Weightloss Tips: హెల్తీ డైట్ పాటిస్తున్నా వ్యాయామం చేస్తున్నా బరువు తగ్గడం లేదా? ఈ తప్పులు చేస్తున్నారేమో చూసుకోండి-not losing weight despite exercising and following a healthy diet watch out for these mistakes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weightloss Tips: హెల్తీ డైట్ పాటిస్తున్నా వ్యాయామం చేస్తున్నా బరువు తగ్గడం లేదా? ఈ తప్పులు చేస్తున్నారేమో చూసుకోండి

Weightloss Tips: హెల్తీ డైట్ పాటిస్తున్నా వ్యాయామం చేస్తున్నా బరువు తగ్గడం లేదా? ఈ తప్పులు చేస్తున్నారేమో చూసుకోండి

Haritha Chappa HT Telugu
Dec 16, 2024 08:40 AM IST

Weightloss Tips: వ్యాయామం చేసిన తర్వాత, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా కూడా బరువు తగ్గలేకపోతే దానికి కారణాలు తెలుసుకోండి. కొన్ని రకాల తప్పులు చేస్తే బరువు తగ్గడం కష్టంగా మారుతుంది.

బరువు ఎందుకు తగ్గడం లేదు?
బరువు ఎందుకు తగ్గడం లేదు? (shutterstock)

బరువు పెరగడం సులువే, కానీ తగ్గడానికి మాత్రం చాలా టైమ్ పడుతుంది. అధిక బరువు అనేది ఇప్పుడు ఎంతో మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కువ మందిని కలవర పెడుతున్న సమస్యగా ఊబకాయం మారింది. బరువు పెరగడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు వంటివి చాలా సులువుగా వచ్చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ అధిక బరువును తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

బరువు తగ్గడానికి ఎంతో మంది ప్రతిరోజూ వ్యాయామాలు చేస్తూ ఉంటారు. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా తింటారు. జంక్ ఫుడ్ కు పూర్తిగా దూరంగా ఉంటారు. అయినా ఆశించిన ఫలితం రాదు. ఇంతగా వర్కవుట్స్ చేసి, హెల్తీ డైట్ పాటిస్తున్నా ఎందుకు బరువు తగ్గడం లేదా అని తెగ బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు తెలుసుకోవాల్సింది… మీకు తెలియకుండా మీరు కొన్ని తప్పులు చేస్తున్నారని. మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ మీ బరువు తగ్గకుండా అడ్టకుంటాయి. మీరు పాటించే జీవనశైలిలోని చిన్న చిన్న విషయాలే దీనికి కారణమవుతాయి. వర్కవుట్స్ చేసిన తర్వాత కూడా ఎందుకు బరువు తగ్గరో వివరిస్తూ ఫిట్ నెస్ కోచ్ షితిజా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

ఈ తప్పులు వద్దు

ఎంతగా ప్రయత్నిస్తున్నా బరువు తగ్గకపోతే ఈ తప్పులు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి.

- రాత్రిపూట అధిక కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాలతో డిన్నర్ చేయడం

- తీవ్రంగా ఒత్తిడికి గురవ్వడం

- భారీ వ్యాయామాలు చేయడం, దీని వల్ల కండరాలు నష్టపోవడానికి బదులుగా బలాన్ని పొందుతాయి.

- రాత్రిపూట ఆలస్యంగా తినడం

-తగినంత నిద్ర పోకపోవడం, నిద్ర తగ్గినా కూడా బరువు పెరిగే అవకాశం ఎక్కువే.

- బరువు కొలిచేటప్పుడు మీ పొట్ట ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. మీరు టాయిలెట్ కు వెళ్లకుండా బరువులు తూకం వేయవద్దు. అలాంటి సమయాల్లో కూడా బరువు ఎక్కువగా కనిపిస్తారు.

ఉప్పు, సోడియం అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో నీరు నిలుపుదల సమస్య ఏర్పడుతుంది. దీన్ని వల్ల బరువు ఎక్కువగా కనిపించడం ప్రారంభమవుతుంది.

మీరు బరువు తగ్గుతున్నారో లేదో తెలుసుకోవడం ఎలా?

- బరువు కొలిచే యంత్రంపై నిలబడినప్పుడు బరువు తగ్గినట్టు కనిపించకపోతే భయపడవద్దు. మీరు ప్రతిరోజూ బరువు తగ్గడానికి బదులుగా బరువు పెరుగుదలను చూస్తున్నట్లయితే, మీ వ్యాయామం వల్ల లేక పైన చెప్పిన తప్పులు కారణంగా అలా జరుగుతోందని తెలుసుకోండి.

బరువు తగ్గేందుకు సులువైన పద్ధతి ప్రతిరోజూ మెట్టు ఎక్కుతూ దిగుతూ ఉండడం. ఇది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. చిన్న చిన్న తప్పులను సరిచేసుకుంటే మీరు త్వరగా బరువు తగ్గుతారు.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner