంతానమునకు కష్టములు. వ్యర్థపు ఆలోచనలు ఉంటాయి. వివాహ ప్రయత్నములు చేస్తారు.
మే 2025:
ఈ మాసం మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. వస్త్రములు, వాహనాలు కొంటారు. మంచి గౌరవం ఉంటుంది. కొత్త ప్రయత్నములు కలసివచ్చును. దూరప్రాంతపు వ్యాపారాలు కలసివచ్చును. దానధర్మములు చేయుదురు. భూ, గృహ సమస్యలు అనుకూలించును.
జూన్ 2025:
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. మానసిక ఆందోళన ఉంటుంది. మీమీద మీకు నమ్మకం లేకపోవటం వలన సమస్యలు ఏర్పడుతాయి. ప్రయాణాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదములు ఏర్పడును. ప్రేమలో సఫలత. మీ వల్ల ఇతరులకు హాని కలుగుతుంది. శుభకార్యములు.
జూలై 2025:
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. కోర్టు వ్యవహారములయందు జయము. భయాందోళనలు. స్థిరాస్తులను వృద్ధి చేస్తారు. మంచి గౌరవము. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇతరులకు సహాయం చేస్తారు. వ్రతములు, పూజలు చేయుదురు. గృహమార్పులు.
ఆగస్టు 2025:
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. శత్రువులు మిత్రులుగా మారుదురు. వ్యాపారపరంగా లాభదాయకం. శరీరంనందు అనుకోని మార్పులు, అనారోగ్య సమస్యలు. అనుబంధాలు బలపడతాయి. రాజకీయ వ్యవహారములలో తిరుగుతారు.
సెప్టెంబర్ 2025:
ఈ మాసం మకర రాశి జాతకలుకు మధ్యస్థంగా ఉన్నది. శారీరక అలసట. ధనలాభం ఉండును. వృథా ప్రయాణాలుంటాయి. గృహము లేక భూమి కొనుట. విధి నిర్వహణలో పొరపాట్లు. సంతాన సౌఖ్యము. వ్యాపారులకు లాభదాయకం.
అక్టోబర్ 2025:
ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. ధనవ్యయం ఉంటుంది. పనిలో ఉత్సాహం, మానసిక ఆనందం కలుగుతుంది. పనికిరాని ఆలోచనలు మానుకోండి. పెద్దలతో తిరుగుతారు. స్నేహితులు మోసం చేసే ప్రమాదం ఉంది. కొత్తవారితో పరిచయాలు ఉంటాయి. అలంకార ప్రాప్తి కలుగుతుంది.
నవంబర్ 2025:
ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. దానధర్మములు చేయుదురు. భార్యా భర్తల మధ్య విభేదాలు ఉంటాయి. మానసికాందోళన. అధికార ఒత్తిడి. చేసే వృత్తి ఉద్యోగము లందు ఆటంకాలు తొలగుతాయి. దేవాలయ దర్శనములు చేస్తారు. ఆదాయం బాగుంటుంది.
డిసెంబర్ 2025:
ఈ మాసం మకర రాశి జాతకులకు అనుకూలంగా లేదు. సంఘం నందు గౌరవ మర్యాదలు తగ్గును. రుణ సమస్యలుంటాయి. ధన నష్టం. మానసికాందోళన. ఖర్చులు అధికమవుతాయి. మీ సంతానపరంగా సమస్యలుంటాయి. విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
- చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, పంచాంగకర్త
సంబంధిత కథనం