NIACL recruitment 2024 : కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. జీతం 40 వేలు.. వెంటనే అప్లై చేయండి!
NIACL recruitment 2024 : ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ చేపట్టిన 500 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునేవారు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు శుభవార్త. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అసిస్టెంట్(NIACL) కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ 17 డిసెంబర్ 2024 నుండి మెుదలైంది. అభ్యర్థులు newindia.co.in అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ జనవరి 1, 2025గా నిర్ణయించారు.
న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 500 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఈ రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు 2025 జనవరి 1 వరకు newindia.co.in సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 21 నుంచి 30 ఏళ్లు ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. గరిష్ట వయోపరిమితిలో ఎస్టీ/ ఎస్సీ కేటగిరీ యువతకు 5 ఏళ్లు, ఓబీసీ కేటగిరీ యువతకు 3 ఏళ్లు సడలింపు ఉంటుంది.
అప్లై చేసే అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీని పొంది ఉండాలి. దీనితో పాటు అభ్యర్థి తప్పనిసరిగా SSC/HSC/ఇంటర్మీడియట్/గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఆంగ్లాన్ని ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. అభ్యర్థికి తాను దరఖాస్తు చేస్తున్న రాష్ట్రంలోని ప్రాంతీయ భాషపై పరిజ్ఞానం ఉండాలి.
ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, రీజినల్ లాంగ్వేజ్ టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మెయిన్ పరీక్షకు పిలుస్తారు. మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు రీజినల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా రాయాల్సి ఉంటుంది. జీతం 40 వేల వరకు ఉంటుం
NIACL అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం దరఖాస్తు చేయడానికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ. 850 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి. దరఖాస్తు రుసుమును డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, UPI మొదలైన వాటి ద్వారా చెల్లించవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి
రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.newindia.co.inని సందర్శించాలి.
వెబ్‌సైట్ హోమ్ పేజీకి వెళ్లి దిగువన ఉన్న రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయాలి.
న్యూ రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేసి అవసరమైన వివరాలను నింపి నమోదు చేసుకోండి.
దీని తర్వాత ఇతర వివరాలు, సంతకం, ఫోటోను అప్‌లోడ్ చేయండి.
చివరగా అభ్యర్థి నిర్ణీత రుసుము చెల్లించి ఫారమ్‌ను సమర్పించాలి.