తెలుగు న్యూస్ / ఫోటో /
AP TG Winter Updates: తెలుగు రాష్ట్రాలపై చలిపంజా, అల్లూరి, ఆదిలాబాద్ జిల్లాల్లోకనిష్ట ఉష్ణోగ్రతలు...
- AP TG Winter Updates: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఏపీ తెలంగాణాల్లో ఏజెన్సీ ప్రాంతాలను చలి వణికిస్తోంది. కొన్ని జిల్లాల్లో చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం 9 గంటల వరకు పొగమంచు ప్రభావం కనిపిస్తోంది. అన్ని జిల్లాల్లోకనిష్ట ఉష్ణోగ్రతలు 20డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి.
- AP TG Winter Updates: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఏపీ తెలంగాణాల్లో ఏజెన్సీ ప్రాంతాలను చలి వణికిస్తోంది. కొన్ని జిల్లాల్లో చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం 9 గంటల వరకు పొగమంచు ప్రభావం కనిపిస్తోంది. అన్ని జిల్లాల్లోకనిష్ట ఉష్ణోగ్రతలు 20డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి.
(1 / 11)
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. తెలంగాణలోని ఆదిలాబాద్, ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 11డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
(2 / 11)
అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలం కుంతలాం కనిష్ట ఉష్ణోగ్రతలు 5.7డిగ్రీలు నమోదయ్యాయి. ఈ ఏడాది చలికాలం మొదలైన తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇవే.
(3 / 11)
జి. మాడుగులలో 6.2డిగ్రీలు, డుంబ్రిగూడలో 7.9డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రత 10డిగ్రీల్లోపు నమోదైంది. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు తెలంగాణలో చలి తీవ్ర కొనసాగుతోంది.
(4 / 11)
పార్వతీపురం మన్యం, శ్రీ సత్యసాయి, అనంతపురం,విజయనగరం, శ్రీకాకకుళం, అన్నమయ్య, అనకాపల్లి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, కాకినాడ తదితర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 15డిగ్రీల కంటే తక్కువ నమోదయ్యాయి.(Yogendra Kumar)
(5 / 11)
సోమ, మంగళ, బుధవారాల్లో చలిగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి.
(6 / 11)
శనివారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సాధారణంగా కన్నా 8.1డిగ్రీల ఉష్ణోగ్రత పడిపోయి 4.7డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పటాన్ చెరులో సాధారణ ఉష్ణోగ్రత 4.5డిగ్రీలు పడిపోయి 8.6డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. (PTI)
(7 / 11)
తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది, ఆదిలాబాద్, అల్లూరి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. చలి తీవ్రతతో తెల్లవారిన తర్వాత కూడా మంచుతెరలు వీడటం లేదు. (Sudipta Banerjee )
(8 / 11)
రాష్ట్రంలో పొగమంచు తీవ్రత కూడా క్రమంగా పెరుగుతోంది. తెల్లవారిన తర్వాత కూడా మంచు దుప్పట్లోనే ఉంటున్నాయి. (PTI)
(9 / 11)
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా దినసరి కార్మికులు, అసంఘటిత రంగంలో ఉండే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. (Makhan lal jammu)
(10 / 11)
ఆదిలాబాద్లో 4.7డిగ్రీలు, మెదక్లో 9.8డిగ్రీలు, కరీంనగర్లో 11డిగ్రీలు, రామగుండంలో 11.6 డిగరీలు, హన్మకొండలో 12 డిగ్రీలు, నిజామాబాద్ 12 డిగ్రీలు, హైదరాబాద్లో 14.6డిగ్రీలు, మహబూబ్నగర్లో 16.6డిగ్రీలు, ఖమ్మంలో 17డిగ్రీలు, నల్గొండలో 17.6డిగ్రీలు, సూర్యాపేటలో 20డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.(Hindustan Times)
ఇతర గ్యాలరీలు