Shiva Thandava Sthotram: శివతాండవ స్తోత్రం పఠించండి.. సకల ఐశ్వర్యాలను పొందండి-shiva thandava stotram lyrics and meaning benefits ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Shiva Thandava Sthotram: శివతాండవ స్తోత్రం పఠించండి.. సకల ఐశ్వర్యాలను పొందండి

Shiva Thandava Sthotram: శివతాండవ స్తోత్రం పఠించండి.. సకల ఐశ్వర్యాలను పొందండి

Ramya Sri Marka HT Telugu
Dec 16, 2024 06:35 AM IST

Shiva Thandava Sthotram: పరమశివుడి అనుగ్రహం కోసం అనునిత్యం పరితపించే భక్తులు ఎందరో ఉన్నారు. ఈశ్వరుని ఆశీర్వాదం ఉంటే సకల ఐశ్వర్యాలు, అందుతాయని, కుటుంబంలో సఖ్యత, సంతోషం వృద్ధి చెందుతాయి. శివుడికి ఎంతో ఇష్టమైన శివతాండవ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఆయన అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చని నమ్మిక.

శివతాండవ స్తోత్రం పఠించండి.. సకల ఐశ్వర్యాలను పొందండి
శివతాండవ స్తోత్రం పఠించండి.. సకల ఐశ్వర్యాలను పొందండి

Shiva Thandava Sthotram: శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదట. అంతటి గొప్ప భగవంతుడు పరమశివుడు. శివానుగ్రం ఉంటే వ్యక్తి జీవితం ఎంతో సంతోషంగా, సుఖంగా ఉంటుందని, కుటుంబ సంబంధాల్లో ఎలాంటి సమస్యలు రావని భక్తుల నమ్మిక. అలాంటి శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు పూజలు, వ్రతాలు, కఠిన ఉపవాస దీక్షలు చేపడుతుంటారు. మహాశివుడని ప్రసన్నం చేసుకునేందుకు శివ తాండవ స్త్రోత్రం చాలా బాగా సహాయపడుతుంది.

yearly horoscope entry point

ప్రదోష సమయంలో శివ తాండవ స్తోత్రం పఠించడం, వినడం వల్ల శివుడి అనుగ్రహం లభించి..ఆయన దివ్య శక్తితో మీ ఇంట శుభాలు కురుస్తాయని శాస్త్రం చెబుతుంది.అంతేకాకుండా మీలోని బలహీనతలు, భయాలు పటాపంచలు అయిపోతాయట. ప్రదోష వేళలో ఈ శివ తాండవ స్తోత్రాన్ని ఎవరు చదువుతారో వారి కుటుంబం ఐశ్వర్యం, ఆనందంతో తూలతూగుతుంది.అటువంటి శివతాండవ స్తోత్రం మీ కోసం..

శివ తాండవ స్తోత్రం..

"జటాటవీగలజ్జల- ప్రవాహపావితస్థలే

గలేఽవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికాం.

డమడ్డమడ్డమడ్డమన్నినాద- వడ్డమర్వయం

చకార చండతాండవం తనోతు నః శివః శివం.

జటాకటాహసంభ్రమ- భ్రమన్నిలింపనిర్ఝరీ-

విలోలవీచివల్లరీ- విరాజమానమూర్ధని.

ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాట- పట్టపావకే

కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ.

ధరాధరేంద్రనందినీ- విలాసబంధుబంధుర

స్ఫురద్దిగంతసంతతి- ప్రమోదమానమానసే.

కృపాకటాక్షధోరణీ- నిరుద్ధదుర్ధరాపది

క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని.

జటాభుజంగపింగల- స్ఫురత్ఫణామణిప్రభా

కదంబకుంకుమద్రవ- ప్రలిప్తదిగ్వధూముఖే.

మదాంధసింధుర- స్ఫురత్త్వగుత్తరీయమేదురే

మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి.

సహస్రలోచనప్రభృత్యశేష- లేఖశేఖర

ప్రసూనధూలిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః.

భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటకశ్రియై

చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః.

లలాటచత్వరజ్వలద్ధనంజయ- స్ఫులింగభా

నిపీతపంచసాయకం నమన్నిలింపనాయకం.

సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం

మహాకపాలిసంపదే శిరోజటాలమస్తు నః.

కరాలభాలపట్టికా- ధగద్ధగద్ధగజ్జ్వల

ద్ధనంజయాహుతీకృత- ప్రచండపంచసాయకే.

ధరాధరేంద్రనందినీ- కుచాగ్రచిత్రపత్రక

ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే రతిర్మమ.

నవీనమేఘమండలీ- నిరుద్ధదుర్ధరస్ఫురత్-

కుహూనిశీథినీతమః- ప్రబంధబద్ధకంధరః.

నిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురఃకలా

నిధానబంధురః శ్రియం జగద్ధురంధరః.

ప్రఫుల్లనీలపంకజ- ప్రపంచకాలిమప్రభా

వలంబికంఠకందలీరుచిప్రబద్ధకంధరం.

స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం

గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే.

అఖర్వసర్వమంగలా- కలాకదంబమంజరీ

రసప్రవాహమాధురీ- విజృంభణామధువ్రతం.

స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం

గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే.

జయత్వదభ్రవిభ్రమ- భ్రమద్భుజంగమశ్వస-

ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలభాలహవ్యవాట్.

ధిమిద్ధిమిద్ధిమి- ధ్వనన్మృదంగతుంగమంగల

ధ్వనిక్రమప్రవర్తితప్రచండ- తాండవః శివః.

దృషద్విచిత్రతల్పయోర్భుజంగ- మౌక్తికస్రజో-

ర్గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః.

తృణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః

సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే.

కదా నిలింపనిర్ఝరీ- నికుంజకోటరే వసన్విముక్తదుర్మతిః

సదా శిరః స్థమంజలిం వహన్.

విముక్తలోలలోచనో లలామభాలలగ్నకః

శివేతి మంత్రముచ్చరన్ కదా సుఖీ భవామ్యహం.

నిలింపనాథనాగరీకదంబ- మౌలిమల్లికా

నిగుంఫనిర్భరక్షరన్- మధూష్ణికామనోహరః.

తనోతు నో మనోముదం వినోదినీమహర్నిశం

పరశ్రియః పరం పదంతదంగజత్విషాం చయః.

ప్రచండవాడవానలప్రభా- శుభప్రచారణీ

మహాష్టసిద్ధికామినీ- జనావహూతజల్పనా.

విముక్తవామలోచనావివాహ- కాలికధ్వనిఃశివేతి మంత్రభూషణో జగజ్జయాయ జాయతాం.

ఇదం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం

పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతిసంతతం.

హరే గురౌ సుభక్తిమాశు యాతి నాఽన్యథా గతింవిమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం.

పూజావసానసమయే దశవక్త్రగీతం

యః శంభుపూజనపరం పఠతి ప్రదోషే.

తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాంలక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభు:"

ఈ శివ తాండవ స్తోత్రాన్ని మహా శివునికి పరమ భక్తుడైన రావణుడు రచించాడట. ఈ స్తోత్రంతోనే ఆయన మహాశివుని అనుగ్రహం పొంది, అనేక వరాలు పొందాడని పురాణాలు చెబుతున్నాయి.

ఇంతటితో శివ తాండవ స్తోత్రం సమాప్తం..

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner