Teddy Day 2024 : టెడ్డీ డే ప్రాముఖ్యత.. ఏ రంగు టెడ్డీ ఇస్తే ఏమని అర్థం?-teddy day 2024 importance in valentines week which colour teddy is best to gift ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Teddy Day 2024 : టెడ్డీ డే ప్రాముఖ్యత.. ఏ రంగు టెడ్డీ ఇస్తే ఏమని అర్థం?

Teddy Day 2024 : టెడ్డీ డే ప్రాముఖ్యత.. ఏ రంగు టెడ్డీ ఇస్తే ఏమని అర్థం?

Anand Sai HT Telugu
Feb 10, 2024 07:00 AM IST

Teddy Day 2024 Significance : ప్రేమికులు ఎంతగానో ఎదురూచూసిన వాలెంటైన్స్ వీక్‌లో టెడ్డీ డే వచ్చింది. ఈరోజున తమ ప్రియమైన వారికి టెడ్డీని బహుమతిగా పంపిస్తారు.

టెడ్డీ డే ప్రాముఖ్యత
టెడ్డీ డే ప్రాముఖ్యత (Unsplash)

అమ్మాయిలకు ఇష్టమైన వాటిలో ఫస్ట్ ఉండేది టెడ్డీ బేర్. ఎందుకంటే తమ ప్రియమైన వ్యక్తిని అందులోనే ఊహించుకుంటూ తెగ సంబరపడిపోతారు. అసలే ఇది వాలెంటైన్ వీక్. ఫిబ్రవరి 10న టెడ్డీ డే. ఇక మీకు ఇష్టమైన వ్యక్తికి టెడ్డీని బహుమతిగా ఇవ్వండి. వాలెంటైన్ వీక్ లో నాలుగో రోజు టెడ్డీబేర్ కు అంకితం. ప్రియమైన వారికి అందమైన టెడ్డీని గిఫ్ట్‌గా ఇస్తారు. మనసులోని ప్రేమను టెడ్డీబేర్ ద్వారా తెలియజేయడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఎంతోమంది టెడ్డీ అంటే చాలా ఇష్టం చూపిస్తారు. వాలెంటైన్ వీక్‌లో చాలా మంది అమ్మాయిలు ఈరోజు కోసం చూస్తారు. ప్రేమించినవాడు ఏ రంగు టెడ్డీని తీసుకొస్తాడో ఆలోచనల్లో ఉంటారు. అయితే ఒక్కో రంగు టెడ్డీ బేర్ ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది.

వాలెంటైన్స్ వీక్‌లో కలర్స్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. టెడ్డీబేర్‌లో రెడ్ చాలా ముఖ్యమైనది ఎర్ర గులాబీలాగే రెడ్ టెడ్డీబేర్ కు ప్రాముఖ్యత ఉంది. ఈ కలర్ ద్వారా మీరు ప్రేమించే వ్యక్తిపై ఎంత ఇష్టమో తెలపవచ్చు. మీ ప్రేమ గాఢతను ఈ రెడ్ కలర్ టెడ్డీబేర్ తెలియజేస్తుంది.

బ్లూ కలర్ టెడ్డీబేర్ ఎన్నో భావాలను తెలుపుతుంది. ఈ రంగు మీరు ఇస్తే మాట నిలబెట్టుకుంటారని అర్థం. ప్రేమలో అయినా.. పెళ్లి అయినా కానీ మీరు మాట మీద నిలబడతారు. ఈ టెడ్డీ ఇస్తే పట్టుకున్న చెయ్యిని ఎప్పటికీ వదలరు అని అర్థం.

పింక్ కలర్ టెడ్డీ అమ్మాయిలకు చాలా ఇష్టం. ప్రేమ, స్నేహం, అనుబంధాన్ని ఈ టెడ్డీ బేర్ తెలుపుతుంది. ఎవరిపైనా ఇష్టం మెుదలైతే పింక్ కలర్ టెడ్డీ బేర్ ఇవ్వవచ్చు.

ఆరెంజ్ కలర్ టెడ్డీ బేర్ ఇతరులపై ఉన్న ఇష్టాన్ని తెలుపుతుంది. ఈ టెడ్డీని ఇచ్చి వారి కారణంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు జరిగాయో చెప్పండి. ఇలా చేస్తే వారు ఎంతో సంతోషిస్తారు.

గ్రీన్ కలర్ టెడ్డీ బేర్ మీ సహనాన్ని, ఓర్పును సూచిస్తుంది. ఈ రంగు టెడ్డీ ఎవరికైనా ఇస్తే.. వారి కోసం ఎని సంవత్సరాలు అయినా వేచి చూస్తారని అర్థం.

ఇలాంటి టెడ్డీలు గిఫ్ట్‌గా ఇవ్వండి

హార్ట్ సింబల్ కలిగి ఉన్న పెద్ద టెడ్డీ బేర్ మీ భాగస్వామికి ఐ లవ్ యూ అని చెప్పడానికి గిఫ్ట్ గా ఇవ్వండి. మీ జీవితంలో ఎంత ముఖ్యమో అర్థమయ్యేలా చేయడానికి ఇది ఒక గొప్ప మార్గం. ఈ టెడ్డీని ఇస్తే.. తర్వాత మీరు కచ్చితంగా మీ భాగస్వామి ముఖంలో అందమైన చిరునవ్వును పూయిస్తారు. మీ రోజు అందంగా ఉంటుందనడంలో సందేహం లేదు.

ఎరుపు గులాబీలు, టెడ్డి బేర్‌లు రెండూ ప్రేమకు పరిపూర్ణ చిహ్నాలు. అందుకే టెడ్డీ డే రోజున ప్రేమను వ్యక్తం చేయడానికి ఎర్ర గులాబీలను ఉపయోగించి తయారు చేసిన టెడ్డీ బేర్ సరైన బహుమతి. ఇది మీకు, మీ భాగస్వామికి నచ్చుతుంది. ఇంత అందమైన బహుమతి పొందిన తర్వాత మీ భాగస్వామి ఉత్సాహంగా ఉంటారు.

మీ ప్రియురాలు లేదా భార్యకు టెడ్డీ బేర్, చాక్లెట్ కాంబోను బహుమతిగా ఇవ్వడం ద్వారా మీ ప్రేమ జీవితానికి మాధుర్యాన్ని జోడించండి. టెడ్డీ బేర్ ఆమెను సంతోషపెడుతుంది., చాక్లెట్ ఆమెకు తీపి జ్ఞాపకం ఇస్తుంది. ఈ రెండింటితో ఆమె మనసు హ్యాపీ ఫీల్ అవుతుంది.

టెడ్డీ బేర్ పంచే ప్రేమ, ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. అందమైన టెడ్డీ బేర్‌తో కూడిన బొకేను మీ ప్రియమైనవారికి ఇవ్వండి. వారి ఆనందాన్ని ఊహించడం అసాధ్యం.

Happy Teddy Day 2024

Whats_app_banner