తెలుగు న్యూస్ / ఫోటో /
Rahu Transit Effects: శని సొంత రాశిలోకి రాహు, ఈ రాశుల వారికి అదృష్టం, ఆదాయం రెండూ కలిసి వస్తున్నాయి
- Rahu Transit Effects: /జ్యోతిష్య శాస్త్రంలో రాహువును నీడ గ్రహంగా, పాప గ్రహంగా భావిస్తారు. అయినప్పటికీ రాహువు సంచారంలో మార్పు అన్ని వేళలా అశుభాన్ని మాత్రమే కలిగించదు. 2025లో రాహువు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది మూడు రాశుల వారి తలరాతలను మార్చనుంది. ఆదాయానికి మించిన అదృష్టాన్నితీసుకొస్తుంది.
- Rahu Transit Effects: /జ్యోతిష్య శాస్త్రంలో రాహువును నీడ గ్రహంగా, పాప గ్రహంగా భావిస్తారు. అయినప్పటికీ రాహువు సంచారంలో మార్పు అన్ని వేళలా అశుభాన్ని మాత్రమే కలిగించదు. 2025లో రాహువు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది మూడు రాశుల వారి తలరాతలను మార్చనుంది. ఆదాయానికి మించిన అదృష్టాన్నితీసుకొస్తుంది.
(1 / 5)
జ్యోతిషశాస్త్రంలో, రాహువును నీడ గ్రహం, పాప గ్రహం అంటారు. రాహువు అనుకూలంగా లేకపోతే వ్యాధి, జూదం, కఠినమైన మాటలు, దొంగతనం వంటి వాటికి అలవాటు పడతారు. రాహువు తన కదలికలను మార్చుకున్నప్పుడల్లా దాని ప్రభావం వల్ల 12 రాశుల వారిపై ప్రభావం పడుతుందని చెబుతారు. పాప గ్రహం అయినప్పటికీ రాహువు కదలికల్లో మార్పు అన్నివేళలా అశుభంగానే ఉంటుందని చెప్పలేము. 2025లో రాహువు సంచారంలో మార్పు అనేక రాశులకు శుభ ప్రయోజనాలు కలిగిస్తుంది.
(2 / 5)
వైదిక గ్రంథాల ప్రకారం, రాహువు సాధారణంగా 18 నెలలు అంటే ఒకటిన్నర సంవత్సరాలు ఒకే రాశిలో సంచరిస్తాడు. ఆ తరువాత తమ రాశికి మార్చుకుని మరొక రాశిలో సంచరిస్తాడు. జ్యోతిష్య గణన లెక్కల ప్రకారం.. రాహువు 2025 మే 18న సాయంత్రం 04:30 గంటలకు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది మూడు రాశుల వారికి అదృష్టాన్ని, ఆదాయాన్ని తెచ్చిపెట్టనుంది. ఆ రాశులేవో చూద్దాం.
(3 / 5)
వృషభ రాశి : కుంభ రాశిలో శని సంచారం వృషభ రాశి వారికి శుభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో వీరికి చాలా గొప్ప అవకాశాలు లభిస్తాయి. పెండింగ్ పనుల్లో చాలా వరకు వచ్చే ఏడాది మే తర్వాత పూర్తవుతాయి. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనా శక్తి పెరుగుతుంది, దీని వల్ల మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. ఆర్థికంగా మరింత వృద్ధి చెందుతారు.
(4 / 5)
మిథునం : వచ్చే ఏడాది రాహు సంచారం మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ఇంక్రిమెంట్లు, పదోన్నతులు వచ్చే అవకాశముంది. వ్యాపారంలో పెద్ద డీల్ పొందుతారు. ఆలోచించి ఆచరిస్తే అదృష్టవంతులు అవుతారు.
(5 / 5)
కుంభం : మీ రాశిలో రాహు సంచారం మీ జీవితాల్లో పెను మార్పులకు కారణమవుతుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. దాని వల్ల మీ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ప్రేమలో ఉన్న జంటలకు వచ్చే ఏడాది చాలా సంతోషం లభిస్తుంది.వివాహం జరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ఇంక్రిమెంట్లతో పదోన్నతి పొందవచ్చు. విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు.
ఇతర గ్యాలరీలు