Ind vs Aus 3rd Test: అప్పుడే మూడు వికెట్లు డౌన్.. కోహ్లి మళ్లీ ఫెయిల్.. కష్టాల్లో టీమిండియా-ind vs aus 3rd test team india lose 3 wickets brisbane test 3rd day virat kohli failed ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Aus 3rd Test: అప్పుడే మూడు వికెట్లు డౌన్.. కోహ్లి మళ్లీ ఫెయిల్.. కష్టాల్లో టీమిండియా

Ind vs Aus 3rd Test: అప్పుడే మూడు వికెట్లు డౌన్.. కోహ్లి మళ్లీ ఫెయిల్.. కష్టాల్లో టీమిండియా

Hari Prasad S HT Telugu
Dec 16, 2024 08:40 AM IST

Ind vs Aus 3rd Test: బ్రిస్బేన్ టెస్టులోనూ టీమిండియా కష్టాలు మొదలయ్యాయి. విరాట్ కోహ్లి మరోసారి చేతులెత్తేసిన వేళ మూడో రోజు లంచ్ సమయానికే ఇండియా తొలి ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు కోల్పోయింది. అంతకుముందు ఆస్ట్రేలియా 445 రన్స్ చేసింది.

అప్పుడే మూడు వికెట్లు డౌన్.. కోహ్లి మళ్లీ ఫెయిల్.. కష్టాల్లో టీమిండియా
అప్పుడే మూడు వికెట్లు డౌన్.. కోహ్లి మళ్లీ ఫెయిల్.. కష్టాల్లో టీమిండియా (AP)

Ind vs Aus 3rd Test: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. మరోసారి ఆసీస్ పేసర్లు స్టార్క్, హేజిల్‌వుడ్ ధాటికి మూడో రోజు లంచ్ సమయానికి 3 వికెట్లు కోల్పోయి 22 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్, గిల్, కోహ్లి ఇప్పటికే పెవిలియన్ చేరారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 445 రన్స్ చేయగా.. టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది.

కోహ్లి.. మళ్లీ ఫెయిల్

బ్రిస్బేన్ టెస్టులో టీమిండియా టాపార్డర్ మరోసారి నిరాశ పరిచింది. ఆస్ట్రేలియా పేసర్లు స్టార్క్, హేజిల్‌వుడ్ ధాటికి మూడో రోజు లంచ్ సమయానికి 3 వికెట్లు కోల్పోయి 22 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4), శుభ్‌మన్ గిల్ (1), విరాట్ కోహ్లి (3) ఔటయ్యారు. స్టార్క్ 2, హేజిల్‌వుడ్ ఒక వికెట్ తీసుకున్నారు.

ఆస్ట్రేలియాను మొదట్లోనే కట్టడి చేసి తర్వాత చేతులెత్తేయగా.. ఇప్పుడు బ్యాటింగ్ లోనూ తడబడుతూ మూడో రోజే మ్యాచ్ పై ఆశలు వదిలేసే పరిస్థితి తీసుకొచ్చింది. ఇండియా ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికే షాక్ తగిలింది. తొలి బంతినే ఫోర్ కొట్టి ఊపు మీద కనిపించిన యశస్వి.. తర్వాతి బంతికే ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన గిల్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు.

స్టార్క్ వేసిన మూడో ఓవర్ తొలి బంతికే డ్రైవ్ ఆడబోయి స్లిప్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక విరాట్ కోహ్లి వైఫల్యాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అతడు లంచ్ కు ముందు హేజిల్‌వుడ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కేరీకి క్యాచ్ ఇచ్చాడు. దీంతో 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది.

ఆస్ట్రేలియా 445 ఆలౌట్

అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆలౌటైంది. ఆ టీమ్ తొలి రోజు తొలి సెషన్ లోనే 75 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా.. హెడ్ (152), స్మిత్ (101) సెంచరీలు.. కేరీ (70) హాఫ్ సెంచరీతో భారీ స్కోరు సాధించింది. బుమ్రా 6 వికెట్లతో రాణించగా.. సిరాజ్ 2, నితీష్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్ చెరొక వికెట్ తీసుకున్నారు.

Whats_app_banner