తెలుగు న్యూస్ / ఫోటో /
రియల్మీ జీటీ 7 ప్రో వర్సెస్ రియల్మీ జీటీ 6- ప్రీమియం ఫీచర్ స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది బెస్ట్?
రియల్మీ జీటీ 7 ప్రో వర్సెస్ రియల్మీ జీటీ 6.. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది బెస్ట్? మిడ్ రేంజ్ సెగ్మెంట్లో లాంచ్ అయిన రియల్మీ జీటీ 6 కంటే రియల్మీ జీటీ 7 ప్రో అప్‌గ్రేడ్ విలువైనదా? ఇక్కడ తెలుసుకోండి..
(1 / 6)
డిజైన్: రియల్మీ జీటీ 6, రియల్మీ జీటీ 7 ప్రో ప్రైజ్ రేంజ్‌తో పాటు చాలా భిన్నమైన డిజైన్ని కలిగి ఉన్నాయి. రియల్మీ జీటీ 7 మార్స్ ఆధారిత డిజైన్, అల్యూమినియం ఫ్రేమ్‌తో ఫ్లాగ్షిప్ సెగ్మెంట్లో లాంచ్ అయింది. రియల్మీ జీటీ 6 డ్యూయల్ టోన్ గ్లాస్ ప్యానెల్‌తో వస్తుంది, ఇది ఐపి 65 రేటింగ్‌తో నిగనిగలాడే డిజైన్ని కలిగి ఉంది. మరోవైపు, జిటి 7 ప్రోకు ఐపీ69 రేటింగ్ ఉంది.(Aishwarya Panda/ HT Tech)
(2 / 6)
డిస్ప్లే: రియల్మీ జీటీ 7 ప్రోలో 6.78 అంగుళాల ఎల్టీపీవో అమోఎల్ఈడీ క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6500 అంగుళాల పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. రియల్మీ జీటీ 6 స్మార్ట్ఫోన్లో 6.78 అంగుళాల ఎల్టీపీవో అమోఎల్ఈడీ డ్యూయల్ కర్వ్డ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. (Aishwarya Panda/ HT Tech)
(3 / 6)
కెమెరా: రియల్మీ జీటీ 7 ప్రో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది, ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 50 మెగాపిక్సెల్ లెన్స్ ఉన్నాయి. రియల్మీ జీటీ 6లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి.(Ijaj Khan/HT Tech)
(4 / 6)
పర్ఫార్మెన్స్: రియల్మీ జీటీ 7 ప్రో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, అడ్రినో 830 జీపీయూతో పనిచేస్తుంది. 16 జీబీ ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్‌ని ఇందులో అందించారు. మరోవైపు రియల్మీ జీటీ 6లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్, అడ్రినో 735 జీపీయూ, 16 జీబీ ర్యామ్ ఉన్నాయి.(Aishwarya Panda/ HT Tech)
(5 / 6)
బ్యాటరీ: రియల్మీ జీటీ 7 ప్రోలో 5,800 ఎంఏహెచ్, రియల్మీ జీటీ 6లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఈ రెండు డివైస్‌లు 120వాట్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తాయి.(Aishwarya Panda/ HT Tech)
ఇతర గ్యాలరీలు