Jabardasth Rohini: నిఖిల్ విలన్...గౌతమ్ హీరో అంటూ రోహిణి కామెంట్స్ - పృథ్వీ విషయంలో విష్ణుప్రియ రిగ్రేట్
Bigg Boss Elimination: బిగ్‌బాస్ 8 తెలుగు డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా శనివారం ఎపిసోడ్‌లో రోహిణి ఎలిమినేట్ అయ్యింది. ఆమెకు సెల్యూట్ చేస్తూ హౌజ్‌మేట్స్ సెండాఫ్ ఇచ్చారు. స్టేజ్‌పైకి వచ్చిన రోహిణి...హౌజ్‌లో నిఖిల్, నబీల్, విష్ణుప్రియలను విలన్స్‌గా పేర్కొన్నది.
Bigg Boss Elimination: బిగ్‌బాస్ 8 తెలుగు నుంచి శనివారం ఎపిసోడ్‌లో రోహిణి ఎలిమినేట్ అయ్యింది. ఈ వారమే ఫస్ట్ టైమ్ రోహిణి నామినేషన్స్‌లోకి వచ్చింది రోహిణి. వచ్చిన మొదటి సారే హౌజ్ నుంచి బయట అడుగుపెట్టింది. , ఎమోషనల్ సీన్స్, కన్నీళ్లు లేకుండా నవ్వుతూ హౌజ్‌ను విడిచిపెట్టింది. సెల్యూట్ చేస్తూ హౌజ్‌మేట్స్ రోహిణికి సెండాఫ్ ఇచ్చారు.
నాగార్జున ప్రశంసలు...
స్టేజ్‌పైకి వచ్చిన రోహిణిపై నాగార్జున పొగడ్తలు కురిపించాడు. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి వారమే ఎలిమినేషన్ వరకు వెళ్లి...ఆ తర్వాత ఆట తీరు మార్చికొని సోలోగా ఫైనల్ వరకు వచ్చావు. నువ్వు ఆడిన విధానానికి ఫిదా అయ్యానని అని రోహిణితో నాగార్జున అన్నాడు.
హీరోలు...విలన్లు...
హౌజ్‌లో విలన్లు ఎవరు? హీరోలు ఎవరు? అని రోహిణిని నాగార్జున అడిగాడు. అవినాష్, గౌతమ్, ప్రేరణలను హీరోలుగా పేర్కొన్నది రోహిణి...నిఖిల్, నబీల్, విష్ణుప్రియలను విలన్లుగా చెప్పింది.
మెగా చీఫ్‌లుగా ఉన్నప్పుడు ఎవరెవరు ఏ తప్పులు చేశారని కంటెస్టెంట్స్‌ను నాగార్జున అడిగాడు. తాను మెగా ఛీఫ్‌గా ఉన్నప్పుడు విష్ణు, రోహిణి మధ్య గొడవను పరిష్కరించలేకపోయానని అవినాష్ అన్నాడు. తాను మెగా చీఫ్‌గా ఉన్నప్పుడు తాను బ్యాలెన్స్ కోల్పోవడం వల్ల ఇతర హౌజ్‌మేట్స్ చాలా ఇబ్బందులు పడ్డారని ప్రేరణ తెలిపింది. తొమ్మిదో వీక్‌లో తనకు మెగా చీఫ్‌గా ఉండే అవకాశం వస్తే ఆ ఛాన్స్ మిస్ చేసుకొని తప్పుచేశానని నబీల్ తెలిపాడు.
స్వార్థంతో రాశా...
ఫినాలే రేసులో నిలవడానికి బ్లాంక్‌చెక్‌పై 15 లక్షలు ఎందుకు రాశావని నబీల్‌ను అడిగాడు నాగార్జున. ఫైనల్ చేరాలనే స్వార్థంతో రాశానని నబీల్‌ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఎవిక్షన్ షీల్డ్ గేమ్‌లో అవినాష్ నోట్ల గుడ్డు వేసినందుకు రిగ్రేట్ గా ఫీలయ్యానని రోహిణి తెలిపింది.
పృథ్వీని ఫ్లర్టింగ్...
ఆ తర్వాత పృథ్వీని ఫ్లర్ట్ చేశానని, ఆ ఫ్లర్టింగ్ వల్ల అతడి గేమ్ చాలా డిస్ట్రబ్ అయ్యిందని విష్ణుప్రియ అన్నది. అలాగే తొమ్మిదో వారంలో నబీల్‌ను నామినేట్ చేయడం కూడా తప్పని అనిపించిందని చెప్పింది. తనను కామెడీ టాస్కుల్లో అశ్వత్థామ అని పిలిచినందుకు రిగ్రేట్‌గా ఫీలయ్యానని గౌతమ్ అన్నాడు. నిఖల్‌తో జరిగిన గొడవ గురించి గౌతమ్‌కు నాగార్జున క్లాస్ ఇచ్చాడు. వాడుకున్నావ్, మూసుకొని కూర్చో...ఇలాంటి పదాలు ఎలా వాడావని నిలదీశాడు. తన తప్పును గౌతమ్ ఒప్పుకున్నాడు. మరోసారి నిఖిల్‌కు సారీ చెప్పాడు.
నిఖిల్ సారీ...
ఆ తర్వాత నిఖిల్ వంతు రాగా...తాను 14వ వారంలో గౌతమ్‌పై నోరుజారడం తప్పని నిఖిల్ ఒప్పుకున్నాడు. రంగుపడుద్ది టాస్క్‌లో గౌతమ్...నిఖిల్‌ను కావాలనే కొట్టాడా అనే విషయంలో వీడియోను చూపించాడు. కావాలనే కాకుండా అనుకోకుండా తగిలిందని వీడియో ద్వారా క్లారిటీ వచ్చింది. దాంతో గౌతమ్‌కు నిఖిల్ సారీ చెప్పాడు.