Chocolate day 2024: వెచ్చని ప్రేమకు తీయని కానుక చాక్లెట్, ఒకప్పుడు చాక్లెట్ చేదుగా ఉండేది తెలుసా?-chocolate day 2024 chocolate is the unsweetened gift of warm love chocolate was once bitter ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chocolate Day 2024: వెచ్చని ప్రేమకు తీయని కానుక చాక్లెట్, ఒకప్పుడు చాక్లెట్ చేదుగా ఉండేది తెలుసా?

Chocolate day 2024: వెచ్చని ప్రేమకు తీయని కానుక చాక్లెట్, ఒకప్పుడు చాక్లెట్ చేదుగా ఉండేది తెలుసా?

Haritha Chappa HT Telugu
Feb 09, 2024 09:00 AM IST

Chocolate day 2024: చాక్లెట్ అంటే అన్ని వయసుల వారికీ ఇష్టమే. వాలెంటైన్స్ డే వచ్చిందంటే చాక్లెట్ల సేల్స్ అమాంతం పెరిగిపోతాయి. చాక్లెట్ కు ప్రేమకు మధ్య బంధం ఎలా కుదిరింది? చాక్లెట్ డే వచ్చిందంటే ప్రేమికుల నోళ్లు తీపి కావాల్సిందే.

చాక్లెట్ డే
చాక్లెట్ డే

Chocolate day 2024: చాక్లెట్లు పేరు వింటేనే నోరూరిపోతుంది. ఎన్నో రకాల చాక్లెట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. పిల్లలే కాదు పెద్దలు కూడా వీటికి పెద్ద అభిమానులే. చాక్లెట్ అనేక రూపాల్లో మారి టేస్టీ వంటకాలుగా అలరిస్తోంది. చాక్లెట్ కేక్ అంటే ఎంతో మందికి ప్రాణం. వాలెంటైన్స్ వీక్ లో మూడో రోజు చాక్లెట్ డే. ఏడాదికి ఒకసారి వచ్చే ఈ రోజు కోసం ప్రేమికులు ఎంతో వేచి ఉంటారు. వాలెంటైన్స్ వీక్ ఫిబ్రవరి 7న రోజ్ డేతో ప్రారంభమై ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేతో ముగుస్తుంది. ఈ వారంలో రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే ఉన్నాయి.

చాక్లెట్ డేను ప్రేమలో పడిన వారు వాలెంటైన్స్ వీక్ లో మూడవ రోజుగా జరుపుకుంటారు. తన ప్రియురాలికి చాక్లెట్ ఇవ్వడం ద్వారా మనసులోని ప్రేమను తీయగా తెలియజేస్తారు. ప్రేమికుల కోసం ప్రత్యేకమైన చాక్లెట్లు మార్కెట్లో సిద్ధంగా ఉంటాయి. లవ్ సింబల్ లో ఉండే చాక్లెట్లు ఎన్నో వాలెంటైన్స్ డే కోసం తయారుగా ఉన్నాయి.

చాక్లెట్ చరిత్ర

చాక్లెట్ ఇప్పుడంటే తీయగా మారిపోయింది కానీ, ఒకప్పుడు ఇది ఒక చేదు పానీయం. ఆరోగ్యం కోసం పూర్వం గిరిజనులు చాక్లెట్లు తయారు చేసే కోకో గింజలతో చేదు పానీయాన్ని కాచుకుని తాగేవారు. అది ఆరోగ్యానికి ఎంతో మంచిదని నమ్మేవారు. దక్షిణ అమెరికాలో ఎన్నో వందల ఏళ్ల క్రితం మాయ, ఆజ్‌తెక్ తెగవారు నివసించే వారు. వారే కోకో బీన్స్ ని తొలిగా ఉపయోగించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. దీన్ని బట్టి చాక్లెట్ తయారయ్యే కోకో బీన్స్ 3000 ఏళ్ల కిందటి నుంచి వాడుకలో ఉన్నట్టు తెలుస్తోంది. వారే వీటిని పానీయంలాంటిది కాచుకుని తాగే వారు. ఐర్లాండు దేశానికి చెందిన ఒక వ్యక్తి చేదుగా ఉండే కోకో పానీయాన్ని తాగలేక పాలల్లో ఈ కోకో బీన్స్ పొడిని వేశాడు. అది చాలా టేస్టీగా ఉండడంతో... అందరూ అలా తాగడం మొదలు పెట్టారు. ఆ తరువాత పాలు, కోకో పొడి కలిపి చాక్లెట్లు ఘనరూపంలో తయారుచేయడం ప్రారంభించారు.

ప్రేమకు, చాక్లెట్‌కు ఏమిటి సంబంధం?

చాక్లెట్లో లైంగిక కోరికలను పెంచే శక్తి ఉందని అంటారు. అప్పట్లో అజ్‌తక్ తెగను పాలించిన రాజు రోజుకు 50 కప్పుల చాకోలెట్ ద్రావకాన్ని తాగేవాడట. తన ప్రియురాలిని కలిసేందుకు ముందు అలా చేసేవాడట. అప్పట్నించి ప్రేమికుల మధ్య చాక్లెట్ వారధిలా మారిపోయింది. చాక్లెట్లో ఉండే అమైనో ఆమ్లాలు శరీరంలో డోపమైన్, అడ్రినాలిన్ వంటి రసాయనాల ఉత్పత్తిని పెంచుతాయి. అందుకే చాక్లెట్ తినగానే హాయిగా ఉంటుంది. ఒత్తిడి తగ్గినట్టు ఉంటుంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అధికంగా అమ్ముడవుతున్న ఉత్పత్తుల్లో చాక్లెట్లు ఒకటి. ఏటా పదిలక్షల కోట్ల రూపాయల చాక్లెట్లు అమ్ముడవుతున్నట్టు అంచనా. అమెరికాలో చాక్లెట్ల వాడకం ఎక్కువగా ఉంది. వాటితో రకరకాల వంటకాలు చేస్తున్నారు. ఇక స్విట్జర్లాండ్ వాసులు ఏటా ఒక్కొక్కరూ 11 కిలోల చాక్లెట్లు తినేస్తున్నారు. అయినా సరే వారు ఊబకాయం, గుండె జబ్బులు బారిన పడకుండా ఆరోగ్యంగా ఉన్నారు.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన చాక్లెట్ ధర రెండు లక్షల రూపాయలు. దీన్ని 1999లో తయారుచేశారు. దీన్ని ఆర్ఢరు చేస్తేనే తయారుచేస్తారు. వాలెంటైన్స్ డే కు కచ్చితంగా ఎవరో ఒకరు ఆర్డర్ చేస్తూనే ఉంటారు.

Whats_app_banner