ఎవరి దగ్గరైనా సరే.. వీటిని ఉచితంగా ఎప్పుడూ తీసుకోకండి..! అప్పుల పాలు అవుతారు, ఖర్చులు పెరుగుతాయి!-never take these items for free debts and expenses increase ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఎవరి దగ్గరైనా సరే.. వీటిని ఉచితంగా ఎప్పుడూ తీసుకోకండి..! అప్పుల పాలు అవుతారు, ఖర్చులు పెరుగుతాయి!

ఎవరి దగ్గరైనా సరే.. వీటిని ఉచితంగా ఎప్పుడూ తీసుకోకండి..! అప్పుల పాలు అవుతారు, ఖర్చులు పెరుగుతాయి!

Ramya Sri Marka HT Telugu
Dec 17, 2024 04:30 PM IST

హడావిడిగా పనిచేస్తున్నప్పుడు ఇంట్లో కొన్ని వస్తువులు మనకు అందుబాటులో ఉండవు. అలాంటప్పుడు ఇరుగు పొరుగు లేదా బంధువుల ఇంట్లో నుంచి కొన్ని వస్తువులను తెచ్చుకుంటాం. వాస్తు ప్రకారం ఇలా ఉచితంగా కానీ అరువుగా కానీ కొన్ని వస్తువులను ఎప్పుడూ తీసుకోకూడదట. ఇలా చేయడం వల్ల అప్పులు, ఖర్చులు పెరుగుతాయట.

ఎవరి దగ్గరైనా సరే..  వీటిని ఉచితంగా ఎప్పుడూ తీసుకోకండి..!
ఎవరి దగ్గరైనా సరే.. వీటిని ఉచితంగా ఎప్పుడూ తీసుకోకండి..!

ఉప్పు పప్పు నుంచీ సూచీ దారం వరకూ ఇవ్వడం, తీసుకోవడం ప్రపంచంలో సర్వసాధారణమైన విషయం. హడావిడిగా ఇంట్లో పనులు చేస్తున్నప్పుడు మనకు కొన్ని వస్తువులు అందుబాటులో ఉండవు. బయటకు వెళ్లి కొనుక్కుని వచ్చే అంత సమయం కూడా ఉండదు. అలాంటప్పుడు ఇరుగు, పొరుగు వారి నుంచో లేదా స్నేహితులు, బంధువుల ఇంటి నుంచో వాటిని తెచ్చుకుంటూ ఉంటాం. మళ్లీ ఇవ్వచ్చులే అనుకని అప్పుగా తెచ్చుకున్నా సరే అది మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు ప్రకారం వస్తువు ఎంత చిన్నదైనా, తక్కువ ఖరీదైనా సరే కొన్ని రకాల వస్తువులను లేదా ఆహార పదార్థాలను ఉచితంగా తెచ్చుకోవడం శుభం కాదట. కొన్ని వస్తువులను ఉచితంగా తీసుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయట. ఖర్చులు భారీగా పెరుగుతాయట. ఆ వస్తువులేంటో ఇక్కడ తెలుసుకోవచ్చు.

yearly horoscope entry point

ఉచితంగా తీసుకోకూడని వస్తువులు..

సూది:

మత విశ్వాసాల ప్రకారం బట్టలు కుట్టడానికి ఉపయోగించే సూదిని ఉచితంగా తీసుకోకూడదు. వారే వాళ్ల సూదిని మనం ఉపయోగించుకోవడం అశుభమని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో కలహాలు, భాధలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితులపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది.

నూనె:

చాలాసార్లు మనం ఇంట్లో వంట చేసేటప్పుడు నూనె అయిపోయినప్పుడు ఇరుగుపొరుగు వారి సహాయం తీసుకుంటాం. వాస్తు శాస్త్రంలో నూనె శ్రేయస్సుకు సంబంధించినది. ఇటువంటి నూనెను ఉచితంగా తీసుకోవడం వల్ల మీ ఆర్థిక శ్రేయస్సు క్షీణిస్తుంది. ముఖ్యంగా ఆవ నూనెను ఇతరుల నుంచి ఉచితంగా తీసుకోవడం వల్ల మీరు అప్పులపాలు అవుతారని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇది ఆర్థిక పరిస్థితిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

ఉప్పు:

ఉప్పే కదా అని ఎప్పుడూ ఈజీగా తీసుకోవద్దు. వాస్తు శాస్త్రంలో ఉప్పుకు ప్రధాన్యత ఎక్కువ. ఉప్పును ఎవరి దగ్గరా ఉచితంగా తీసుకోకూడదు. మత విశ్వాసాల ప్రకారం ఉప్పు శని గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. మీరు ఎప్పుడైనా బలవంతం మీద ఎవరి దగ్గరైనా ఉచితంగా ఉప్పు తీసుకోవాల్సి వస్తే, దానికి బదులుగా ఇంకేదైనా ఇవ్వాలి. ఉప్పును ఉచితంగా తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సు దెబ్బతింటాయి. ఫలితంగా కఠినమైన సమయాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.

ఇనుము:

మత విశ్వాసాల ప్రకారం ఇనుము శని గ్రహానికి సంబంధించినది. కనుక ఇతరులకు చెందిన ఇనుము వస్తువులను మనం ఉచితంగా తీసుకోకూడదు. కనీసం ఉపయోగించడం కూడా మంచిది కాదు. ఇలా చేయడం వల్ల అప్పుల బాధ పెరుగుతుంది. కుటుంబంలో అశాంతి వాతావరణం నెలకొంటుంది. శారీరక సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.

పర్సు:

చాలాసార్లు కొంతమంది పర్సులను ఉచితంగా ఇస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇతరుల పర్సు మీరు ఉపయెగించడం మంచిది కాదు. బహుమతులుగా కూడా పర్సును ఇతరులకు ఇవ్వకూడదు, తీసుకోకూదడు. ఇలా చేయడం వల్ల మన సంపద స్థితి, ప్రభావం ఇతరులకు వెళ్లిపోతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. వేరు వేరు వెబ్‌సైట్లు, నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఇది కేవలం మీ నమ్మకాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.

Whats_app_banner