Chanakya: మీ ఇంట్లో హఠాత్తుగా ఈ మార్పులు వస్తే జాగ్రత్తగా ఉండండి.. దురదృష్టం, ఆర్థిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది
Chanakya: చాణక్య రాసిన నీతి గ్రంథానికి ఇప్పటికీ కూడా ఆదరణ తగ్గలేదు. భార్యాభర్తల మధ్య బంధం గురించి, స్నేహితుల గురించి, భగవంతుడు గురించి, నిజాయితీ గురించి ఇలా చాలా విషయాల గురించి చాణక్య ఎంతో అద్భుతంగా వివరించారు. హఠాత్తుగా ఈ మార్పులు వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
చాణక్య ఆయన వ్యూహాలతో, నైపుణ్యాలతో ఒక సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడిపించగలిగారు. ఆయన సూత్రాలని ఇప్పటికి కూడా ఎంతోమంది ఆచరిస్తున్నారు. ఆయన విధానాలు కూడా ఎంతో మందిని ప్రభావితం చేసాయి. చాణక్య నీతి శాస్త్రంలో ఎన్నో విషయాలు గురించి చెప్పారు. ఆయన చెప్పిన విషయాలు ఇప్పటికి కూడా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలని చాణక్య చెప్పారు.
చాణక్య రాసిన నీతి గ్రంథానికి ఇప్పటికీ కూడా ఆదరణ తగ్గలేదు. భార్యాభర్తల మధ్య బంధం గురించి, స్నేహితుల గురించి, భగవంతుడు గురించి, నిజాయితీ గురించి ఇలా చాలా విషయాల గురించి చాణక్య ఎంతో అద్భుతంగా వివరించారు. హఠాత్తుగా ఈ మార్పులు వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే కొన్ని మార్పులు వలన దురదృష్టం కలుగుతుందని అన్నారు. మరి చాణక్య చెప్పిన విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనం చేసే ప్రతి పని మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. చాణక్యుడు మన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పారు. జీవితంలో మనం పాటించాల్సిన నీతి గురించి చాలా చెప్పారు. ఇంట్లో కొన్ని చెడు విషయాలు జరుగుతూనే ఉంటాయి. చాణక్య నీతి మనం చేసే పనుల వల్లనే అని చెప్తోంది. అదేమిటో ఇక్కడ తెలుసుకుందాం.
పెద్దలను అవమానించడం:
చాణక్యుడి ధర్మం ప్రకారం ఇంట్లో పెద్దలను గౌరవించకపోతే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు.అదే విధంగా మీ ఇంట్లో సుఖసంతోషాలు ఉండవు. అందుకే పిల్లలకు పెద్దలను గౌరవించడం నేర్పుతారు.
పూజ చేయాలి:
మన ఇంట్లో సంపదలు, సౌభాగ్యం కలగాలంటే భగవంతుడిని పూజించడం చాలా ముఖ్యం. రోజూ పూజ చేయడం వల్ల మీకు మంగళయోగం లభిస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది. పూజ గది శుభ్రంగా లేకపోతే సమస్యలు కలగవచ్చు.
గొడవలు, తగాదాలు:
ఇంట్లో ఎప్పుడూ గొడవలు, తగాదాలు ఉంటే లక్ష్మీదేవి ఆ ప్రదేశంలో ఉండదని చాణక్య నీతి చెప్తోంది. అలాగే ఆర్థిక పరిస్థితి సరిగ్గా ఉండదు. మీ ఇంటికి చెడు రోజులు వస్తాయని చాణక్యుడు చెప్పారు.
తులసి మొక్క:
సాధారణంగా భగవంతుని అనుగ్రహాన్ని ప్రసాదించే మొక్కగా తులసి మొక్కను భావిస్తారు. ఇప్పటికీ చాలా మంది ఇంట్లో పూజలు చేస్తుంటారు. అయితే మన ఇంట్లో పెంచుకునే తులసి మొక్క మనకు వచ్చే చెడు సమయాల్లో మనల్ని ముందే చెప్పే స్వభావం కలిగి ఉంటుంది. మీ ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే మీకు తీవ్రమైన ఆర్థిక సమస్యలు వస్తాయని చాణక్య అన్నారు. ఈ కారణంగా తులసి మొక్క మీ ఇంట్లో ఎండిపోతే, మీకు చెడు రోజులు రాబోతున్నాయని అర్థం. కాబట్టి తులసి మొక్క ఎండిపోకూడదని చాణక్య నీతి చెబుతోంది.
గాజు పగలగొట్టడం:
ఇంట్లో గ్లాసు పగలడం చెడ్డ సమయంలో జరిగిన సంఘటనగా పరిగణించబడుతుంది. మీ ఇంట్లోని గ్లాస్ పగిలిపోతే, ఇంట్లోని ఎవరైనా ఇబ్బందుల్లో పడతారని సూచిస్తుంది. కాబట్టి గాజు సామాగ్రిని చాలా సురక్షితంగా నిర్వహించాలని చాణక్యుడు అన్నారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం