Tulasi Plant: తులసి మొక్క చుట్టుపక్కల ఈ 5 మొక్కలను నాటకండి, ఇల్లు నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది-do not plant these 5 plants around the tulsi plant the house will be filled with negative energy ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tulasi Plant: తులసి మొక్క చుట్టుపక్కల ఈ 5 మొక్కలను నాటకండి, ఇల్లు నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది

Tulasi Plant: తులసి మొక్క చుట్టుపక్కల ఈ 5 మొక్కలను నాటకండి, ఇల్లు నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది

Haritha Chappa HT Telugu
Dec 17, 2024 12:30 PM IST

Tulasi Plant: హిందూ మతాన్ని నమ్మే చాలా మంది ఇళ్లలో తులసి మొక్క కనిపిస్తుంది. మీకు తులసి మొక్క కూడా ఉంటే, దానికి సంబంధించిన ఈ ప్రత్యేక విషయాలు మీరు తెలుసుకోవాలి.

తులసి మొక్క
తులసి మొక్క (Shutterstock)

హిందూ మతంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీన్ని ప్రతిరోజూ పూజిస్తారు. అందుకే ఈ మొక్కను తులసీమాత అని పిలుస్తారు. తులసి అనేది కేవలం మొక్క మాత్రమే కాదు, దేవతగా పూజిస్తారు. లక్ష్మీదేవి తులసి మొక్కలోనే జీవిస్తుందని అంటారు. దాదాపు ప్రతి ఇంటి ఆవరణలో లేదా బాల్కనీలో మీరు ఖచ్చితంగా ఒక తులసి మొక్కను ఉంచుతారు. తులసి మొక్కను నాటిన ఆవరణలో ఎల్లప్పుడూ సంతోషం, సానుకూల వాతావరణం ఉంటుందని చెబుతారు. అయితే ఇంట్లో తులసి మొక్కను ఉంచడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఉదాహరణకు మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే దాని చుట్టూ కొన్ని చెట్లు, మొక్కలను పెట్టకూడదు. ఇలా పెంచడం వల్ల ఇంటిలోని సంతోషాన్ని, శాంతిని తొలగించి ప్రతికూలతను వ్యాప్తి చెందేలా చేస్తాయి. కాబట్టి అలాంటి మొక్కలు తులసి దగ్గర ఉండకుండా చూసుకోండి.

కాక్టస్ మొక్కలు

ఎడారి మొక్కలుగా పిలుచుకునే కాక్టస్ మొక్కలు చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయి. వీటిని ఇంటి అలంకరణలో వాడతారు. వీటికి చాలా తక్కువే నీరు వేస్తారు కాబట్టి పెంచడం కూడా చాలా సులువే. కొంతమంది ఈ ముళ్ల మొక్కలను తులసికి సమీపంలో ఇంటి ఆవరణలో లేదా బాల్కనీలో నాటుతారు. ఇది మంచిదికాదు. నిజానికి ఇంట్లో ముళ్ల మొక్కలను పెంచకూడదు. అవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయని అంటారు. ముఖ్యంగా తులసి మొక్కకు దగ్గరలో వీటిని ఉంచకూడదు.

పెద్ద చెట్లు

ఇంటి లోలప పెద్ద పెరడును కలిగి ఉండేవారు ఎంతో మంది ఉంటారు. అక్కడ రావి, మామిడి వంటి అనేక రకాల పెద్ద చెట్లను నాటుతారు. వాటికి దగ్గర్లోనే తులసి మొక్కను కూడా నాటుతారు. ఇది వాస్తు ప్రకారం శుభప్రదం కాదు. వాస్తుతో పాటు, భారీ నీడ ఉన్న చెట్టు దగ్గర తులసి మొక్కను నాటడం వల్ల తగినంత సూర్యరశ్మి, స్వచ్ఛమైన గాలి లభించదు. దీని వల్ల మొక్క పెరుగుదల దెబ్బతింటుంది. అటువంటి పరిస్థితిలో, తులసి మొక్కను నాటడానికి ఎల్లప్పుడూ మంచి సూర్యరశ్మి, స్వచ్ఛమైన గాలి ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోండి.

పాలు కారే మొక్క

తెల్ల పాలు వంటి జిగట పదార్థాన్ని స్రవించే కొన్ని మొక్కలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, జిల్లేడు మొక్కలాంటివి. చాలా ఇళ్లలో ఈ మొక్కలు కనిపిస్తాయి. అలాంటి మొక్కల చుట్టూ తులసి మొక్కను పెంచకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ప్రవాహం పెరుగుతుంది. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యం నుండి శ్రేయస్సు వరకు అన్నింటిపై చెడు ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు.

ఇంటి ఆవరణలో తులసి మొక్కతో పాటూ ఎక్కువ నీరు అవసరమయ్యే మొక్కలు ఉంటాయి. మీ ఇంట్లో అలాంటి మొక్క ఉంటే, దానిని తులసి మొక్కకు దూరంగా ఉంచండి. నిజానికి తులసి మొక్కకు ఎక్కువ నీరు మంచిది కాదు. తులసి మొక్కకు ఎక్కువ నీరు తగిలితే పాడయ్యే అవకాశం ఉంది. తులసి మొక్క ఎండిపోవడం వల్ల కూడా ఇంట్లో ప్రతికూలత పెరిగిపోతుంది.

శమీ మొక్క

హిందూ మతంలో శమీ మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శమీ మొక్క శివుని నివాసం అని నమ్ముతారు. అందుకని, దీనిని ఇంట్లో ఉంచడం చాలా పవిత్రంగా భావిస్తారు. దీన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చెబుతారు.అయితే తులసి, శమీ మొక్కలను కలిపి నాటితే దాని ప్రతికూల ప్రభావాలను కూడా చూడవచ్చు. ఈ రెండు మొక్కలు మీ ఇంట్లో ఉంటే, వాటిని ఎల్లప్పుడూ నాలుగైదు అడుగుల దూరంలో నాటండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివిటీ ఉంటుంది.

Whats_app_banner