Business Idea : తక్కువ పెట్టుబడితో బొమ్మల వ్యాపారం.. ఈ బిజినెస్ ఎక్కడైనా వర్కౌట్ అవుతుంది!-toys business idea low investment with good profits know this business details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Business Idea : తక్కువ పెట్టుబడితో బొమ్మల వ్యాపారం.. ఈ బిజినెస్ ఎక్కడైనా వర్కౌట్ అవుతుంది!

Business Idea : తక్కువ పెట్టుబడితో బొమ్మల వ్యాపారం.. ఈ బిజినెస్ ఎక్కడైనా వర్కౌట్ అవుతుంది!

Anand Sai HT Telugu
Dec 17, 2024 11:30 AM IST

Business Idea : పిల్లలు ఆడుకునే బొమ్మలు ఎక్కువగా చైనా నుంచి దిగుమతి అయ్యేవే. అయితే ఈ దిగుమతిని తగ్గించుకోవాలని మోదీ ప్రభుత్వం చూస్తోంది. ఇలాంటి సమయంలో మీరు టాయ్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తే మీరు సక్సెస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

టాయ్స్ బిజినెస్ ఐడియా
టాయ్స్ బిజినెస్ ఐడియా

ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మీకోసం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. తక్కువ ఖర్చులో మంచి రాబడి వచ్చే వ్యాపారం గురించి చూడాలి. మీరు చిన్న పిల్లలకు ఇష్టమయ్యే టాయ్స్ బిజినెస్ మెుదలుపెట్టండి. ఈ వ్యాపారాన్ని ఎక్కడ ప్రారంభించినా లాభం ఖచ్చితంగా ఉంటుంది. ఈ వ్యాపారానికి డిమాండ్ ఎల్లప్పుడూ ఉంటుంది.

ఇప్పటి వరకు చైనీస్ బొమ్మలకు భారతదేశంలో అత్యధిక డిమాండ్ ఉంది. దేశంలో బొమ్మల ఉత్పత్తిని పెంచడం ద్వారా చైనా బొమ్మలకు డిమాండ్ తగ్గించాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు ఇతర దేశాలకు ఎగుమతులు చేయాలని అనుకుంటోంది. ఈ కారణంగా ఈ సమయంలో మీరు బొమ్మల బిజినెస్‌లోకి దిగితే మంచి రాబడులు ఉంటాయి.

బొమ్మల వ్యాపారం ప్రారంభించాలనుకుంటే దీని కోసం ముందుగా బాగా పరిశోధన చేయాలి. బొమ్మల వ్యాపారంలో మృదువైన బొమ్మలు, టెడ్డీలను తయారు చేసే వ్యాపారాన్ని చేయవచ్చు. మీరు దీన్ని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ వ్యాపారంలో మీరు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. రూ.40 వేలతో కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. దీని ద్వారా మీరు ప్రతి నెలా రూ.30వేలపైన సంపాదించొచ్చు. మీ ఆదాయం ఎన్ని ఉత్పత్తులు విక్రయించబడుతున్నాయి అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి.

ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు రెండు యంత్రాలను కొనుగోలు చేయాలి. దీనితో పాటు ముడిసరుకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మృదువైన బొమ్మలు, టెడ్డీలను తయారు చేయడానికి మీకు గుడ్డ కట్టింగ్ మెషిన్, కుట్టు యంత్రం అవసరం. క్లాత్ కటింగ్ మెషిన్ ధర రూ.4000 వరకు ఉంటుంది. కుట్టుమిషన్ మీకు రూ.9000 నుంచి రూ.10 వేల వరకు ఖర్చవుతుంది.

వ్యాపారంలో సంపాదించడం గురించి చూస్తే.. రూ. 15,000 విలువైన ముడి పదార్థాల నుండి 100 యూనిట్ల సాఫ్ట్ బొమ్మలను తయారు చేయవచ్చు. ఈ వ్యాపారం ప్రారంభించడానికి మీరు రూ.35 వేల వరకు పెట్టుబడి పెట్టాలి. అయితే మెత్తని బొమ్మను మార్కెట్‌లో రూ.500 నుంచి రూ.600 వరకు అమ్మవచ్చు. దీంతో నెలకు వేలల్లో డబ్బులు సంపాదించొచ్చు.

మీరు ఎంత ఉత్పత్తి చేస్తున్నారనే అంశంపై మీ రాబడి ఉంటుంది. మీరు నేరుగా దుకాణాల్లో హోల్‌సేల్ రేట్లతో బొమ్మలను విక్రయించవచ్చు. లేదంటే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ కూడా మీ మార్కెట్‌కు ఉపయోగపడుతుంది.

గమనిక : ఇది కేవలం బిజినెస్ గురించి ఐడియా మాత్రమే. ఏదైనా వ్యాపారంలో దిగే ముందు పూర్తిగా రిసెర్చ్ చేయాలి. వ్యాపారం అంటే లాభాలే కాదు.. నష్టాలు కూడా చూడాల్సి వస్తుంది.

Whats_app_banner