Brahmamudi December 16th Episode: బాధ్యతల పేరుతో బుక్కైన కావ్య - ధాన్యలక్ష్మి డామినేషన్ -దుగ్గిరాల ఆస్తి జప్తు
Brahmamudi: బ్రహ్మముడి డిసెంబర్ 16 ఎపిసోడ్‌లో ఇంటి బాధ్యతలు తీసుకున్న కావ్యను టార్గెట్ చేస్తారు రుద్రాణి, ధాన్యలక్ష్మి. చీటికి మాటికి కావ్యను నానా మాటలు అంటూ ఆమెపై డామినేషన్ చేయడం మొదలుపెడతారు. వారి గొడవలు భరించలేక ఇంటి బాధ్యతల్ని రాజ్‌కు అప్పగించాలని కావ్య ఫిక్సవుతుంది.
సీతారామయ్య తన స్నేహితుడి చిట్‌ఫండ్ కంపెనీకి వంద కోట్లు ష్యూరిటీ ఇస్తాడు. కానీ చిట్‌ఫండ్ కంపెనీ బోర్డ్ తిప్పేయడంతో వంద కోట్లు సీతారామయ్య తరఫున రాజ్ చెల్లించాలని బ్యాంకు వాళ్లు ఆర్డర్ వేస్తారు. డబ్బు చెల్లించడానికి పది రోజులు గడువు ఇస్తారు. పది రోజుల్లో వంద కోట్లు ఎలా అడ్జెస్ట్ చేయాలో తెలియక రాజ్ ఆలోచనలో పడతాడు. ఆఫీస్ నుంచి బయటకు వచ్చి కారు కూడా ఎక్కకుండా నడుచుకుంటూ వెళ్లిపోతాడు.
నందగోపాల్ ఆచూకీ...
చిట్‌ఫండ్ కంపెనీ ఓనర్ నందగోపాల్‌ను పట్టుకునే ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం దొరుకుతుందని రాజ్ అనుకుంటాడు. తన స్నేహితుడైన పోలీస్ ఆఫీసర్‌కు ఫోన్ చేసి నందగోపాల్ ఇంటి అడ్రెస్‌తో పాటు అతడికి సంబంధించిన పూర్తి వివరాలు తనకు కావాలని చెబుతాడు.
రుద్రాణి డామినేషన్...
కావ్య వంట చేస్తోండగా కిచెన్‌లోకి రుద్రాణి వస్తుంది. కావ్యపై డామినేషన్ మొదలుపెడుతుంది. నువ్వు చేసే వంటలన్నీ ఒకేలా ఉన్నాయని, పేర్లలో తప్ప రుచుల్లో మార్పులు ఉండటం లేదని సెటైర్లు వేస్తుంది. ఫ్రిజ్ ఓపెన్ చేస్తుంది. మొత్తం ఖాళీగా కనిపించడంతో ఇంట్లో ఏం ఉన్నాయో..ఏం లేవో చూసి నువ్వే తెప్పించాలని కావ్యతో అంటుంది.
ధాన్యలక్ష్మి గొడవ...
ఇంట్లో పాలు లేకపోవడంతో మేము తాగడం ఇష్టం లేకే తెప్పించలేదని కావ్యతో ధాన్యలక్ష్మి గొడవపడుతుంది. మనం ఆకలితో ఉంటే కావ్యకు ఆనందంగా ఉంటుందని ధాన్యలక్ష్మిని రుద్రాణి మరింత రెచ్చగొడుతుంది. మా నాన్నగారు ఆస్తి నీ పేరు మీద రాయగానే కళ్లు నెత్తికి ఎక్కాయి...వదిన తాళాలు ఇవ్వగానే మా అందరి నెత్తిన ఎక్కి ఆడాలని అనుకుంటే కుదరదని కావ్యను నానా మాటలు అంటుంది రుద్రాణి.
మేము ఇలాగే మాట్లాడుతాం...
అర్థపర్థం లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారని కావ్య అనగానే...పెద్దరికంతో నిన్ను ఒక్క మాట కూడా అనే అధికారం లేదా అంటూ తమ గొడవను సర్ధిచెప్పుకుంటారు రుద్రాణి, ధాన్యలక్ష్మి. మేము ఇలాగే మాట్లాడుతామని అంటారు. తన రూమ్‌లో ఏసీ పాడయిందని, షవర్ పనిచేయడం లేదని...అవన్నీ తొందరగా రిపేర్ చేయమని కావ్యకు ఆర్డర్ వేస్తుంది రుద్రాణి.
ధాన్యలక్ష్మిపై పొగడ్తలు...
కావ్యను హడలెత్తించావని ధాన్యలక్ష్మిని తెగ మెచ్చుకుంటుంది రుద్రాణి. ఈ ఫైర్ ముందు నుంచి ఉంటే మన ఆస్తి ఎప్పుడో మనకు దక్కేది అని అంటుంది. ఇన్నాళ్లు మంచిగా ఉంటే తనను ఎవరూ పట్టించుకోలేదని, ఇక నుంచి ఇలాగే ఉంటానని ధాన్యలక్ష్మి అంటుంది.
రాజ్ డ్రామా...
చిట్‌ఫండ్ ఓనర్ నందగోపాల్ ఇంటికి వస్తాడు రాజ్. కానీ అతడు ఇంట్లో లేడని వాచ్‌మెన్ చెబుతాడు. ఫోన్ చేస్తే స్విఛాఫ్ వస్తుంది. వాచ్‌మెన్ నుంచి సమాచారం రాబట్టడానికి డ్రామా ఆడుతాడు. నందగోపాల్‌కు యాభై లక్షలు ఇవ్వాలని, ఆ డబ్బు ఇచ్చేందుకు వచ్చానని అంటాడు. రాజ్ మాటలు నిజమని నమ్మిన వాచ్‌మెన్ నందగోపాల్ అడ్రెస్ చెబుతాడు.
మూడు లక్షలు...
ధాన్యలక్ష్మి ఖరీదైన చీర కొంటుంది. ఆ చీర కోసం మూడు లక్షలు డబ్బు కావాలని కావ్యను అడుగుతుంది. ఆమె అడిగినంత మొత్తం ఇస్తుంది కావ్య. అయినా కావ్యతో గొడవపడుతుంది ధాన్యలక్ష్మి. ఎవరి ముందు ఎలా నడుచుకోవాలో తెలియదా అంటూ అరుస్తుంది. డిజైనర్ ముందు కావాలనే నా పరువు తీశావని రచ్చ చేస్తుంది.
కావ్యకు వార్నింగ్...
నాకు అంత డబ్బు ఖర్చు పెట్టే అర్హత లేదని అవమానిస్తున్నావా నానా యాగీ చేసి వెళ్లిపోతుంది. ఇంకోసారి బయటివాళ్ల ముందు నన్ను తక్కువ చేస్తే ఊరుకునేది లేదని కావ్యకు వార్నింగ్ ఇస్తుంది ధాన్యలక్ష్మి. తాను ఇంటి బాధ్యతలు తీసుకున్న తర్వాతే తనను ఇరికించడానికే రుద్రాణి, ధాన్యలక్ష్మి లక్షలు ఖర్చుచేస్తున్నారని కావ్య అనుమానపడుతుంది. ఇస్తే ఒక గొడవ...ఇవ్వక పోతే ఒక గొడవ పెద్ద చిక్కే వచ్చి పడిందని అనుకుంటుంది.
నందగోపాల్ మిస్సింగ్...
నందగోపాల్ పెద్ద ఫ్రాడ్ అని, చాలా మంది అమాయకుల జీవితాలతో ఆడుకున్నాడని పోలీస్ ఆఫీసర్ రాజ్‌కు చెబుతాడు. రాజ్ ఆవేశంగా నందగోపాల్ ఉన్న ఫామ్ హౌజ్‌కు వస్తాడు. రాజ్ ఫామ్ హౌజ్‌కు వస్తోన్న విషయం నందగోపాల్‌కు తెలిసిపోతుంది. అక్కడి పారిపోతాడు. రాజ్ ఆవేశంగా నందగోపాల్ కోసం ఫామ్‌హౌజ్‌లోకి వెళ్లబోతాడు. అతడిని ఆపిన సెక్యూరిటీ గార్డ్ నందగోపాల్ ఫారిన్ వెళ్లాడని అంటాడు. అతడి దొరికినట్లే దొరికి పారిపోవడంతో ఏం చేయాలో తెలియక రాజ్ ఆలోచనలో పడతాడు.
స్వప్న షాపింగ్...
స్వప్న షాపింగ్ కోసం లక్షన్నర కావ్యను అడుగుతుంది. ఇంటిల్లిపాదికి కొంటున్నావా అంత డబ్బు ఎందుకు అని, వెయ్యి, పదిహేను వందలు సరిపోవా అని స్వప్నతో అంటుంది కావ్య. వెయ్యి పదిహేను వందలు కనకం కూతురిగా ఉన్నప్పుడు...లక్ష...లక్షన్నర దుగ్గిరాల కోడలిగా ఉన్నప్పుడని స్వప్న అంటుంది. పుట్టింట్లో ఉన్నప్పుడు వందల్లో ఖర్చుపెట్టాలి...అత్తింట్లో ఉన్నప్పుడు లక్షల్లో ఖర్చుపెట్టాలని అంటూ లాజిక్‌లు మాట్లాడటంతో ఆమె అడిగినంత డబ్బు ఇచ్చేస్తుంది కావ్య. తాను అడిగినంద డబ్బు ఇవ్వగానే ఆనందంతో కావ్యకు ఆనందంతో ముద్దుపెడుతుంది స్వప్న.
రుద్రాణికి పంచ్...
స్వప్నకు కావ్యకు డబ్బు ఇస్తోన్న టైమ్‌లో అక్కడికి ఎంట్రీ ఇస్తోంది రుద్రాణి. మీ అక్క అడిగినంత డబ్బు ఇస్తున్నావని, అదే నేను అడిగితే మాత్రం ఎందుకు ఖర్చు చేస్తున్నావంటూ ఆరాలు తీస్తున్నావంటూ కావ్యను కొప్పడుతుంది. నువ్వు ఎంత ఖర్చు చేస్తున్న లెక్కలన్నీ నా దగ్గర ఉన్నాయని, ఎక్కువ మాట్లాడితే ఆ లెక్కలన్నీ బయటపెడతానని, నీకు కావ్య డబ్బులు ఇవ్వకుండా చేస్తానని రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది స్వప్న.
బాధ్యతలు బరువు…
నువ్వు బెదిరిస్తే భయపడేవాళ్లు ఎవరూ లేరని అంటుంది. నువ్వు చాలా ఏక్కువ మాట్లాడుతున్నావని రుద్రాణి కోడలిపై రివర్స్ ఎటాక్ చేయబోతుంది. . మాటలతో సరిపెట్టాను సంతోషించండి అని రుద్రాణి నోరూ మూయిస్తుంది స్వప్న. తాళాలు తేలికగానే ఉన్నాయి. కానీ బాధ్యతలే బరువుగా ఉన్నాయని కావ్య అనుకుంటుంది. రాజ్ రాగానే ఇంటి బాధ్యతలు అతడికి అప్పగించాలని ఫిక్సవుతుంది.
రాజ్ చిరాకు..
నందగోపాల్ ఎక్కడ కనిపించకపోవడంతో రాజ్ కంగారుపడతాడు. అతడిని ఎలాగైనా పట్టుకోమని పోలీస్ ఆఫీసర్‌కు చెబుతాడు. సీతారామయ్య తరఫున కావ్య డబ్బును దానం చేస్తుంది. ధానధర్మాల కోసం ఆస్తి మొత్తం ఖర్చు చేసేలా ఉన్నావని రుద్రాణి పంచ్‌లు వేస్తుంది. వంద కోట్ల గురించి ఆలోచిస్తూ రాజ్ చాలా టెన్షన్‌లో ఉంటాడు. కాఫీ తీసుకొచ్చిన కావ్యపై ఫైర్ అవుతాడు. కాఫీ తాగకపోతే నువ్వు కూడా ఫైన్ వేస్తావా...ఎంత కట్టాలి...లక్షల...కోట్లా ఎంత చెప్పు అని ఎగిరిపడతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.