(1 / 6)
వాలెంటైన్ వీక్‌లో టెడ్డీ డే ముఖ్యమైనది. మీ ప్రియమైన వారికి టెడ్డీని ఇచ్చి మీ భావాలను వ్యక్తపరిచే రోజు ఇది. ఈ టెడ్డీని పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టపడతారు. టెడ్డీ బొమ్మలు గత శతాబ్ద కాలంగా గిఫ్టులుగా ఇస్తున్నారు. దీని వెనుక ఒక కథ ఉంది.
(Freepik)(2 / 6)
1902లో అమెరికా అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్ట్ వేటకు వెళ్లాడు. మిస్సిస్సిప్పి, లూసియానా సరిహద్దుకు వెళ్లాక ఆయనకు మంచి మద్యం దొరకలేదు. ఆయనకు చికాకుగా అనిపించింది.
(Freepik)(3 / 6)
అధ్యక్షుడితో పాటూ వచ్చిన వారు అతడిని సంతోషపెట్టేందుకు చిన్న ఎలుగుబంటి పిల్లను వెతికి తెచ్చారు. దాన్ని చెట్టుకు కట్టేసి ఉంచారు. దాన్ని షూట్ చేయమని చెప్పారు.
(Freepik)(4 / 6)
కానీ అధ్యక్షుడు ఆ చిన్న ఎలుగుబంటి పిల్లను చూశాక షూట్ చేయాలనిపించలేదు. దాన్ని వదిలేయమని చెప్పాడు. ప్రముఖ వాషింగ్టన్ కార్టూనిస్ట్ క్లిఫోర్డ్ బెర్రీమాన్ ఈ సంఘటన ఆధారంగా ఒక కార్టూన్ గీశాడు. దాన్ని 'డ్రాయింగ్ ది లైన్ ఇన్ మిస్సిస్సిప్పి' అంటారు.
(Freepik)(5 / 6)
అయితే దీన్ని చూసిన వెంటనే కస్టమర్లు ఆ డ్రాయింగ్ కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపారు. అప్పటి నుంచి టెడ్డీ బేర్ బొమ్మలను తయారు చేసి అమ్మడం ప్రారంభించారు. ఐడియల్ టాయ్ కంపెనీ 1903లో వీటిని అమ్మడం మొదలుపెట్టింది.
(Freepik)(6 / 6)
ఇప్పుడు ప్రపంచంలో అధికంగా అమ్ముడవుతున్నబొమ్మల్లో టెడ్డీ బేర్ లు మొదటి స్థానం. వాలెంటైన్స్ డే వస్తే చాలు గులాబీలతో పాటూ టెడ్డీలు అధికంగా అమ్ముడవుతాయి.
(Freepik)ఇతర గ్యాలరీలు