NEET UG 2025:నీట్ యూజీ 2025 సిలబస్ విడుదల చేసిన ఎన్ఎంసీ; ఇలా చెక్ చేసుకోవచ్చు..
NEET UG 2025 syllabus: నేషనల్ మెడికల్ కమిషన్ నీట్ యూజీ 2025 (NEET UG 2025) సిలబస్‌ను విడుదల చేసింది. వైద్య అభ్యర్థులు దీనిని nmc.org.in లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షా విధానం పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
NEET UG 2025 syllabus: నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NEET) యూజీ 2025 సిలబస్ ను నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) మంగళవారం విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరు కావాలనుకునే వైద్య అభ్యర్థులు నీట్ యూజీ 2025 (NEET UG 2025) సిలబస్ ను ఎన్ఎంసీ అధికారిక వెబ్సైట్ nmc.org.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నీట్ యూజీ 2025 సిలబస్ ను ఎన్ఎంసీ వెబ్సైట్లో అప్లోడ్ చేశామని, 2025-26 విద్యాసంవత్సరానికి నీట్ యూజీ (NEET UG) పరీక్షల ప్రిపరేషన్ కోసం ఈ కొత్త సిలబస్ ను పరిశీలనలోకి తీసుకోవాలని ఎన్ఎంసీ సూచించింది.
త్వరలో నీట్-యూజీ పరీక్ష విధానంపై నిర్ణయం
వైద్య ప్రవేశ పరీక్ష నీట్-యూజీ (NEET UG 2025)ని పెన్ అండ్ పేపర్ మోడ్ లో నిర్వహించాలా లేదా ఆన్ లైన్ విధానంలో నిర్వహించాలా అనే దానిపై కేంద్ర విద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్చిస్తోందని, దీనిపై త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం తెలిపారు. జేపీ నడ్డా నేతృత్వంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖతో విద్యాశాఖ రెండు దఫాలుగా చర్చలు జరిపినట్లు విద్యాశాఖ మంత్రి ప్రధాన్ తెలిపారు.
నీట్ యూజీ 2025 సిలబస్ ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
నీట్ యూజీ 2025 సిలబస్ డౌన్లోడ్ చేసుకోవడానికి, అభ్యర్థులు ఈ క్రింది దశలను అనుసరించవచ్చు.
- ఎన్ఎంసీ అధికారిక వెబ్ సైట్ nmc.org.in ని సందర్శించండి.
- హోమ్ పేజీలో 'కొత్తగా ఏముంది (What’s new)' విభాగానికి వెళ్లి 'నీట్ యూజీ 2025 పరీక్ష సిలబస్' అనే లింక్ పై క్లిక్ చేయాలి.
- నీట్ యూజీ 2025 సిలబస్ పీడీఎఫ్ ఫైల్ కొత్త పేజీలో ఓపెన్ అవుతుంది.
- సిలబస్ పీడీఎఫ్ ను డౌన్ లోడ్ చేసుకుని భవిష్యత్ రిఫరెన్స్ కోసం ప్రింట్ అవుట్ ను ఉంచుకోవాలి.
- మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎన్ఎంసీ అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలి.